పాఠకుల కోసం ప్రత్యేకం.. గత వారం టాప్ కార్ న్యూస్

భారతీయ మార్కెట్లో ప్రతి రోజూ ఏదో ఒక మూలన ఏదో ఒక కొత్త వెహికల్ లాంచ్ అవుతూనే ఉంటుంది. అయితే గత వారంలో కూడా కొన్ని కొత్త ఉత్పత్తులు దేశీయ మార్కెట్లో విడుదలయ్యాయి. ఇందులో టయోటా గ్లాంజా CNG, ఆడి క్యూ5 స్పెషన్ ఎడిషన్ వంటివి విడుదలయ్యాయి, అదే సమయంలో జీప్ గ్రాండ్ చెరోకీ బుకింగ్స్ మరియు టయోటా హైరైడర్ CNG బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వీటన్నిటి గురించి మరింత సమాచారం ఈ ఒకే కథనంలో తెలుసుకుందాం.. రండి.

పాఠకుల కోసం ప్రత్యేకం.. గత వారం టాప్ కార్ న్యూస్

టయోట గ్లాంజా CNG:

పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే CNG వాహనాలు ఎక్కువ సంఖ్యలో విడుదలవుతున్న తరుణంలో టయోటా కంపెనీ గ్లాంజా CNG విడుదల చేసింది. ఇవి S మరియు G ట్రిమ్స్. వీటి ధరలు వరుసగా రూ. 8.43 లక్షలు మరియు రూ. 9.46 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

పాఠకుల కోసం ప్రత్యేకం.. గత వారం టాప్ కార్ న్యూస్

టొయోట గ్లాంజా CNG అదే 1.2 లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో అందించబడుతోంది. ఇది పెట్రోల్ మోడ్‌లో గ్లాంజా 90 హెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే CNG మోడ్‌లో పవర్ అవుట్‌పుట్ 77 హెచ్‌పి మరియు 98.5 ఎన్ఎమ్ వరకు ఉంటుంది. మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చాలా CNG మోడల్స్ మాదిరిగానే ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. అయితే ఇది ఒక కేజీ CNG కి 30.61 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. కొత్త టయోట గ్లాంజా CNG గురించి మరిన్ని వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాఠకుల కోసం ప్రత్యేకం.. గత వారం టాప్ కార్ న్యూస్

ఆడి క్యూ5 స్పెషన్ ఎడిషన్:

భారతీయ మార్కెట్లో ఆడి ఇండియా' (Audi India) కొత్త క్యూ5 స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఆడి క్యూ5 స్పెషన్ ఎడిషన్ ధర రూ. 67.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త స్పెషన్ క్యూ5 ఎడిషన్‌ టెక్నాలజీ ట్రిమ్ పై ఆధారపడి ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ ప్రీమియమ్ ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.

పాఠకుల కోసం ప్రత్యేకం.. గత వారం టాప్ కార్ న్యూస్

ఆడి క్యూ5 స్పెషల్ ఎడిషన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 249 హెచ్‌పి పవర్ మరియు 370 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. అయితే దీని టాప్ స్పీడ్ గంటకు 237 కిలోమీటర్లు. ఆడి క్యూ5 స్పెషన్ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

పాఠకుల కోసం ప్రత్యేకం.. గత వారం టాప్ కార్ న్యూస్

జీప్ గ్రాండ్ చెరోకీ బుకింగ్స్:

అమెరికన్ కార్ తయారీ సంస్థ భారతీయ మార్కెట్లో కొత్త 'గ్రాండ్ చెరోకీ' (Grand Cherokee) ని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసందే. అయితే కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాగా ఇప్పుడు బుక్ చేసుకున్నవారికి నవంబర్ చివరినాటికి డెలివరీలు జరుగుతాయి.

పాఠకుల కోసం ప్రత్యేకం.. గత వారం టాప్ కార్ న్యూస్

కొత్త జీప్ గ్రాండ్ చెరోకీ కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్ లో మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది. కావున ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను మాత్రమే పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆటో, స్పోర్ట్, మడ్/సాండ్ మరియు స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇంజిన్ యొక్క పవర్ అవుట్‌పుట్స్ ఇంకా వెల్లడికాలేదు. ఇవన్నీ కూడా లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి.

పాఠకుల కోసం ప్రత్యేకం.. గత వారం టాప్ కార్ న్యూస్

టయోటా హైరైడర్ CNG బుకింగ్స్:

టయోటా కంపెనీ తన కొత్త అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV ని CNG వెర్షన్ లో విడుదల చేయనుంది. అయితే కంపెనీ ఈ CNG వెర్షన్ కోసం రూ. 25,000 చెల్లించి ఆన్‌లైన్‌లో లేదా అధీకృత డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ CNG మిడ్ సైజ్ SUV విభాగంలో మొదటి CNG బేస్డ్ మోడల్ అవుతుంది.

పాఠకుల కోసం ప్రత్యేకం.. గత వారం టాప్ కార్ న్యూస్

కంపెనీ ఇంకా Hyryder CNG యొక్క పవర్ మరియు టార్క్ గణాంకాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ CNG మోడ్‌లో 88 బిహెచ్‌పి పవర్ మరియు 121.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే పెట్రోల్ మోడ్‌లో ఇది 101 బిహెచ్‌పి పవర్ మరియు 137 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 26.10 కిమీ/కేజీ మైలేజ్ అందించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Top news of the week toyota to audi details
Story first published: Sunday, November 13, 2022, 8:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X