భారత్‌లో విడుదలైన బుల్లి కారు PMV EaS-E తెలుసుకోవాల్సిన 5 విషయాలు.. ఇక్కడ చూడండి

భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో శరవేగంగా ముందుకుసాగుతున్న తరుణంలో ముంబైకి చెందిన పర్సనల్ మొబిలిటీ వెహికల్స్ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ 'EaS-E' విడుదల చేసింది.

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 'EaS-E' అత్యంత చవకైన మరియు అత్యంత చిన్న కారు. ఈ ఎలక్ట్రిక్ కారులో తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

బుల్లి కారు PMV EaS-E తెలుసుకోవాల్సిన 5 విషయాలు

ధరలు మరియు బుకింగ్స్:

పర్సనల్ మొబిలిటీ వెహికల్స్ (PMV) కంపెనీ యొక్క 'EaS-E' ధర రూ. 4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే 6,000 ప్రీ బుకింగ్స్ పొందినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 2,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ప్రారంభ ధరలు కేవలం మొదటి 10,000 మందికి మాత్రమే వర్తిస్తాయి.

కొలతలు:

ఈ ఎలక్ట్రిక్ కారు పరిమాణంలో టాటా నానో కారుకంటే చిన్నదిగా ఉంటుంది. ఇందులో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు పొడవు 2,915 మిమీ, వెడల్పు 1,157 మిమీ, ఎత్తు 1,600 మిమీ, వీల్ బేస్ 2087 మిమీ వరకు ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు మొత్తం బరువు 550 కేజీలు మాత్రమే.

డిజైన్ మరియు కలర్ ఆప్సన్స్:

PMV EaS-E ఎలక్ట్రిక్ కారు చూడటానికి చిన్నదైనా మంచి ఆకర్షణీయమైన డిజైన్ పొందుతుంది. ఇందులో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఉంటాయి. అదే సమయంలో ముందు భాగంలో PMV లోగో, రియర్ ప్రొఫైల్ లో 13 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది రెడ్, సిల్వర్, వైట్, సాఫ్ట్ గోల్డ్ మరియు ఆరంజ్ అనే 5 కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఫీచర్స్:

PMV EaS-E ఎలక్ట్రిక్ కారు ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం LCD స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఆడియో సిస్టమ్, రిమోట్ పార్క్ అసిస్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌ వంటివి పొందుతుంది. అంతే కాకుండా.. ఇందులో పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, లాక్ & అన్‌లాక్ మరియు ఏసీ వెంట్స్ మొదలైనవన్నీ కూడా ఇందులో లభిస్తాయి.

బుల్లి కారు PMV EaS-E తెలుసుకోవాల్సిన 5 విషయాలు

బ్యాటరీ మరియు రేంజ్:

బ్యాటరీ మరియు రేంజ్ విషయానికి వస్తే, ఇది లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది. కానీ బ్యాటరీ యొక్క కెపాసిటీని ఇంకా కంపెనీ వెల్లడించలేదు. అయితే PMV మూడు విభిన్న శ్రేణి ఎంపికలతో Ease-Eని అందిస్తుంది. అవి 120km, 160km మరియు 200km. ఇది 13.41 బిహెచ్‌పి పవర్ మరియు 50 ఎన్ఎమ్ టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటారు కలిగి ఉంటుంది.

ఈ PMV EaS-E ఎలక్ట్రిక్ కారు కారు కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారుని 15A హోమ్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేసుకోవడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

Most Read Articles

English summary
Top five highlights pf pmv eas e microcar details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X