సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్‌ను ఆవిష్కరించిన ప్రవైగ్ డైనమిక్స్.. పాత సెడాన్ అటకెక్కినట్లేనా..?

మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు ప్రవైగ్ మరోసారి ఇంటర్నెట్‌లో బజ్ క్రియేట్ చేసింది. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ ప్రవైగ్ డైనమిక్స్, గడచిన డిసెంబర్ 2020లో తమ సరికొత్త మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎమ్‌కె1' ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఆ కారును వదిలేసి దాని స్థానంలో ఓ కొత్త ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా భారతదేశపు ఇంజనీర్లు మరియు టెక్నాలజీతో అభివృద్ధి చేయబడి, రూపొందించబడిన ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క కొత్త టీజర్ చిత్రం ఆన్‌లైన్‌లో విడుదల చేయబడింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్‌ను ఆవిష్కరించిన ప్రవైగ్ డైనమిక్స్.. పాత సెడాన్ అటకెక్కినట్లేనా..?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసినదే. ఈవీ టూవీలర్ మార్కెట్ మాదిరిగానే ఈవీ కార్ మార్కెట్ కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం, మన దేశంలో బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల నుండి ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల వరకూ అనేక రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో దేశీయంగా ఎలక్ట్రిక్ కార్లను అందించే కంపెనీలను చేతివేళ్ల మీద లెక్కించవచ్చు. వీటిలో ప్రధానంగా వినిపించే పేరు టాటా మోటార్స్. టాటా ఈవీ మార్కెట్లో అగ్రగామి దేశీయ కంపెనీగా ఉంది.

సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్‌ను ఆవిష్కరించిన ప్రవైగ్ డైనమిక్స్.. పాత సెడాన్ అటకెక్కినట్లేనా..?

ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో పోటీని పెంచేందుకు ఓలా ఎలక్ట్రిక్ సంస్థ కూడా సిద్ధమైంది. ఓలా ఇప్పటికే తమ మొదటి ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన కొన్ని టీజర్ ఫొటోలను కూడా విడుదల చేసింది. ఇదిలా ఉంటే, ప్రవైగ్ డైనమిక్స్ మాత్రం, విదేశీ ఎలక్ట్రిక్ కార్లను తలదన్నేలా ఓ అద్భుతమైన స్పోర్టీ లుకింగ్ ఎలక్ట్రిక్ కారును డిజైన్ చేసింది. కంపెనీ రెండేళ్ల క్రితమే దీనిని ప్రజలకు చూపించినప్పటికీ, ఇది ఇంకా ఉత్పత్తి స్థాయికి చేరుకోలేదు. అయితే, తాజాగా ఈ కారుకి సంబంధించి టీజర్లను విడుదల చేయడాన్ని చూస్తుంటే, త్వరలోనే ఇది మార్కెట్లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్‌ను ఆవిష్కరించిన ప్రవైగ్ డైనమిక్స్.. పాత సెడాన్ అటకెక్కినట్లేనా..?

ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎలక్ట్రిక్ కారు డిజైన్‌ను గమనిస్తే, ఇది ముందు వైపు నుండి సెడాన్ మాదిరిగా వెనుక వైపు నుండి క్రాసోవర్ మాదిరిగా సైడ్ నుండి కూప్ మాదిరిగా కనిపిస్తుంది. విశిష్టమైన బాడీ డిజైన్ లాంగ్వేజ్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క పై భాగం చాలా వరకూ సన్‌రూఫ్ లేదా ధృడమైన గ్లాస్ రూఫ్ ని కలిగి ఉంటుంది. ఈ కారు ముందు భాగంలో సన్నని ఎల్‌ఈడి స్ట్రిప్‌తో అనుసంధానించబడిన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌ సెటప్ ఉంటుంది. వెనుక వైపు ఎల్ఈడి టెయిల్ లైట్ల మరియు సైడ్స్ లో స్టైలిష్ వీల్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌టీరియర్ పెద్ద హంగు ఆర్భాటాలేమీ లేకుండా మినిమలిక్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది.

సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్‌ను ఆవిష్కరించిన ప్రవైగ్ డైనమిక్స్.. పాత సెడాన్ అటకెక్కినట్లేనా..?

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రవైగ్ ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 402 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ గరిష్ట శక్తిని బెంగళూరులోని యలహంక రోడ్లపై ఈ కారుతో పరీక్షించినట్లు ప్రవైగ్ డైనమిక్స్ తెలిపింది. ప్రవైగ్ డైనమిక్స్ మొదట్లో తమ ఎక్స్‌టింక్షన్ ఎమ్‌కె1 ఎలక్ట్రిక్ కారును సెడాన్ రూపంలో విడుదల చేయాలని భావించింది. అయితే, మార్కెట్లో మారుతున్న సమీకరణలు మరియు పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, భారతీయ ప్రజల అభిరుచికి అనుగుణంగా ఈ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్‌ను ఆవిష్కరించిన ప్రవైగ్ డైనమిక్స్.. పాత సెడాన్ అటకెక్కినట్లేనా..?

ప్రవైగ్ డైనమిక్స్ ఇంకా తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం ఎలాంటి పేరుని దృవీకరించలేదు. సమాచారం ప్రకారం, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని నవంబర్ 25న ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన టీజర్లను విడుదల చేస్తూ, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రవైగ్ డైనమిక్స్ విడుదల చేసిన ఈ టీజర్ ఇమేజ్ కారుని పైభాగం నుండి ప్రదర్శించేలా చేస్తుంది. ఇందులో ఓ చిన్న మూన్ రూఫ్ ఆ తర్వాత ఓ పెద్ద సన్‌రూఫ్ లాంటి నిర్మాణం కనిపిస్తుంది. అయితే, ఇవి ఫంక్షనల్ గా ఉంటాయా లేక నాన్-ఫంక్షనల్ గా ఉంటాయా అనే విషయం ఇంకా తెలియరాలేదు.

సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్‌ను ఆవిష్కరించిన ప్రవైగ్ డైనమిక్స్.. పాత సెడాన్ అటకెక్కినట్లేనా..?

ఈ ఎలక్ట్రిక్ కారు షోల్డర్ లైన్‌లు కూడా చాలా వెడల్పుగా ఉంటాయి. ఈ కారు యొక్క రోడ్ ప్రజెన్స్ ని మరింత మెరుగుపరచేందుకు ఇందులో పెద్ద పరిమాణంలో ఉండే చక్రాలు కూడా ఉంటాయి మరియు వాటి పైన విస్తృతమైన వీల్ ఆర్చ్‌లు కూడా ఉంటాయి. వీటితో పాటు పూర్తి వెడల్పుతో కారు వెనుక భాగంలో అందించిన సన్నని ఎల్ఈడి టైల్‌లైట్ బార్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముందు వైపు కూడా అదేవిధమైన ఎల్ఈడి లైట్స్ ఉండే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్, కియా ఈవీ6 మరియు త్వరలో రాబోయే హ్యుందాయ్ ఐయానిక్ 5 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Pravaig dynamics teases new electric suv launch expected soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X