భారత మార్కెట్లో కొత్త వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్ (2022 Volvo XC40) విడుదల: ధర, ఫీచర్లు

స్వీడన్‌ లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో (Volvo), భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ ఎస్‌యూవీ "వోల్వో ఎక్స్‌సి40" (Volvo XC40)లో కంపెనీ ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను నేడు (సెప్టెంబర్ 21, 2022) విడుదల చేసింది. ఈ కొత్త ఎస్‌యూవీలో కొత్తగా చేసిన మార్పులు చేర్పులు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

Recommended Video

2022 జులైలో భారత మార్కెట్లో విడుదలైన కార్లు | వివరాలు

భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీని తొలిసారిగా 2018లో విడుదల చేశారు. కాంపాక్ట్ డిజైన్, సరసమైన ధర మరియు బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో ఇది కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో ఓ కొత్త 2022 మోడల్‌ను ప్రవేశపెట్టడం మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని నిర్ణయించుకుంది.

భారత మార్కెట్లో కొత్త వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్ (2022 Volvo XC40) విడుదల: ధర, ఫీచర్లు

భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్‌ ప్రారంభ ధరను రూ. 43.20 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించారు.

భారత మార్కెట్లో కొత్త వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్ (2022 Volvo XC40) విడుదల: ధర, ఫీచర్లు

కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది పరిచయ ప్రారంభ ధర మాత్రమే. అంటే, ఈ ప్రారంభ ధరలు పరిమితం కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత దీని ప్రారంభ ధర రూ. 45.90 లక్షల (ఎక్స్-షోరూమ్) కు పెరుగుతుంది. కస్టమర్లను అనవసరమైన గందరగోళానికి గురిచేయకుండా, కంపెనీ ఈ కారును కేవలం ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే విక్రయిస్తోంది. ఇది పూర్తిగా ఫీచర్లతో లోడ్ చేయబడిన బి4 అల్టిమేట్ ట్రిమ్‌లో అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్ (2022 Volvo XC40) విడుదల: ధర, ఫీచర్లు

వోల్వో ఎక్స్‌సి40 కి కంపెనీ అందించిన ఈ మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌లో భాగంగా ఈ కొత్త మోడల్ యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ మరియు ఫీచర్లను కూడా వోల్వో అప్‌డేట్ చేసింది. ఈ కొత్త 2022 మోడల్ వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇందులో కొత్తగా జోడించబడిన మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌ గురించి. ఈ కొత్త అప్‌డేట్ ఇంజన్ ఇప్పుడు తేలికపాటి హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉండి, మునుపటి మోడల్ కన్నా మరింత మెరుగైన మైలేజీనిస్తుంది.

భారత మార్కెట్లో కొత్త వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్ (2022 Volvo XC40) విడుదల: ధర, ఫీచర్లు

కొత్త 2022 మోడల్ వోల్వో ఎక్స్‌సి40 ఎక్స్టీరియర్‌లో చేసిన మార్పులు ప్రధానంగా ముందు భాగంలో ఎక్కువగా కనిపిస్తాయి. రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్‌లు ఇప్పుడు మరింత షార్ప్ గా కనిపిస్తాయి. అలాగే, ఇందులో థోర్ నుండి స్పూర్తి పొందిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ కూడా రీడిజైన్ చేయబడింది. ఫ్రంట్ గ్రిల్‌లో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ, దాని ఫ్రంట్ బంపర్ మాత్రం ఇప్పుడు మరింత కోణీయంగా ఉండే క్రీజ్ లైన్లను కలిగి ఉంటుంది. సైడ్స్ మరియు వెనుక వైపు పెద్దగా చెప్పుకోదగిన మార్పులు లేవు.

భారత మార్కెట్లో కొత్త వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్ (2022 Volvo XC40) విడుదల: ధర, ఫీచర్లు

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వోల్వో ఎక్స్‌సి40 యొక్క ఇంటీరియర్లలో కూడా స్వల్ప అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ మరియు డోర్స్ పై ఇప్పుడు కొత్తగా ఉడ్ ట్రిమ్స్ కనిపిస్తాయి. ఈ మార్పు మినహా మిగిలిన డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ అంతా మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇతర అధునాతన వోల్వో కార్ల మాదిరిగానే ఈ కొత్త 2022 ఎక్స్‌సి40 కూడా స్మార్ట్‌ఫోన్ లాంటి అనుభవాన్ని అందించడానికి, ఇందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించబడింది. ఇది వాయిస్ కమాండ్స్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

భారత మార్కెట్లో కొత్త వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్ (2022 Volvo XC40) విడుదల: ధర, ఫీచర్లు

ఇక ఈ ఎస్‌యూవీలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దాని పెద్ద 2.0 లీటర్ పెట్రోల్ గురించి. ఈ ఇంజన్ 48V ఇంటిగ్రేటెడ్ స్టార్టర్-జనరేటర్ మోటార్‌తో కూడిన మైల్డ్ హైబ్రిడ్ సెటప్ తో వస్తుంది. ఫలితంగా, ఈ ఇంజన్ ఇప్పుడు గరిష్టంగా 197 బిహెచ్‌పి శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మునుపటి పెట్రోల్-ఓన్లీ 2.0-లీటర్ ఇంజన్‌తో పోలిస్తే, ఈ కొత్త హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ పవర్ 7 బిహెచ్‌పి పెరిగింది. కానీ టార్క్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ ఇంజన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది మరియు ఇది ముందు చక్రాలకు శక్తిని పంపిణీ చేస్తుంది.

భారత మార్కెట్లో కొత్త వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్ (2022 Volvo XC40) విడుదల: ధర, ఫీచర్లు

వోల్వో ఎక్స్‌సి40 కారులోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో పిఎం 2.5 ఫిల్టర్‌తో కూడిన కొత్త అధునాతన ఎయిర్-క్లీనర్, వైర్డ్ ఆపిల్ కార్‌ప్లే, 14-స్పీకర్లతో కూడిన హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పైలట్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్ మరియు బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు, డాష్-మౌంటెడ్ వూఫర్, పానోరమిక్ సన్‌రూఫ్ మరియు స్మార్ట్ ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్, వినోదం 12.3 ఇంచెస్ వర్టికల్ టచ్‌స్క్రీన్‌ మరియు డ్రైవర్ సమాచారం కోసం ఎమ్ఐడి టచ్‌స్క్రీన్ మొదలైనవి కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో కొత్త వోల్వో ఎక్స్‌సి40 ఫేస్‌లిఫ్ట్ (2022 Volvo XC40) విడుదల: ధర, ఫీచర్లు

భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40 ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఏ, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మరియు ఆడి క్యూ3 వంటి ప్రీమియం కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది. ఇదిలా ఉంటే, వోల్వో ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎస్60 సెడాన్ మినహా మిగిలిన అన్ని పెట్రోల్/డీజిల్ మోడళ్లలో మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్లను ఉపయోగించాలని యోస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో వోల్వో ఇప్పటికే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మరియు పూర్తి ఎలక్ట్రిక్ కార్లను కూడా విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
New 2022 volvo xc40 facelift launched in india price specs and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X