సెల్ఫ్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్న టొయోటా హైబ్రిడ్ ఎస్‌యూవీ.. ఆగస్ట్ 2022 లో లాంచ్!?

జపనీస్ కార్ బ్రాండ్ హోండా ఇటీవలే తమ హైబ్రిడ్ వెర్షన్ సిటీ కారును భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు మరొక జపనీస్ కార్ కంపెనీ టొయోటా (Toyota) కూడా ఓ హైబ్రిడ్ కారును విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ టీజర్‌ను టొయోటా ఇండియా విడుదల చేసింది. ఈ టీజర్‌లో కంపెనీ 'హమ్ హై హైబ్రిడ్' అంటూ తమ సెల్ఫ్ చార్జింగ్ కార్లకు సంబంధించి ఓ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది.

సెల్ఫ్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్న టొయోటా హైబ్రిడ్ ఎస్‌యూవీ.. ఆగస్ట్ 2022 లో లాంచ్!?

ప్రస్తుతం, భారత ప్రభుత్వం పర్యావరణ అనుకూల ఆటోమోటివ్ పరిశ్రమను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, తయారీదారులు కూడా ఎకో-ఫ్రెండ్లీ వాహనాలను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విభాగంలోని ప్రయోజనాలను క్యాష్ చేసుకునేందుకు టొయోటా కూడా సిద్ధమైంది. ఈ టీజర్‌ను నిశితంగా గమనిస్తే, ఇది టొయోటా నుండి రాబోయే కాంపాక్ట్ ఎస్‌యూవీని సూచిస్తుంది. కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని డి22 (D22) అనే కోడ్‌నేమ్ తో అభివృద్ధి చేస్తుంది.

సెల్ఫ్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్న టొయోటా హైబ్రిడ్ ఎస్‌యూవీ.. ఆగస్ట్ 2022 లో లాంచ్!?

టొయోటా యొక్క ఈ లేటెస్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలైతే ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎమ్‌జి ఆస్టర్ వంటి మోడళ్లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. సమాచారం ప్రకారం, ఇది 2022 మధ్య భాగం నాటికి మార్కెట్లోకి రావచ్చని అంచనా. మారుతి సుజుకి మరియు టొయోటా సంస్థల మధ్య ఉన్న భాగస్వామ్యంలో భాగంగా, ఈ కొత్త టొయోటా ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని మారుతి సుజుకి ఈ విభాగంలో ఓ మోడల్ ను (విటారా బ్రెజ్జా మరియు అర్బన్ క్రూయిజర్ మాదిరిగా) విడుదల చేసే అవకాశం ఉంది.

సెల్ఫ్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్న టొయోటా హైబ్రిడ్ ఎస్‌యూవీ.. ఆగస్ట్ 2022 లో లాంచ్!?

టొయోటా నుండి రాబోయ్ ఈ డి22 ఎస్‌యూవీ గురించి ప్రస్తుతానికి వివరాలు చాలా పరిమితంగా ఉన్నాయి. అయితే, ఈ టీజర్ ను గమనిస్తే, ఇది స్వీయ-చార్జింగ్ (ప్లగ్ ఇన్ చేయాల్సిన అసరం లేకుండా సెల్ఫ్ చార్జ్ అయ్యే) హైబ్రిడ్ కారు అని తెలుస్తోంది. భారతదేశంలో ఇటువంటి పవర్‌ట్రైన్ ఆప్షన్‌తో వచ్చే మొదటి కారు బహుశా ఇదే కావచ్చేమో. ఈ కారు స్పెసిఫికేషన్‌లపై కూడా ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. అయితే, టొయోటా ఈ కారులో సరికొత్త 1.5-లీటర్, మూడు-సిలిండర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని విశ్వసిస్తున్నారు.

సెల్ఫ్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్న టొయోటా హైబ్రిడ్ ఎస్‌యూవీ.. ఆగస్ట్ 2022 లో లాంచ్!?

అంతర్జాతీయ మార్కెట్లలో టొయోటా విక్రయిస్తున్న యారిస్ హ్యాచ్‌బ్యాక్ మరియు యారిస్ క్రాస్ మోడళ్లలో పరిచయం చేయబడింది. ఈ ఇంజన్ మాత్రమే గరిష్టంగా 80 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండూ కలిసినట్లయితే, 115 బిహెచ్‌పి శక్తి జనరేట్ అవుతుంది. ఈ ఇంజన్ పెట్రోల్ రూపంలో 120 న్యూటన్ మీటర్ల టార్క్‌ ఉత్పత్తి చేయగా, ఎలక్ట్రిక్ మోటార్ తో కలిపి 141 న్యూటన్ మీటర్ల టార్క్ ‌ను ఉత్పత్తి చేస్తుంది.

సెల్ఫ్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్న టొయోటా హైబ్రిడ్ ఎస్‌యూవీ.. ఆగస్ట్ 2022 లో లాంచ్!?

టొయోటా నుండి రాబోయే ఈ కారులో అదే ఇంజన్ ఉపయోగించబడుతుందని ఊహించబడటానికి మరొక కారణం ఏమిటంటే, ఇటీవల భారత రోడ్లపై టొయోటా తమ యారిస్ క్రాస్ ను టెస్టింగ్ చేస్తుండగా కెమెరాకు చిక్కింది. కొన్ని నివేదికల ప్రకారం, టొయోటా నుండి రాబోయే ఈ కొత్త ఎస్‌యూవీ, ఈ జపనీస్ కార్ బ్రాండ్ యొక్క TNGA ప్లాట్‌ఫారమ్ పై తయారయ్యే స్థానిక వెర్షన్‌పై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. టొయోటా యొక్క కొత్త ఎస్‌యూవీ జూన్‌లో ప్రవేశపెట్టబడుతుందిన సమాచారం. కాకపోతే, దీనిని ఆగస్టు 2022 అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం, కాంపాక్ట్/మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పెరిగిన పోటీ నేపథ్యంలో, టొయోటా కూడా ఈ కొత్త ఎస్‌యూవీ చాలా పోటీ ధరతో మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ధర దాని మారుతి సుజుకి కౌంటర్‌ మోడల్ కంటే కాస్తంత ఎక్కువగా ఉండొచ్చని అంచనా. టొయోటా ఎస్‌యూవీ భారత మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత, ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌, ఎమ్‌జి ఆస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్‌ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

సెల్ఫ్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్న టొయోటా హైబ్రిడ్ ఎస్‌యూవీ.. ఆగస్ట్ 2022 లో లాంచ్!?

భారత్‌లో టొయోటా హైలక్ పికప్ (Toyota Hilux Pickup) విడుదల

ఇదిలా ఉంటే, టొయోటా ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ టొయోటా హైలక్ (Toyota Hilux) విడుదల చేసింది. దేశీయ విపణిలో టొయోటా హైలక్స్ ధరలు రూ. 33.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. కంపెనీ ఈ పికప్ ట్రక్కును మూడు వేరియంట్లలో విక్రయిస్తోంది. వీటిలో హైలక్స్ మ్యాన్యువల్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.33.99 లక్షలు కాగా, హైలక్స్ మ్యాన్యువల్ హై వేరియంట్ ధర రూ.35.80 లక్షలు మరియు హైలక్స్ ఆటోమేటిక్ హై వేరియంట్ ధర రూ.36.80 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి. ఈ మూడు వేరియంట్లు కూడా స్టాండర్డ్ 4x4 (ఆల్-వీల్ డ్రైవ్) సిస్టమ్‌తో లభిస్తాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Toyota hybrid compact suv teased with self charging technology
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X