'మహీంద్రా XUV700' కి మళ్ళీ రీకాల్.. ఈ సారి సమస్య ఏమంటే?

మహీంద్రా కంపెనీ యొక్క 'ఎక్స్‌యూవీ700' భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి మంచి బుకింగ్స్ పొందుతూ ఇప్పటికీ ఏ మాత్రం డిమాండ్ తగ్గకుండా ముందుకు సాగుతూనే ఉంది. అధిక ప్రజాదరణ పొందిన ఎక్స్‌యూవీ700 లో ఇప్పటికే కొన్ని సమస్యలు తలెత్తినట్లు కస్టమర్లు చెప్పుకొచ్చారు.

కస్టమర్లు చెప్పుకొచ్చిన ఆ సమస్యలను తొలగి సరిచేయడానికి కంపెనీ గతంలో కూడా రీకాల్ ప్రకటించింది. అయితే ఇప్పుడు కొంతమంది కస్టమర్లు XUV700 లో సస్పెన్షన్ శబ్దం గురించి పిర్యాదు చేస్తున్నారు. దీనిని పరిష్కరించడానికి కంపెనీ మరో సారి రీకాల్ ప్రకటించింది. ఫ్రంట్ లోయర్ కంట్రోల్ ఆర్మ్, రియర్ కంట్రోల్ బుష్ వంటి సస్పెన్షన్ కాంపోనెంట్లను కంపెనీ రీప్లేస్ చేయనుంది. అయితే ఈ ఖర్చు మొత్తం కంపెనీ భరిస్తుంది.

మహీంద్రా XUV700 కి మళ్ళీ రీకాల్

మహీంద్రా ఎక్స్‌యూవీ700 యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లు రెండూ కూడా ఈ రీకాల్ కింద కవర్ చేయబడతాయి. అయితే ఈ సమస్య ఉన్న కార్లకు మాత్రమే రీప్లేస్ చేయడం జరుగుతుంది. దీనిని కస్టమర్లు గుర్తుంచుకోవాలి. ఈ రీప్లేస్ కోసం సమీపంలో ఉన్న మహీంద్రా డీలర్షిప్ సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. తమ XUV700 లో ఈ సమస్యను గుర్తించిన కస్టమర్లు త్వరలోనే పరిష్కరించుకోవచ్చు.

ఇప్పటికే మహీంద్రా కంపెనీ ఈ XUV700 లో 'ఆల్టర్నేటర్ బెల్ట్ మరియు ఆటో టెన్షనర్' సరిచేయడం కోసం, ప్రాప్ షాఫ్ట్‌ని తనిఖీ చేసి, అవసరమైతే భర్తీ చేయడానికి, AWD వేరియంట్‌లలో రియర్ కాయిల్ స్ప్రింగ్‌లను తనిఖీ చేయడం కోసం రీకాల్ ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ప్రకటించిన రీకాల్ వరుసగా నాలుగవ సారి అవుతుంది. వరుసగా రీకాల్ ప్రకటించడం వల్ల కస్టమర్లలో ఆందోళన చెందే అవకాశం ఉంది.

నాలుగు సార్లు రీకాల్ ప్రకటించడం కస్టమర్లతో ఆందోళన కలిగించినప్పటికీ, కంపెనీ ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి పరిష్కరిస్తూ ఉంది. మహీంద్రా కంపెనీ తన ఎక్స్​యూవీ700 కోసం బుకింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి 1.5 లక్షల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. ప్రస్తుతానికి 50,000 కంటే యూనిట్లను డెలివరీ చేసింది, ఇంకా 1 లక్ష యూనిట్లు డెలివరీ చేయాల్సి ఉంది. కొన్ని వేరియంట్స్ కోసం కస్టమర్లు దాదాపు 2 సంవత్సరాల వరకు ఎదురుచూడాల్సి ఉంది.

మహీంద్రా ఎక్స్​యూవీ700 ధరలు రూ. 15.9 లక్షల నుంచి రూ. 29.77 లక్షల వరకు ఉన్నాయి. ఈ ఆధునిక SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా మంచి పనితీరుని అందించడానికి రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ కాగా, రెండవది 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌. ఇవి రెండూ మంచి పనితీరుని అందిస్తాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ700 యొక్క 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇక 2.2 లీటర్ టర్బో డీజిల్ విషయానికి వస్తే, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులోని రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ కలిగి ఉన్నాయి.

ఇదిలా ఉండగా మహీంద్రా XUV700 గ్లోబల్ ఎన్‌సిఎపి నుంచి 'సేఫర్ ఛాయిస్ అవార్డు'ను సొంతం చేసుకుంది. గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (GNCAP) నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్‌యువి700 అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లు మరియు పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు 41.66 పాయింట్లు పొందింది. మొత్తం మీదుగా ఇది సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ పొంది బెస్ట్ ఎస్‌యువిగా మారింది.

Most Read Articles

English summary
Mahindra xuv700 recalled yet again resolve suspension issues
Story first published: Saturday, November 26, 2022, 11:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X