ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు.. అసలు రికార్డ్ ఏంటంటే..?

చైనీస్ ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ 'బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో' (BYD Auto) భారత మార్కెట్లో ఓ ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తున్న సంగతి మీకు తెలుసా? ఇప్పుడు అదే ఎలక్ట్రిక్ కారు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. ఈ కంపెనీ విక్రయిస్తున్న బివైడి ఇ6 (BYD e6) ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ పవర్‌పై గరిష్ట దూరాన్ని కవర్ చేసిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించింది. ఈ రికార్డులో భాగంగా BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి 6 రోజుల్లో ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లే మార్గంలో 9 నగరాలను కవర్ చేస్తూ 2,203 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు.. అసలు రికార్డ్ ఏంటంటే..?

ఒక ఎలక్ట్రిక్ కారుతో ఇలాంటి ఘనత సాధించడం నిజంగా అరుదైన విషయమే. ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల కోసం అనేక సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి చార్జింగ్ మౌళిక సదుపాయాలు అంతంతమాత్రంగా ఉండటంతో, పట్టణాలలో నివశించే కొనుగోలుదారులు మాత్రమే ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువ దూరప్రయాణాలు చేసే కస్టమర్లు మాత్రం సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ కార్లనే కొనేందుకు ఇష్టపడుతున్నారు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు.. అసలు రికార్డ్ ఏంటంటే..?

అయితే, తమ ఎలక్ట్రిక్ కారు సత్తా ఏంటో చూపేందుకు బివైడి ఆటో తమ ఇ6 ఎలక్ట్రిక్ కారులో ఏకధాటిగా ఆరు రోజుల పాటు 9 నగరాల గుండా ప్రయాణిస్తూ మొత్తం 2,203 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. బివైడి ఆటో నవంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో తమ మొట్టమొదటి 'ఇ6' (e6) ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని విడుదల చేసింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును చైనా నుండి భారతదేశానికి దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. బివైడి ఆటో భారత మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ల్యాండ్‌మార్క్ గ్లోబల్ అనే సంస్థతో కూడా ఓ వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు.. అసలు రికార్డ్ ఏంటంటే..?

బివైడి తన ఈ ఆరు రోజుల ప్రయాణంలో వివిధ నగరాలలో అందుబాటులో పబ్లిక్ చార్జర్ల వద్ద తమ ఎలక్ట్రిక్ కారును చార్జ్ చేసుకుంది. బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటి వరకూ 4.7 కోట్ల కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించాయి. ఈ ప్రయాణంలో, ఇ6 ఎలక్ట్రిక్ కారు 4.13 లక్షల గ్రాముల కంటే ఎక్కువ కార్బన్ ఉద్గారాలను ఆదా చేసిందని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో బివైడి ఇ6 ప్రస్తుతానికి వాణిజ్య వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది, వ్యక్తిగత వినియోగదారుల విక్రయం కోసం ఇది అందుబాటులో లేదు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు.. అసలు రికార్డ్ ఏంటంటే..?

బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విషయానికి వస్తే, ఇది చూడటానికి దాదాపు టొయోటా ఇన్నోవా మాదిరిగా కనిపిస్తుంది. అయితే, ఇది కేవలం 5-సీటర్ వెర్షన్ లో మాత్రమే విక్రయించబడుతోంది. బివైడి ఇ6 భారతదేశంలో బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని స్వీకరించిన మొదటి ప్రీమియం ఎమ్‌పివి. బివైడి ఎలక్ట్రిక్ కార్లు వాటి సాంకేతికత, భద్రత, రేంజ్ మరియు ఛార్జింగ్ సైకిల్ వంటి విషయాలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది మరియు ప్రశంసించబడినది. ఈ బ్యాటరీ ప్యాక్ ఇంత అధిక రేంజ్ ను అందించడానికి ప్రధాన కారణంగా, ఇందులో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ టెక్నాలజీని ఉపయోగించడమే. ఇది వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీని 50 శాతం మెరుగుపరుస్తుంది.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు.. అసలు రికార్డ్ ఏంటంటే..?

