టొయోటా యారిస్ ఉత్పత్తి నిలిపివేత; దాని స్థానంలో రానున్న మారుతి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్!

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా భారత మార్కెట్లోని తమ ప్రోడక్ట్ లైనప్‌లో పెద్ద మార్పులు చేయబోతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ దేశీయ విపణిలో విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ టొయోటా యారిస్ ఉత్పత్తిని నిలిపివేయనుంది. దాని స్థానంలో కంపెనీ కొత్తగా మారుతి సుజుకి సియాజ్ ఆధారిత మోడల్‌ను తీసుకురానున్నట్లు సమాచారం.

టొయోటా యారిస్ ఉత్పత్తి నిలిపివేత; దాని స్థానంలో రానున్న మారుతి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్!

ఆటోకార్ ఇండియా నుండి ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం, టొయోటా దేశంలో యారిస్ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలిపింది. మిడ్-సైజ్ సెడాన్ విభాగంలో మారుతి సుజుకి విక్రయిస్తున్న సియాజ్ మాదిరిగానే టొయోటా కూడా తమ యారిస్ సెడాన్‌ను విక్రయిస్తూ వచ్చింది. అయితే, ఇకపై ఈ ఉత్పత్తి మార్కెట్ నుండి తొలగిపోనుంది.

టొయోటా యారిస్ ఉత్పత్తి నిలిపివేత; దాని స్థానంలో రానున్న మారుతి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్!

భారత మార్కెట్లో టొయోటా యారిస్ సెడాన్ అమ్మకాలు తక్కువగా ఉన్నందున కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో మారుతి సుజుకి విక్రయిస్తున్న సియాజ్ సెడాన్ అమ్మకాలు మాత్రం ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ యారిస్ సెడాన్‌ను సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్‌తో భర్తీ చేయాలని చూస్తోంది.

MOST READ:అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

టొయోటా యారిస్ ఉత్పత్తి నిలిపివేత; దాని స్థానంలో రానున్న మారుతి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్!

మారుతి సుజుకి మరియు టొయోటా కిర్లోస్కర్ కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, మారుతి సుజుకి తయారు చేసే కొన్ని రకాల మోడళ్లను టొయోటా కొనుగోలు చేసి తమ స్వంత బ్రాండిగ్‌తో విక్రయించుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే మారుతి బాలెనో ఆధారిత టొయోటా గ్లాంజా మరియు మారుతి విటారా బ్రెజ్జా ఆధారిత టొయోటా అర్బన్ క్రూయిజర్ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి.

టొయోటా యారిస్ ఉత్పత్తి నిలిపివేత; దాని స్థానంలో రానున్న మారుతి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్!

ఇప్పుడు తాజాగా, కంపెనీ తమ టొయోటా యారిస్ సెడాన్‌ను నిలిపివేస్తున్న నేపథ్యంలో, దాని స్థానంలో మారుతి సుజుకి సియాజ్ ఆధారిత సెడాన్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ రీబ్యాడ్జ్ వెర్షన్ మారుతి సియాజ్ సెడాన్‌ను టొయోటా బెల్టా పేరుతో భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని సమాచారం. ఇది ఈ బ్రాండ్ నుండి రానున్న మూడవ రీబ్యాడ్జ్ మోడల్ అవుతుంది.

MOST READ:లాక్‌డౌన్ రూల్స్ గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కొడుకు.. ఎవరో తెలుసా..?

టొయోటా యారిస్ ఉత్పత్తి నిలిపివేత; దాని స్థానంలో రానున్న మారుతి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్!

టొయోటా బెల్టా అనే పేరును కంపెనీ ఇప్పటికే పలు గ్లోబల్ మార్కెట్లలో ఉపయోగిస్తోంది. ఈ పేరుతో కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో సెడాన్ బాడీ టైప్ కారును విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, టొయోటా తమ ఇంటర్నేషనల్ మోడల్‌ను నేరుగా భారతదేశానికి తీసుకువచ్చే బదులుగా, మారుతి సుజుకి నుండి సియాజ్‌ను ఓఈఎమ్ (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫాక్చరర్)గా కొనుగోలు చేసి, తమ బ్రాండ్ పేరుతో రీబ్యాడ్జ్ చేసి విక్రయించాలని ప్లాన్ చేస్తోంది.

టొయోటా యారిస్ ఉత్పత్తి నిలిపివేత; దాని స్థానంలో రానున్న మారుతి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్!

ఇలా చేయటం వలన కంపెనీ టొయోటా బెల్టా సెడాన్ ఖర్చును చాలా తక్కువగా ఉంచేందుకు సాధ్యమవుతుంది. టొయోటా తయారీ ఖర్చు వద్ద మారుతి సుజుకి సియాజ్ ఫ్రేమ్‌ను కొనుగోలు చేసి, తమ బ్రాండ్ ఇంటీరియర్స్ మరియు హంగులతో దానిని తీర్చిదిద్ది టొయోటా బెల్టా అనే బ్యాడ్జ్ అంటించి ఈ కారును విక్రయించనున్నారు.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ ఉపయోగిస్తున్న వ్యక్తి ఇతడే..

టొయోటా యారిస్ ఉత్పత్తి నిలిపివేత; దాని స్థానంలో రానున్న మారుతి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్!

సింపుల్‌గా చెప్పాలంటే టొయోటా బెల్టా అనేది కొత్త దుస్తులు ధరించిన మారుతి సుజుకి సియాజ్ మాదిరిగా ఉంటుందన్నమాట. ఇప్పటి వరకూ మార్కెట్లో లభించిన టొయోటా యారిస్ సెడాన్ సింగిల్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమయ్యేది. ఈ ఇంజన్ 106 బిహెచ్‌పి శక్తిని మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సెవన్-స్పీడ్ సూపర్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమయ్యేది.

టొయోటా యారిస్ ఉత్పత్తి నిలిపివేత; దాని స్థానంలో రానున్న మారుతి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్!

కాగా, కొత్తగా రానున్న టొయోటా బెల్టా సెడాన్ మారుతి సుజుకి సియాజ్‌లో ఉన్న అన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మరియు ఇంజన్ ఆప్షన్లను యధావిధిగా కలిగి ఉంటుంది. సియాజ్‌లో లభిస్తున్న మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ కూడా టొయోటా బెల్టా సెడాన్‌లో లభించే అవకాశం ఉంది. ఇది సుజుకి యొక్క ఎస్‌విహెచ్ఎస్ టెక్నాలజీతో అదే 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

టొయోటా యారిస్ ఉత్పత్తి నిలిపివేత; దాని స్థానంలో రానున్న మారుతి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్!

ఈ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా ఫోర్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, క్రోమ్-ఫినిష్డ్ విండో లైన్ వంటి మరెన్నో ఎక్స్టీరియర్ ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి.

టొయోటా యారిస్ ఉత్పత్తి నిలిపివేత; దాని స్థానంలో రానున్న మారుతి సియాజ్ రీబ్యాడ్జ్ వెర్షన్!

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, మారుతి సుజుకి సియాజ్‌లో కనిపించిన అన్ని ఫీచర్లు టొయోటా బెల్టా సెడాన్‌లో కూడా ఉండనున్నాయి. ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి మద్దతునిచ్చే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బహుళ ఎయిర్‌బ్యాగులు మొదైలనవి ఉండనున్నాయి.

Source:Autocar India

Most Read Articles

English summary
Toyota Stops Yaris Production In India; To Be Replaced With Maruti Ciaz Based Belta Sedan, Details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X