స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త MG Astor: వివరాలు

MG Motor (ఎంజి మోటార్) కంపెనీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతితక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో ఇప్పటికే MG Hector, MG Gloster వంటివి లాంచ్ చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీకి అనుకూలంగా వాహనాలలో కూడా అధునాత ఫీచర్స్ ఏర్పాటు చేయడం తప్పనిసరి. కావున MG Motor కంపెనీ ఈ దిశగా అడుగులు వేస్తూ ఇటీవల MG Astor అనే కొత్త మోడల్ విడుదలకు సన్నాహాలు సిద్ధం చేస్తుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త MG Astor: వివరాలు

ఇటీవల MG Motor యొక్క MG Astor టెస్టింగ్ సమయంలో గుర్తించబడింది. ఇందులో ఈ కాంపాక్ట్ SUV యొక్క డిజైన్ గమనించవచ్చు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ఈ కొత్త MG Astor వివిధ ప్రాంతాలలో టెస్ట్ చేయబడుతుంది. ఈ MG Astor మునుపటి మోడల్స్ కంటే కూడా లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుందని ఇప్పటికే వెల్లడించింది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త MG Astor: వివరాలు

MG Motor కంపెనీ ఇటీవల కొత్త MG Astor యొక్క ఇంజిన్ మరియు ఫీచర్ల వంటి విషయాలను కూడా వెల్లడించింది. అయితే ఇప్పుడు కంపెనీ MG Astor ను పర్వత ప్రాంతాలలో టెస్ట్ చేస్తోంది. టెస్టింగ్ సమయంలో కొన్ని ఫోటోలు కూడా బయటపడ్డాయి. ఇందులో ఈ కొత్త MG Astor యొక్క డిజైన్ కొంతవరకు గమనించవచ్చు.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త MG Astor: వివరాలు

టెస్టింగ్ సమయంలో గుర్తించబడిన ఈ కొత్త MG Astor ముందు భాగంలో ఆకర్షణీయమైన గ్రిల్ ఉంటుంది. అయితే ఇది చూడటానికి దాదాపు దాని కాన్సెప్ట్ మోడల్‌ మాదిరిగా అనిపిస్తుంది. ఈ కారు యొక్క సైడ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ గమనించవచ్చు. సైడ్ ప్రొఫైల్ కూడా ఆకర్షణీయంగానే ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త MG Astor: వివరాలు

MG Astor సైడ్ ప్రొఫైల్ లో 5-స్పోక్ అల్లాయ్ వీల్ చూడవచ్చు, ఇది కారుని చాలా ఆకర్షణీయంగా చేస్తుంది. అంతే కాకూండా ఇండికేటర్‌తో పాటుగా ORVM లో చూడవచ్చు. MG ఆస్టర్ యొక్క డోర్ హ్యాండిల్ మరియు రూఫ్ రైల్ కూడా ఇందులో మీరు గమనించవచ్చు.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త MG Astor: వివరాలు

MG Astor యొక్క రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ టైల్ లైట్స్ మరియు మధ్య భాగంలో ఉన్న MG లోగో వంటివి చూడవచ్చు. ఈ కొత్త మోడల్ లో కూడా ఛార్జింగ్ పోర్ట్ ముందుభాగంలో ఏర్పాటు చేయబడి ఉంటుంది. అంతే కంపెనీ యొక్క MG ZS EV మోడల్ లో మాదిరిగా.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త MG Astor: వివరాలు

MG Astor యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపాలు మెరూన్ కలర్ ఉపయోగించినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఇందులో ఏసీ వెంట్‌లు రెండు వైపులా ఉంచబడ్డాయి. డాష్‌బోర్డ్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మధ్యలో ఉంచబడి గేర్‌బాక్స్ దాని క్రింద ఉంచబడింది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త MG Astor: వివరాలు

MG Motor కంపెనీ ఈ కొత్త MG Astor SUV ని పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లాంచ్ చేసే అవకాశం ఉంది. కావున ఇందులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ లేదా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు మాన్యువల్ ఆప్షన్‌తో అందించబడుతుంది. అయితే కంపెనీ దీని గురించి అధికారిక సమాచారం అందించలేదు.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త MG Astor: వివరాలు

కంపెనీ MG Astor ను డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌తో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కావున ఇది బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఈ డ్యూయెల్ టోన్ కలర్ లోపల డాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్‌లు మరియు సీట్లపై కూడా ఉంటుంది. అంతే కాకూండా డాష్‌బోర్డ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చుట్టూ స్మూత్ లెదర్ ఉపయోగించవచ్చు.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త MG Astor: వివరాలు

కంపెనీ ఇదివరకు ఈ కొత్త SUV గురించి అందించిన అధికారిక సమాచారం ప్రకారం, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇది క్యాబిన్ లోపల డాష్‌బోర్డ్‌పై అమర్చబడిన చిన్న రోబోట్. ఈ రోబోపై చిన్న స్క్రీన్ కూడా ఇవ్వబడింది. ఇది రోబోట్ యొక్క వ్యక్తీకరణను చూపుతుంది. ఇది వాయిస్ ద్వారా డ్రైవర్‌ను గుర్తిస్తుంది, అంతే కాకుండా వాయిస్ కమాండ్‌ల ఆధారంగా పనిచేస్తుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త MG Astor: వివరాలు

ఇందులోని సెంట్రల్ కన్సోల్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది మరియు ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో వస్తుంది. ఏసీ వెంట్‌లు టచ్‌స్క్రీన్ పైన ఉంచబడ్డాయి, కంట్రోల్ స్విచ్‌లు స్క్రీన్ క్రింద ఉంచబడ్డాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త MG Astor: వివరాలు

ప్రస్తుతం టెస్టింగ్ సమయంలో కనిపించే ఫీచర్స్ కి మరియు అసలైన మోడల్ లోని ఫీచర్స్ కి చాలా తేడా ఉంటుంది. కావునఈ కొత్త MG Astor లోని ఫీచర్స్ మరియు పరికరాలు మరియు ఇంజిన్ వంటి వాటి వివరాలు అధికారికంగా విడుదలవుతాయి. అయితే MG Motor యొక్క ఈ కొత్త మోడల్ భారతీయ మార్కెట్లో పండుగ సీజన్లలో విడుదలకానున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ కొత్త MG Astor అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలము.

Most Read Articles

English summary
New mg astor suv spied testing details
Story first published: Saturday, August 28, 2021, 11:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X