బివైడి ఆటో భారతదేశానికి చాలా కొత్త ఆటోమొబైల్ బ్రాండ్ కావచ్చు, కానీ ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు ఎంతో క్రేజ్ ఉంది. ఇది ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీదారు మరియు BYD India అనేది దాని అనుబంధ సంస్థ. బివైడి ఇండియా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తమ ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని రూ. 29.15 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో వివిక్రయిస్తోంది. ఇది వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమే విక్రయించబడే ఎలక్ట్రిక్ కారు. ఇది ఐదు సీట్ల కాన్ఫిగరేషన్‌తో టాక్సీగా విక్రయించబడుతోంది. దీనిని ప్రైవేట్ వాహనంగా నమోదు చేసుకోలేరు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు.. అసలు రికార్డ్ ఏంటంటే..?

బివైడి ఇ6 (BYD e6) ఎలక్ట్రిక్ ఎమ్‌పివిలో గరిష్టంగా 94 బిహెచ్‌పి పవర్ మరియు 180 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ పెద్ద 71.7 కిలోవాట్అవర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ పవర్‌ట్రైన్ సాయంతో బివైడి ఇ6 గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, బివైడి ఇ6 నగర డ్రైవింగ్ పరిస్థితులలో పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 520 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది మరియు కంబైన్డ్ డ్రైవింగ్ పరిస్థితులలో ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 415 కిలోమీటర్ల WLTC సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు.. అసలు రికార్డ్ ఏంటంటే..?

ఈ ఎలక్ట్రిక్ ఎమ్‌పివి స్టాండర్డ్ AC చార్జింగ్ మరియు DC ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఈ కారును DC ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా చార్జ్ చేసినప్పుడు, ఈ కారులోని బ్యాటరీ ప్యాక్‌ ను కేవలం 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే దీని ఫాస్ట్ చార్జర్ ద్వారా పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయాలంటే సుమారు గంటన్నర సమయం పడుతుంది. కస్టమర్లు రూ. 45,000 అదనంగా చెల్లిస్తే, కంపెనీ ఈ కారుతో పాటుగా BYD 7kW అనే AC ఛార్జర్‌ ను కూడా అందిస్తుంది.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు.. అసలు రికార్డ్ ఏంటంటే..?

బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు లోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 10 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, లెథర్ సీట్ అప్‌హోలెస్ట్రీ, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్స్ మరియు ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌ వంటి అనేక సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేక్‌లు (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) మొదలైనవి ఉన్నాయి.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న బివైడి ఇ6 ఎలక్ట్రిక్ కారు.. అసలు రికార్డ్ ఏంటంటే..?

ఈ కారులో ఎలక్ట్రిక్ కారులో అమర్చిన కోబాల్ట్-రహిత లిథియం ఫెర్రో పాస్పేట్ (LiFePO4) బ్యాటరీ ప్యాక్ 'బ్లేడ్' చాలా సురక్షితమైనది మరియు ఇది ప్రమాదవశాత్తు పంక్చర్ అయినప్పటికీ కాలిపోవడం లేదా పేలిపోవడం జరగదని కంపెనీ చెబుతోంది. వారంటీ విషయానికి వస్తే, ఈవీపై 3 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్లు, ఎలక్ట్రిక్ మోటార్‌ పై 8 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్లు మరియు బ్యాటరీ సెల్ పై 8 సంవత్సరాలు లేదా 5 లక్షల కిలోమీటర్ల వారంటీ (ఏది ముందుగా ముగిస్తే అది), అందిస్తోంది.

Most Read Articles

English summary
Byd e6 ev enters india book of records for covering 2203 kilometres in 6 days
Story first published: Wednesday, June 22, 2022, 11:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X