ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఇ-ఆటో.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది..!

బెంగళూరుకు చెందిన ఎనర్జీ స్టార్టప్ కంపెనీ ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ (Exponent Energy), కేవలం 15 నిమిషాలలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను 0 నుండి 100 శాతం చార్జ్ చేయగల ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన ఇ-ఆటో చార్జర్ ను ఆవిష్కరించింది. ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల కోసం వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేయడానికి ఆల్టిగ్రీన్ ప్రొపల్షన్ ల్యాబ్స్ (Altigreen Propulsion Labs) తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి ఇ-పంప్ (e-pump) అని పిలువబడే ఫాస్ట్ చార్జర్ ను పరిచయం చేశాయి.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఇ-ఆటో.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది..!

ఇరు కంపెనీలు కలిసి ఎక్స్‌పోనెంట్ యొక్క 8.19 kWh బ్యాటరీ ప్యాక్‌ తో కూడిన అల్టిగ్రీన్ కమర్షియల్ ఆటోరిక్షాను ప్రదర్శించాయి. ఇది సాంప్రదాయ LPF సెల్ కెమిస్ట్రీని ఉపయోగించి దేశీయంగా అభివృద్ధి చేయబడిన బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీ ప్యాక్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 85 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు మరియు ఎక్స్‌పోనెంట్ యొక్క ఈ బ్యాటరీ ప్యాక్ ను ఇ-పంప్ నెట్‌వర్క్‌ సాయంతో కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఇ-ఆటో.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది..!

ఎక్స్‌పోనెంట్ యొక్క ఇ-పంప్ ఛార్జింగ్ నెట్‌వర్క్ తో తమ స్వంత ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలనే కాకుండా ఇతర కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలను కూడా అత్యంత వేగంతో ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, కేవలం కొద్ది నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలను అత్యంత వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. సాధారణ ఫాస్ట్ చార్జర్లతో పోలిస్తే, ఇది 15 రెట్లు వేగంగా ఛార్జ్ చేయగలదు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఇ-ఆటో.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది..!

ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ ఆటోను అక్టోబర్‌లో డెలివరీ చేయనున్నట్లు ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ ప్రకటించింది. ప్రస్తుతం, ఈ ఉత్పత్తికి భారతీయ ఆటో ప్రియుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోందని మరియు ఈ స్పందనను దృష్టిలో ఉంచుకుని, వీలైనంత త్వరగా ఇ-ఆటోను డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ ఫాస్ట్ చార్జింగ్ ఇ-పంప్‌ లను ఇన్‌స్టాల్ చేయడానికి సంబంధించి కంపెనీకి ఇప్పటికే దాదాపు 100 కు పైగా ఆర్డర్‌లు వచ్చాయని, 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అవన్నీ పూర్తిగా పని చేసేలా ప్లాన్ చేస్తామని కంపెనీ తెలిపింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఇ-ఆటో.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది..!

ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ కంపెనీకి వచ్చిన ఆర్డర్లలో అత్యధికం బెంగళూరు నుంచే కావడం గమనార్హం. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు అగ్ని ప్రమాదాలు సంభవించిన ఘటనలు చాలానే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, తమ ఎలక్ట్రిక్ వాహనాలలో ఇలాంటి ఘటనలను నివారించేందుకు కంపెనీ తమ ఎలక్ట్రిక్ ఆటోల్లో ఉపయోగించే బ్యాటరీని ఫైర్ రెసిస్టెంగా అభివృద్ధి చేసింది. ఈ బ్యాటరీ 50 °C వరకు ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రూపొందించబడిందని కంపెనీ తెలిపింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఇ-ఆటో.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది..!

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ బ్యాటరీ సుదీర్ఘ జీవితకాలం మరియు ఎక్కువ మన్నికను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ ఆటో సంప్రదాయ ఆటోల నుండి కాస్తంత భిన్నంగా కనిపిస్తుంది, దీని డిజైన్ పూర్తిగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇ-ఆటో లాంచ్ ఈవెంట్ ద్వారా అల్టిగ్రీన్ ప్రొపల్షన్ ల్యాబ్‌తో ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ తన అనుబంధాన్ని కూడా వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనం, బ్యాటరీ, ఇ-పంప్‌తో సహా పరికరాలను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ఈ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఇ-ఆటో.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది..!

ఇటీవలి కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ చాలా వేగంగా పెరుగుతోంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్, చార్జింగ్ నెట్‌వర్క్ మరియు సుధీర్ఘమైన చార్జింగ్ సమయం వంటి అంశాల కారణంగా ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ ప్రవేశపెట్టిన ఇ-పంప్ వంటి ఫాస్ట్ చార్జర్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినట్లయితే, పెట్రోల్ కార్లలో పెట్రోల్ కొట్టించుకున్నంత సులభంగా తమ ఎలక్ట్రిక్ వాహనాలను చార్జ్ చేసుకొని రోడ్డుపై పరుగులు తీయవచ్చు.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఇ-ఆటో.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది..!

మార్కెట్లో రెండు ఇ-ఆటోలను విడుదల చేసిన హైదరబాద్ కంపెనీ జీరో21

ఇదిలా ఉంటే, హైదరాబాద్‌కు చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ జీరో21 (ZERO21) మార్కెట్లో రెండు కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌లను ఆవిష్కరించింది. ప్యాసింజర్ సెగ్మెంట్ మరియు కార్గో సెగ్మెంట్ కోసం కంపెనీ రెండు ప్రత్యేమైన ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను తయారు చేసింది. ఇవి ప్రస్తుతం పెట్రోల్ / డీజిల్ తో నడిచే సాంప్రదాయ ఆటోరిక్షాల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. త్వరలోనే వీటి విక్రయం మరియు డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఇ-ఆటో.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది..!

ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో జీరో21 టీర్ (ZERO21 Teer) పేరుతో కంపెనీ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాను విడుదల చేసింది. ఈ హై-స్పీడ్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీవీలర్ 5000W (5kW) రేటెడ్ పవర్ మరియు 8.5kW వరకు గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ 48 V ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 72 ఎన్ఎమ్ టార్క్‌ ను జనరేట్ చేస్తుంది. ఇ-ఆటో గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది మరియు పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 110 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఇ-ఆటో.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది..!

ఇక కార్గో సెగ్మెంట్లో జీరో21 విడుదల చేసిన ఎలక్ట్రిక్ త్రీవీలర్ విషయానికి వస్తే, స్మార్ట్ మ్యూల్-ఎక్స్ (Smart Mule-X) పేరుతో దీనిని విడుదల చేశారు. ప్రత్యేకించి సరుకు రవాణా కోసం తయారు చేయబడిన ఈ ఎలక్ట్రిక్ ఇ-ఆటో 8000W (8kW) రేటెడ్ పవర్ మరియు 10.9kW వరకు పీక్ పవర్ ను కలిగి ఉంటుంది. ఈ హై-స్పీడ్ గూడ్స్ క్యారియర్ లోని 72 V ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 97 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది గంటకు 55 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు తీస్తుంది. పూర్తి చార్జ్ పై ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా గరిష్టంగా 125 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని మరియు ఇది 750 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
World s fastest charging e auto from exponent energy all you need to know
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X