Tata Motors 2021 డిసెంబర్ అమ్మకాలు.. ఎలా ఉన్నాయంటే?

భారతీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఎట్టకేలకు ఈ కొత్త 2022 సంవత్సరంలో గత సంవత్సరం 2021 డిసెంబర్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం, 2021 డిసెంబర్ నెలలో మొత్తం దేశీయ అమ్మకాలు 66,307 యూనిట్లుగా తెలిసింది. కంపెనీ యొక్క అమ్మకాలను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Tata Motors 2021 డిసెంబర్ అమ్మకాలు.. ఎలా ఉన్నాయంటే?

కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2020 డిసెంబర్ నెల అమ్మకాల (53,430) కంటే కూడా 2021 డిసెంబర్ నెల అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. టాటా మోటార్స్ ఏకంగా 24 వృద్ధిని నమోదు చేయగలిగింది. దీన్ని బట్టి చూస్తే 2020 కంటే 2021 కంపెనీకి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

Tata Motors 2021 డిసెంబర్ అమ్మకాలు.. ఎలా ఉన్నాయంటే?

దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొత్తం అమ్మకాలలో 2,255 యూనిట్లు ఎలక్ట్రిక్ వాహనాలు కాగా, 35,299 ప్యాసింజర్ వాహనాలు ఉన్నాయి. ఇందులో టాటా టిగోర్ EV అమ్మకాలు మంచి పురోగతిని చూపాయి. అంతే కాకుండా కంపెనీ గత సంవత్సరం టాటా పంచ్ అనే మీరో SUV విడుదల చేసింది. కంపెనీ యొక్క అమ్మకాలు పెరగడానికి ఇది గణనీయంగా దోహదపడింది.

Tata Motors 2021 డిసెంబర్ అమ్మకాలు.. ఎలా ఉన్నాయంటే?

టాటా మోటార్స్ యొక్క 2021 డిసెంబర్ నెల విక్రయాల గురించి 'టాటా మోటార్స్ లిమిటెడ్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ 'శైలేష్ చంద్ర' మాట్లాడుతూ.. దేశీయ మార్కెట్లో ఒక వైపు కరోనా సంక్షోభం, మరో వైపు సెమీకండక్టర్ల కొరత ఉన్నప్పటికీ కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లింది. కంపెనీ యొక్క అమ్మకాలు పెరగటానికి ప్రజలకు కంపెనీపైన ఉన్న నమ్మకమే ప్రధాన కారణం అని తెలిపారు.

Tata Motors 2021 డిసెంబర్ అమ్మకాలు.. ఎలా ఉన్నాయంటే?

అంతే కాకూండా, 2021 వ సంవత్సరంలో టాటా మోటార్స్ యొక్క అమ్మకాలు పెరిగాయి. ఇది 2020 కంటే కూడా మంచి పురోగతి, అయితే ఈ 2022 కొత్త సంవత్సరంలో కూడా కంపెనీ మరింత మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నామన్నారు.

Tata Motors 2021 డిసెంబర్ అమ్మకాలు.. ఎలా ఉన్నాయంటే?

టాటా మోటార్స్ ఈ సంవత్సరం సిఎన్‌జితో నడిచే టాటా టియాగో మరియు టిగోర్‌లను ప్రారంభించడంతో, ఎలక్ట్రిక్ మరియు సిఎన్‌జి ఇంధన ఎంపికలలో అందించే ఏకైక కార్‌మేకర్‌గా నిలువగలిగింది. టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణి ధరలను కూడా ఈ నెలలో పెంచనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కంపెనీ ఇప్పటికే విడుదల చేసింది.

Tata Motors 2021 డిసెంబర్ అమ్మకాలు.. ఎలా ఉన్నాయంటే?

టాటా మోటార్స్ ఇప్పటికే సిఎన్‌జితో నడిచే టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ టీజర్‌ను కూడా విడుదల చేసింది. త్వరలో కంపెనీ ఈ కారును మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశం కూడా ఉంది. అంతే కాకూండా టాటా టియాగో సిఎన్‌జి మరియు టాటా టిగోర్ సిఎన్‌జి తర్వాత కంపెనీ టాటా పంచ్ సిఎన్‌జిని కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

Tata Motors 2021 డిసెంబర్ అమ్మకాలు.. ఎలా ఉన్నాయంటే?

టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన కొత్త టాటా పంచ్ (Tata Punch) SUV కి విపరీతమైన స్పందన వస్తోంది. మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ప్రస్తుతం ఇంధన ధరల కారణంగా ఈ మైక్రో SUV ని CNG అవతార్‌లో తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల దీని CNG మాడల్ కూడా టెస్టింగ్ సమయంలో కనిపించింది.

Tata Motors 2021 డిసెంబర్ అమ్మకాలు.. ఎలా ఉన్నాయంటే?

ఈ 2022 వ సంవత్సరంలో టాటా మోటార్స్ తమ Tigor మరియు Tiago వంటి వాటిని కూడా CNG వెర్షన్ లో తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కావున ఈ రెండు మోడల్స్ కూడా త్వరలో CNG వెర్షన్ లో తీసుకురాబడతాయి. అయితే ఇందులో భాగంగానే టాటా పంచ్ కూడా CNG వెర్షన్ లో అడుగుపెట్టనుంది.

Tata Motors 2021 డిసెంబర్ అమ్మకాలు.. ఎలా ఉన్నాయంటే?

టాటా పంచ్ ఇప్పటివరకు కూడా మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే దేశీయ మార్కెట్లో టాటా పంచ్ CNG వెర్షన్ విడుదలైన తరువాత దీని పరిధి దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కావున ఎక్కువ మంది కొనుగోలుదారులు ఈ మైక్రో SUV ని మరింత ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Tata Motors 2021 డిసెంబర్ అమ్మకాలు.. ఎలా ఉన్నాయంటే?

Tata Punch అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, 90 డిగ్రీ ఓపెనింగ్ డోర్స్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల ఇది ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందగలుగుతోంది.

Most Read Articles

English summary
Tata motors sales december 35299 units passengers vehicles details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X