Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 4 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న ఎంజి జెడ్ఎస్ పెట్రోల్ : పూర్తి వివరాలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజి మోటార్ తన ఎంజి హెక్టర్, ఎంజి హెక్టర్ 6-సీటర్ మరియు ఎంజి జెడ్ఎస్ ఈవిని భారత మార్కెట్లో విక్రయిస్తుంది. ఇప్పుడు కంపెనీ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎంజి జెడ్‌ఎస్ ఈవి పెట్రోల్ వేరియంట్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తుంది.

ఈ కారణంగా ఎంజి మోటార్ కంపెనీ ఈ కారును భారతదేశంలో నిరంతరం పరీక్షలకు గురి చేస్తోంది. ఇది ఇప్పటికే చాలా సార్లు భారతీయ రహదారులపై గుర్తించబడింది. ఇది మార్కెట్లో లాంచ్ తరువాత, హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

ఇటీవల ఈ కారును ఏషియన్ ఎన్‌సిఏపి టెస్ట్ చేసి ఫలితాలను వెల్లడించింది. వెలువడిని టెస్ట్ రెసుల్త్ ప్రకారం ఎంజి జెడ్ఎస్ ఎస్‌యూవీ ఏషియన్ ఎన్‌సిఏపి యొక్క క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను కైవసం చేసుకున్నట్లు తెలిసింది.
MOST READ:ఇక బ్యాటరీ చార్జింగ్ సమస్యే ఉండదు; కొత్తగా 500, రెండేళ్లలో 10,000 చార్జింగ్ స్టేషన్లు

ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ క్రాష్ టెస్ట్ లో ఉపయోగించిన ఎంజి జెడ్ఎస్ పెట్రోల్ ఎస్‌యువి థాయ్‌లాండ్‌లో ఉత్పత్తి చేయబడింది. అంతే కాకుండా ఇది థాయిలాండ్ మరియు వియత్నాం మార్కెట్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది.

ఏషియన్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ యొక్క ఫలితాల ప్రకారం ఇందులో అడల్ట్ సేఫ్టీ కోసం ఎంజి జెడ్ఎస్ పెట్రోల్ 44.82 పాయింట్లు సాధించగా, పిల్లల సేఫ్టీ కోసం 20.90 పాయింట్లు సాధించింది. కంపెనీ తన ఎంజీ జెడ్‌ఎస్ పెట్రోల్ వెర్షన్ ని భారత్‌కి దిగుమతి చేసే అవకాశం లేదు.
MOST READ:న్యూ ఇయర్లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

కానీ ఎంజి మోటార్ కంపెనీ దీని స్థానంలో, మరొక ఎస్‌యూవీని గుజరాత్ ప్లాంట్ లో తయారు చేస్తారు. దీని డిజైన్ గమనించినట్లయితే ఇందులో సన్నని ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ మరియు కొత్త బంపర్‌ను కలిగి ఉంది. ఇది ముందు నుండి చాలా పదునైనదిగా కనిపిస్తుంది. దాని మెష్ గ్రిల్‌లో అతిపెద్ద మార్పు జరిగింది.

2020 సంవత్సరంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2020 లో ఎంజీ మోటార్ తన ఎస్‌యూవీని ప్రదర్శించింది. ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించిన మోడల్‌తో పోలిస్తే భారతదేశంలో ప్రారంభించబోయే జెడ్‌ఎస్‌లో చాలా ఎక్కువ మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.
రిమోట్ ద్వారా కార్ లాక్ చేస్తున్నారా.. టేక్ కేర్.. ఎందుకంటే వీడియో చూడండి?

ఎంజి జెడ్‌ఎస్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో క్రూయిజ్ కంట్రోల్, ఎబిఎస్, ఇబిడి, ఫ్రంట్ సైడ్ మరియు రియర్ ఎయిర్‌బ్యాగ్స్, హిల్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. జెడ్‌ఎస్ ముందు మరియు వెనుక పవర్ విండోస్ మరియు 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.3 టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో విక్రయించబడుతోంది. ఈ కారును భారతదేశంలో ప్రవేశపెడితే ఏ ఇంజిన్ అప్సన్ కలిగి ఉంటుందో కంపెనీ ఖచ్చితంగా తెలుపలేదు. అయితే కంపెనీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
MOST READ:రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న అజారుద్దీన్ కారు ; తృటిలో తప్పిన ప్రమాదం

ఎంజీ జెడ్‌ఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ భారత్ లో ప్రవేశపెట్టడానికి కంపెనీ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉన్న ఈ ఎస్‌యూవీ పెట్రోల్‌తో నడిచే వెర్షన్‌ను త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎంజి జెడ్ఎస్ పెట్రోల్ ఎస్‌యూవీ ధర కొంత అధికంగానే ఉండే అవకాశం ఉంటుంది.