కొత్త 2022 Toyota Camry Hybrid గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు!

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా భారతదేశంలో తమ కొత్త క్యామ్రీ హైబ్రిడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త కారు ధర రూ. 41.70 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. మరి ఈ కొత్త 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

కొత్త 2022 Toyota Camry Hybrid గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు!

1. తరం (జనరేషన్)

టొయోటా "క్యామ్రీ" నేమ్‌ప్లేట్ మొదటిసారిగా 1979లో ప్రవేశపెట్టింది మరియు జనవరి 1980లో టొయోటా సెలికా క్యామ్రీ పేరుతో అమ్మకాలను ప్రారంభించింది. కాగా, 1982లో టొయోటా మొదటి తరం క్యామ్రీ కారును ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ఆ సమయంలో అంతకు ముందు ప్రవేశపెట్టిన 'సెలికా క్యామ్రీ' మాదిరిగా కాకుండా, 1982 టొయోటా క్యామ్రీ ఫ్రంట్-వీల్-డ్రైవ్ మోడల్ గా లభించేంది. కాగా, 2022 మోడల్ విషయానికి వస్తే, ఇది 2019లో భారతదేశంలో ప్రారంభించబడిన ఎనిమిదవ తరం టొయోటా క్యామ్రీకి జపాన్ ఆటోమోటివ్ బ్రాండ్ ఇచ్చిన రెండవ అప్‌డేట్.

కొత్త 2022 Toyota Camry Hybrid గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు!

2. డిజైన్

చాలా ఫేస్‌లిఫ్ట్‌ల మాదిరిగానే, కొత్త 2022 అప్‌డేట్ కొన్ని అదనపు ఫీచర్లతో పాటు లోపల మరియు వెలుపల కొన్ని కాస్మెటిక్ మార్పులను కలిగి ఉంటుంది. టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఇప్పుడు మరింత స్పోర్టీగా మరియు సమకాలీనంగా కనిపిస్తుంది. తక్కువ క్రోమ్‌తో సన్నగా కనిపించే ఫ్రంట్ గ్రిల్‌ని ఉపయోగించడం ద్వారా ఈ స్పోర్టియర్ లుక్‌ని మరింత పెంచారు. అంతే కాకుండా, అప్‌డేట్ చేయబడిన టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లతో రీప్రొఫైల్డ్ ఫ్రంట్ బంపర్‌ను పొందుతుంది.

కొత్త 2022 Toyota Camry Hybrid గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు!

సైడ్ డిజైన్ గమనిస్తే, సైడ్ ప్రొఫైల్ చాలావరకు ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో సమానంగా ఉంటుంది, అయితే, అప్‌డేట్ స్పోర్టియర్ స్టాన్స్ కోసం కొత్త డ్యూయల్-టోన్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను ఇందులో జోడించారు. అప్‌డేట్ చేయబడిన కొత్త 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ యొక్క వెనుక భాగంలో చేసిన మార్పుల విషయానికి వస్తే, ఈ ఐదు-సీట్ల హైబ్రిడ్ సెడాన్ లో ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్‌లపై డార్క్ ఇన్‌సర్ట్‌లు మరియు కొంచెం షార్ప్‌గా కనిపించే వెనుక బంపర్‌ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

కొత్త 2022 Toyota Camry Hybrid గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు!

3. ఇంటీరియర్ మరియు ఫీచర్లు

లోపలి భాగానికి వస్తే, కొత్త 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఫేస్‌లిఫ్ట్ మరిన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. అప్‌డేట్ చేయబడిన టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ లో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేతో కూడిన కొత్త 9.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో వస్తుంది. అంతే కాకుండా, కొత్త సిస్టమ్ స్ఫుటమైన మరియు స్పష్టమైన ఆడియో కోసం 9-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్‌తో పాటు వస్తుంది.

కొత్త 2022 Toyota Camry Hybrid గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు!

అంతేకాకుండా, కొత్త అప్‌డేట్ చేయబడిన 2022 టొయోటా క్యామ్రీలో మెమొరీ ఫంక్షన్‌తో కూడిన వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, పవర్ రిక్లైనింగ్ రియర్ సీట్లు, పవర్ సన్‌షేడ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో ముందు వైపున ఉన్న ఏసి వెంట్‌లు ఇప్పుడు ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ క్రింద భాగంలో అమర్చబడ్డాయి.

కొత్త 2022 Toyota Camry Hybrid గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు!

4. సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), బ్యాక్ గైడ్ మానిటర్‌తో పార్క్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), ట్రాక్షన్ కంట్రోల్ (TC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటి మరెన్నో సేఫ్టీ ఫీచర్‌లు ఇందులో ఉన్నాయి.

కొత్త 2022 Toyota Camry Hybrid గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు!

5. ఇంజన్ మరియు వారంటీ

అప్‌డేట్ చేయబడిన 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారులో పరీక్షించబడిన 2.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. గతంలోని వెర్షన్ లో కూడా ఇదే ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 178.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 221 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 202 ఎన్ఎమ్ టార్క్‌ మరియు 88 కిలోవాట్ పవర్ తో కూడిన ఎలక్ట్రిక్ మోటారుతో కలిసి గరిష్టంగా 215 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2022 Toyota Camry Hybrid గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు!

అంతేకాకుండా, 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ మూడు రకాల డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది. వీటిలో స్పోర్ట్, ఎకో మరియు నార్మల్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. టొయోటా యొక్క అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం, కొత్త 2022 Toyota Camry యొక్క హైబ్రిడ్ బ్యాటరీ 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. అంతేకాకుండా, టొయోటా 2022 క్యామ్రీ హైబ్రిడ్‌పై 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిమీల వారంటీని ప్రామాణికంగా అందిస్తోంది.

కొత్త 2022 Toyota Camry Hybrid గురించి తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

పెరుగుతున్న ఇంధన ధరలు మరియు కఠినమైన ఉద్గార నిబంధనల నేపథ్యంలో, ప్రస్తుతం హైబ్రిడ్ కార్లు ఎప్పటికీ ఉత్తమమైన ఆప్షన్ గా ఉంటాయి. ఈ కార్లు పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ పవర్ రెండిటితో కలిసి కానీ లేదా విడివిడిగా కానీ ఉపయోగించి పనిచేస్తాయి. కాబట్టి, ఇలాంటి కార్ల మైలేజ్ కూడా అధికంగా ఉంటుంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ 2022 టొయోటా క్యామ్రీ హైబ్రిడ్‌ ఇప్పుడు మరింత స్టైల్ మరియు అవసరమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.

Most Read Articles

English summary
New 2022 toyota camry hybrid launched top five things you should know about it details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X