కస్టమర్లకు మరింత చేరువ కోసం MG Motor కొత్త ప్లాట్‌ఫారమ్: MG eXpert

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన 'ఎంజి మోటార్ ఇండియా' (MG Motor India) కొత్త కొత్త ఉత్పత్తులను విడుదల చేసి ఈ రోజుకి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు కంపెనీ ఇప్పుడు ఎంజి ఎక్స్‌పర్ట్ (MG eXpert) ను ప్రారంభించింది.

కస్టమర్లకు మరింత చేరువ కోసం MG Motor కొత్త ప్లాట్‌ఫారమ్: MG eXpert

ఎంజి మోటార్ ఇండియా అనేది కంపెనీ అందించే మోడళ్లను అనుభవించడానికి ఆర్టిఫిషియల్ రియాలిటీ (AR) టెక్నాలజీతో ఆధారితమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్. ఈ ప్లాట్‌ఫారమ్ 'ఎంజి మోటార్ ఇండియా' యొక్క వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కావున కస్టమర్లు తమ ఈ ప్లాట్‌ఫారమ్ ను వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

కస్టమర్లకు మరింత చేరువ కోసం MG Motor కొత్త ప్లాట్‌ఫారమ్: MG eXpert

ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే కాకూండా.. ప్రపంచంలో చాలా దేశాల్లో కరోనా ఎక్కువగా వ్యాపించిన రోజు నుంచి కూడా అన్ని కంపెనీలు ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహిస్తోంది. అటువంటి పరిస్థితుల్లో వినియోగదారులకు ఆన్‌లైన్ కార్ కొనుగోలు అనుభవాన్ని అందించడానికి ముందుకు ఇప్పుడు వచ్చింది.

కస్టమర్లకు మరింత చేరువ కోసం MG Motor కొత్త ప్లాట్‌ఫారమ్: MG eXpert

ప్రస్తుతం కంపెనీ ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫారమ్ మొత్తం కార్ కొనుగోలు ప్రక్రియను మరింత ఎక్కువగా మరియు వేగంగా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో కంపెనీ యొక్క ఏదైనా మోడల్ మరియు వేరియంట్ యొక్క ధర, ఫీచర్లు మరియు అన్ని ఇతర వివరాలపై సమాచారాన్ని కస్టమర్‌కు అందిస్తుంది. ఇది కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కస్టమర్లకు మరింత చేరువ కోసం MG Motor కొత్త ప్లాట్‌ఫారమ్: MG eXpert

ఈ ప్లాట్‌ఫారమ్‌లో, కారుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆడియో-విజువల్ ద్వారా కస్టమర్‌కు అందించబడుతుందని కంపెనీ తెలిపింది. ఇది కస్టమర్‌కు ఈఎమ్ఐ మరియు టెస్ట్ డ్రైవ్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తుంది. ప్రస్తుతం, ఈ సర్వీస్ ఆప్సన్ కేవలం ఎంపిక చేసిన భాగాలలో అందుబాటులో ఉంటుంది.

కస్టమర్లకు మరింత చేరువ కోసం MG Motor కొత్త ప్లాట్‌ఫారమ్: MG eXpert

కానీ ఇది భారతదేశంలో రెండవ త్రైమాసికం చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఇది 24x7 అందుబాటులో ఉంటుంది. ఎంజి సేల్స్ ఛానెల్‌ల ప్రతినిధులు కూడా ఎంజి ఎక్స్‌పర్ట్ సర్వీస్ ని ఎలా ఉంపయోగించుకోవాలో తెలియజేస్తారు, దీని కోసం వారు ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

కస్టమర్లకు మరింత చేరువ కోసం MG Motor కొత్త ప్లాట్‌ఫారమ్: MG eXpert

ఇదిలా ఉండగా ఎంజి మోటార్ ఇండియా త్వరలో భారతదేశంలో కొత్త 'జెడ్ఎస్ ఈవి' (ZS EV) ని విడుదల చేయవచ్చు. త్వరలో రానున్న ZS EV ఫేస్‌లిఫ్ట్ ఆధునిక డిజైన్ మరియు ఫీచర్లను పొందుతుంది. ఈ కొత్త 2022 మోడల్ పూర్తిగా కొత్త డిజైన్‌తో వస్తుంది. కావున ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కస్టమర్లకు మరింత చేరువ కోసం MG Motor కొత్త ప్లాట్‌ఫారమ్: MG eXpert

2022 MG ZS EV కవర్ ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ లోగోకు ఎడమ వైపున ఛార్జింగ్ సాకెట్‌ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకూండా ఇందులో రీడిజైన్ చేయబడిన సన్‌రూఫ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు మరియు రీడిజైన్ చేయబడిన టెయిల్ లైట్లు వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

కస్టమర్లకు మరింత చేరువ కోసం MG Motor కొత్త ప్లాట్‌ఫారమ్: MG eXpert

MG ZS EV మోడల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు బ్లాక్ సైడ్ బాడీ క్లాడింగ్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ సొగసైన LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా దీనిని చూడటానికి చాలా ఆకర్షణీయంగా చేస్తాయి.

కస్టమర్లకు మరింత చేరువ కోసం MG Motor కొత్త ప్లాట్‌ఫారమ్: MG eXpert

2022 MG ZS EV యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, ఇందులో అప్‌డేట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. మొత్తానికి ఇది కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ తప్ప మిగిలిన అన్ని ఫీచర్స్ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి.

కస్టమర్లకు మరింత చేరువ కోసం MG Motor కొత్త ప్లాట్‌ఫారమ్: MG eXpert

త్వరలో రానున్న కొత్త ZS EV యొక్క ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ 44.5 కిలోవాట్ హైటెక్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 141 బిహెచ్‌పి పవర్ మరియు 353 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. కొత్త ZS EV పరిధి 419 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.

Most Read Articles

English summary
Mg motor launches expert online purchase platform details
Story first published: Wednesday, February 16, 2022, 19:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X