భారత మార్కెట్లో Toyota Hyryder లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది: వివరాలు

'టొయోట' (Toyota) కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న తన కొత్త ఎస్‌యువి 'హైరైడర్‌' (Hyryder) ఎప్పుడు విడుదలవుతుందా అని ఎంతో మంది వాహన ప్రియులు ఎదురు చూస్తున్న సమయంలో, కంపెనీ ఈ ఎస్‌యువి యొక్క లాంచ్ డేట్ వెల్లడించింది. అంతకంటే ముందే కంపెనీ ఈ నెల ప్రారంభంలో ఈ ఎస్‌యువిని దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది, మరియు అదే రోజు బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

భారత మార్కెట్లో Toyota Hyryder లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది: వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, భారతీయ మార్కెట్లో టొయోట కంపెనీ తన 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' (Urban Cruiser Hyryder) ను వచ్చే నెల 16 న (2022 ఆగష్టు 16) అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ ఎస్‌యువి కోసం బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించబడ్డాయి, కావున కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు టయోటా డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్ సైట్ లో రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమవుతాయి.

భారత మార్కెట్లో Toyota Hyryder లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది: వివరాలు

ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టొయోట హైరైడర్ మొత్తం నాలుగు ట్రిమ్స్ (E, S, G మరియు V ట్రిమ్స్) మరియు రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందించబడుతుంది. అయితే ఇందులోని S, G మరియు V ట్రిమ్స్ లో స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌, E ట్రిమ్ లో మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ అందుబాటులో ఉంటాయి.

భారత మార్కెట్లో Toyota Hyryder లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది: వివరాలు

స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌లు 1.5 లీ TNGA అట్కిన్సన్ పెట్రోల్ ఇంజన్ మరియు 177.6 V లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తాయి. ఇది 92 హెచ్‌పి పవర్ మరియు 122 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవన్నీ టయోటా యొక్క ఇ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతాయి. కావున మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి.

భారత మార్కెట్లో Toyota Hyryder లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది: వివరాలు

ఇక మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో నియో డ్రైవ్ ఇంజిన్‌ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంటుంది. కావున ఇది 1.5-లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 137 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆప్సనల్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో Toyota Hyryder లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది: వివరాలు

కొత్త అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUV ఆధునిక డిజైన్ కలిగి ఉంటుంది. కావున ఇది డబుల్-లేయర్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు స్లిమ్ సి-టైప్ ఎల్ఈడి టెయిల్ లైట్స్ పొందుతుంది. ఇవి టెయిల్‌గేట్ వరకు విస్తరించి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ కలర్ ఏ- పిల్లర్లు మరియు ఫ్లోటింగ్ రూఫ్‌ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

భారత మార్కెట్లో Toyota Hyryder లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది: వివరాలు

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యుయల్-టోన్ ఇంటీరియర్ డాష్‌ బోర్డు ఉంటుంది. డోర్ ప్యాడ్‌లపై కొన్ని క్రోమ్ మరియు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉండటం చూడవచ్చు. డాష్‌ బోర్డులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అంతే కాకుండా 7-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

భారత మార్కెట్లో Toyota Hyryder లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది: వివరాలు

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, టొయోట అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి వాటితోపాటు రియర్ ప్యాసింజర్ల కోసం సీట్‌బెల్ట్స్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి వాటిని పొందుతుంది.

భారత మార్కెట్లో Toyota Hyryder లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది: వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త హైరైడర్ మొత్తం 11 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి రానుంది. ఇందులో 7 మోనోటోన్ కలర్స్ కాగా మిగిలిన నాలుగు డ్యూయెల్ టోన్ కలర్స్. ఈ SUV దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, ఎంజి ఆస్టర్ మరియు మారుతి సుజుకి గ్రాండ్ వితారా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

భారత మార్కెట్లో Toyota Hyryder లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది: వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 'టొయోట హైరైడర్' ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. కావున ఈ కొత్త SUV మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, మంచి బుకింగ్స్ పొందగలదా.. లేదా? అనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' ఛానల్ చూస్తూ ఉంటుంది.

Most Read Articles

English summary
Toyota urban cruiser hyryder india launch date revealed and details
Story first published: Tuesday, July 26, 2022, 14:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X