ఆ చైనా ఎలక్ట్రిక్ కారుకి పెరుగుతున్న డిమాండ్; జులైలో 600కి పైగా బుకింగ్స్!

భారతదేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, దేశీయ విపణిలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ జోరందుకుంది. తాజాగా, చైనాకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ గత నెలలో భారీ బుకింగ్స్ దక్కించుకుంది.

ఆ చైనా ఎలక్ట్రిక్ కారుకి పెరుగుతున్న డిమాండ్; జులైలో 600కి పైగా బుకింగ్స్!

జులై 2021లో ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ కోసం 600 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం పెరుగుతున్న డిమాండ్‌ను చూస్తుంటే సంతోషంగా ఉందని ఎమ్‌జి మోటార్ ఇండియా అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా తెలిపారు.

ఆ చైనా ఎలక్ట్రిక్ కారుకి పెరుగుతున్న డిమాండ్; జులైలో 600కి పైగా బుకింగ్స్!

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీని తొలిసారిగా జనవరి 2020 లో భారతదేశంలో విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని కూడా విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీటిలో ఎక్సైట్ అనే బేస్ వేరియంట్ ధర రూ.20.99 లక్షలు కాగా, ఎక్స్‌క్లూజివ్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.24.18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

ఆ చైనా ఎలక్ట్రిక్ కారుకి పెరుగుతున్న డిమాండ్; జులైలో 600కి పైగా బుకింగ్స్!

ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించిన మోటార్ గరిష్టంగా 141 బిహెచ్‌పి శక్తిని మరియు 353 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 44.5 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ కారుకేవలం 8.5 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

ఆ చైనా ఎలక్ట్రిక్ కారుకి పెరుగుతున్న డిమాండ్; జులైలో 600కి పైగా బుకింగ్స్!

రేంజ్ విషయానికి వస్తే, ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 419 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఈ విభాగంలో టాటా నెక్సాన్ ఈవీ ఆఫర్ రేంజ్ (312 కిమీ) కన్నా ఎక్కువ మరియు హ్యుందాయ్ కోన ఆఫర్ చేసే రేంజ్ (452 ​​కిమీ) కన్నా తక్కువ.

ఆ చైనా ఎలక్ట్రిక్ కారుకి పెరుగుతున్న డిమాండ్; జులైలో 600కి పైగా బుకింగ్స్!

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ చార్జింగ్ సమయానికి వస్తే, హోమ్ ఛార్జర్ ద్వారా అయితే, జెడ్‌ఎస్ ఈవిని 80 శాతం వరకూ ఛార్జ్ చేయటానికి 6 నుండి 7 గంటల సమయం పడుతుంది. అదే 50 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, ఈ ఎస్‌యూవీని కేవలం 50 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

ఆ చైనా ఎలక్ట్రిక్ కారుకి పెరుగుతున్న డిమాండ్; జులైలో 600కి పైగా బుకింగ్స్!

ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో త్రీ-లెవల్ బ్రేకింగ్ రీజనరేషన్ టెక్నాలజీ కూడా ఉంది, ఇది డ్రైవర్ బ్రేక్ నొక్కినప్పుడు బ్యాటరీలను ఛార్జ్ చేస్తుంది, ఫలితంగా డ్రైవింగ్ రేంజ్ పెరుగుతుంది. ఈ కారులోని బ్యాటరీ ప్యాక్ ఎనిమిది సంవత్సరాల వారంటీని కలిగి ఉంటుంది.

ఆ చైనా ఎలక్ట్రిక్ కారుకి పెరుగుతున్న డిమాండ్; జులైలో 600కి పైగా బుకింగ్స్!

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో స్టార్-రైడర్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, హీటెడ్ రియర్ వ్యూ మిర్రర్స్, రూఫ్ ట్రాక్స్, ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క ‘ఐ-స్మార్ట్' కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది.

ఆ చైనా ఎలక్ట్రిక్ కారుకి పెరుగుతున్న డిమాండ్; జులైలో 600కి పైగా బుకింగ్స్!

ఇంకా ఇందులో, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2.5 పిఎమ్ ఎయిర్-ఫిల్టర్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ మరియు స్మార్ట్‌ఫోన్ ద్వారా లేదా ఏఐ సహాయంతో మీ కారును కంట్రోల్ చేయటానికి 60కి పైగా కమాండ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
MG ZS EV Gets 600 Plus Booking In July 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X