CNG వెర్షన్‌లో విడుదలైన 'టయోట గ్లాంజా': రేంజ్ ఇప్పుడు అంతకు మించి.. ధర & వివరాలు

ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే CNG వాహనాలు ఎక్కువ సంఖ్యలో విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'టొయోట' ఇప్పుడు గ్లాంజా యొక్క CNG వెర్షన్‌ను విడుదల చేసింది.

టొయోట యొక్క అత్యధిక ప్రజాదరణ పొందిన 'గ్లాంజా' ఇప్పుడు CNG వెర్షన్‌లో రావడం వల్ల తప్పకుండా మరింత ఆదరణ పొందుతుంది. మార్కెట్లో విడుదలైన ఈ CNG వెర్షన్‌ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.

CNG వెర్షన్‌లో విడుదలైన టయోట గ్లాంజా

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త టొయోట గ్లాంజా CNG ధరలు రూ. 8.43 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈ CNG వెర్షన్ రెండు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి S మరియు G ట్రిమ్స్. వీటి ధరలు వరుసగా రూ. 8.43 లక్షలు మరియు రూ. 9.46 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

కొత్త టొయోట గ్లాంజా సిఎన్‌జి కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు రూ. 11,000 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. మార్కెట్లో విడుదలైన కొత్త గ్లాంజా CNG వెర్షన్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ 95,000 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. అయితే ఇది మంచి మైలేజ్ అందిస్తుంది.

టొయోట గ్లాంజా CNG అదే 1.2 లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో అందించబడుతోంది. మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చాలా CNG మోడల్స్ మాదిరిగానే ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. అయితే పెట్రోల్ మోడ్‌లో గ్లాంజా 90 హెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే CNG మోడ్‌లో పవర్ అవుట్‌పుట్ 77 హెచ్‌పి మరియు 98.5 ఎన్ఎమ్ వరకు ఉంటుంది. అయితే ఇది ఒక కేజీ CNG కి 30.61 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

డిజైన్ మరియు ఫీచర్స్ కూడా దాదాపు దాని మునుపటి మోడల్ తో సమానంగా ఉన్నప్పటికీ ఇది CNG అని గుర్తించడానికి కొన్ని చిన్న అప్డేట్స్ చేసింది. ఇందులో భాగంగానే కొత్త గ్లాంజా CNG వెర్షన్ టెయిల్‌గేట్‌పై CNG బ్యాడ్జింగ్‌ పొందుతుంది. దీని వల్ల ఇది CNG అని గుర్తించడం చాలా సులభం. టొయోట గ్లాంజా బూట్ స్పేస్ దాని మునుపటి మోడల్ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బూట్ లో 55 లీటర్ల సిఎన్‌జి ట్యాంక్‌ ఉంటుంది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ లభిస్తుంది. అదే సమయంలో ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వాయిస్ అసిస్టెంట్, OTA అప్‌డేట్‌లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్, స్టార్ట్/స్టాప్ బటన్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటివి స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇంటీరియర్ లో ఎటువంటి పెద్ద అప్డేట్స్ లేదు.

కొత్త టొయోట గ్లాంజా సిఎన్‌జి ఇప్పుడు మంచి మైలేజ్ అందించేలా రూపొందించబడింది. కావున తప్పకుండా దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. అయితే ఈ CNG వెర్షన్ దేశీయ మార్కెట్లో ఇటీవల విడుదలైన మారుతి బాలెనో సిఎన్‌జికి ప్రత్యర్థిగా ఉంటుంది. మారుతి బాలెనో సిఎన్‌జి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపైన క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Toyota glanza cng launched in india price features and details
Story first published: Thursday, November 10, 2022, 10:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X