టెస్లా సైబర్ ట్రక్కుకి పోటీగా కానూ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్!

టెస్లా సైబర్ ట్రక్కుకు సవాల్ విసిరేందుకు మరో అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ సిద్ధమైంది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ 'కానూ' (Canoo) తమ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును పరిచయం చేసింది.

టెస్లా సైబర్ ట్రక్కుకి పోటీగా కానూ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్!

గత 2019లో కానూ ఆవిష్కరించిన ప్యాసింజర్ వ్యాన్ కాన్సెప్ట్ ఆధారంగానే ఈ పికప్ ట్రక్కును కూడా తయారు చేసినట్లుగా తెలుస్తుంది. ముందు వైపు నుండి చూస్తే ఈ రెండు వాహనాల డిజైన్ ఒకేలా ఉంటుంది. ఈ పికప్ ట్రక్కు పేలోడ్ సామర్థ్యం 1800 పౌండ్లుగా ఉంటుందని, పూర్తి చార్జ్‌పై ఇది 320 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

టెస్లా సైబర్ ట్రక్కుకి పోటీగా కానూ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్!

కానూ పికప్ ట్రక్కు కోసం 2021 ద్వితీయ త్రైమాసికంలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. అయితే, డెలివరీలు మాత్రం 2023లో ప్రారంభమవుతాయి. కానూ పికప్ ట్రక్కులో అనేక విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:కవాసకి ఆఫ్-రోడ్ బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

టెస్లా సైబర్ ట్రక్కుకి పోటీగా కానూ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్!

ఈ పికప్ ట్రక్కులో లోపలి వైపు ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. అయితే, కావాలనుకుంటే, ఇందులో మధ్యలోని ఆర్మ్‌రెస్ట్‌లను తొలగించి ముగ్గురు ప్రయాణీకులు కూర్చునేలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్‌లో కంపెనీ ఓ క్యాంపర్ వెర్షన్‌ను కూడా పరిచయం చేసింది.

టెస్లా సైబర్ ట్రక్కుకి పోటీగా కానూ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్!

ఈ ట్రక్కులో అదనపు లగేజ్‌ను తీసుకువెళ్లానుకునే వారి కోసం ఇందులో పూర్తిగా సర్దుబాటు మరియు పొడగింపు చేయగల ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ట్రక్కు వెనుక భాగంలో ఉండే డోర్ మధ్యకు తెరచుకుని పూర్తి పికప్ బెడ్‌కు యాక్సెస్ కల్పిస్తుంది.

MOST READ:టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!

టెస్లా సైబర్ ట్రక్కుకి పోటీగా కానూ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్!

అలాగే, ఈ పికప్ ట్రక్కు ముందు భాగం, రూఫ్ మరియు సైడ్ ప్యానెళ్లపై కూడా అదనపు లగేజ్‌ను క్యారీ చేయడానికి కంపెనీ వీలు కల్పించింది. ఇందులో పుల్-బెడ్ ఎక్స్‌టెన్షన్, ఫోల్డ్ డౌన్ వర్క్‌టేబుల్ మరియు కార్గో స్టోరేజ్, ఫ్లిప్-డౌన్ సైడ్ టేబుల్స్, సైడ్ స్టెప్ అండ్ స్టోరేజ్, స్పేస్ డివైడర్‌లతో మాడ్యులర్ బెడ్ మరియు మల్టీ-యాక్సెసరీ ఛార్జ్ పోర్ట్ మొదలైనవి ఉన్నాయి.

టెస్లా సైబర్ ట్రక్కుకి పోటీగా కానూ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్!

కానూ పికప్ ట్రక్కులో ఎలక్ట్రిక్ మోటార్ విషయానికి వస్తే, ఇది రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇందులో వెనుక భాగంలో ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కావాలనుకునే వారు ఇరువైపులా రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండే వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

టెస్లా సైబర్ ట్రక్కుకి పోటీగా కానూ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్!

రెండు మోటార్లతో కూడిన వేరియంట్ గరిష్టంగా 600 హెచ్‌పి పవర్‌ను మరియు 550 ఎల్‌బి-ఫుట్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టీర్-బై-వైర్ మరియు బ్రేక్-బై-వైర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇందులో టోయింగ్ ఫీచర్ కోసం వెనుక వైపు టో హిచ్ రిసీవర్ కూడా ఉంటుంది.

టెస్లా సైబర్ ట్రక్కుకి పోటీగా కానూ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్!

ఈ ట్రక్కు మొత్తం పొడవు 4677 మిమీగా ఉంటుంది, అదే పికప్ బెడ్‌ను పొడగించినట్లయితే దీని మొత్తం పొడవు 5400 మి.మీగా ఉంటుంది. దీని వీల్‌బేస్ 2850 మిమీ, వెడల్పు 1980 మిమీ మరియు ఎత్తు 1920 మిమీగా ఉంటుంది. ఇందులోని బ్యాటరీలు పూర్తి చార్జ్‌పై 200 మైళ్లకు పైగా రేంజ్‌ను ఆఫర్ చేస్తాయని కంపెనీ చెబుతోంది.

MOST READ:గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

Most Read Articles

English summary
Tesla Cyber Truck Rival Canoo Electric Pickup Truck Is Here, All Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X