యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం.. స్థలం అమ్మి మరీ రూ.2 కోట్ల హెల్మెట్లు దానం చేసిన వ్యక్తి..!

బీహార్ కి చెందిన ఓ వ్యక్తి గడచిన 7 ఏళ్లలో ద్విచక్ర వాహనదారులకు 2 కోట్ల రూపాయల విలువైన దాదాపు 49,000 హెల్మెట్లను ఉచితంగా అందించాడు. ఇందుకోసం అతను స్థలాన్ని కూడా అమ్మేశాడు. అతను ఇలా చేయడం వెనుక ఓ విషాధ గాధ దాగి ఉంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం.. స్థలం అమ్మి మరీ రూ.2 కోట్ల హెల్మెట్లు దానం చేసిన వ్యక్తి..!

బీహార్‌కు చెందిన 34 ఏళ్ల రాఘవేంద్ర కుమార్ ఇప్పటివరకు 49,000 హెల్మెట్‌లను పంపిణీ చేశారు. వృత్తి రీత్యా కంప్యూటర్‌ ఇంజినీర్‌ గా పనిచేసే కుమార్, కొన్ని సంవత్సరాల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తన స్నేహితుడిని కోల్పోయాడు. ఆ ప్రమాద సమయంలో తన స్నేహితుడు టూవీలర్ పై వెళ్తుండగా, ప్రమాదం జరిగి మరణించాడు. ఆ సమయంలో అతను హెల్మెట్ ధరించకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.

యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం.. స్థలం అమ్మి మరీ రూ.2 కోట్ల హెల్మెట్లు దానం చేసిన వ్యక్తి..!

ఈ నేపథ్యంలో, తన స్నేహితుడికి వచ్చిన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని రాఘవేంద్ర కుమారు ఈ విధంగా ఉచిత హెల్మెట్‌ పంపిణీని ప్రారంభించాడు. కుమార్ గత ఏడేళ్లుగా ఉచితంగా హెల్మెట్‌లను పంపిణీ చేస్తున్నాడు. రాఘవేంద్ర కుమార్‌ గత 7 సంవత్సరాలలో 49,000 హెల్మెట్‌ లకు పైగా ఉచితంగా పంపిణీ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు.

యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం.. స్థలం అమ్మి మరీ రూ.2 కోట్ల హెల్మెట్లు దానం చేసిన వ్యక్తి..!

అనుకోని ప్రమాదాల్లో ప్రియమైన వారి కోల్పోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. ఇది చాలా మందికి జీవితకాల దుఃఖంగా మారుతుంది. అయినప్పటికీ, మనం ఈ దుఃఖాన్ని ఎలా ఎదుర్కొంటామో అనేదే మనల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. రాఘవేంద్ర కుమార్ కూడా తన స్నేహితుడు చనిపోయాడని దిగులు చెందకుండా, ఆ పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని మోటారిస్టుల భద్రత కోసం ఉచితంగా హెల్మెట్ లను పంపిణీ చేయడం ప్రారంభించాడు.

యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం.. స్థలం అమ్మి మరీ రూ.2 కోట్ల హెల్మెట్లు దానం చేసిన వ్యక్తి..!

కుమార్ చేస్తున్న ఈ గొప్ప పనికి గాను ప్రజలు అతడిని 'హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా' (Helmet Man Of India) అని పిలవడం ప్రారంభించారు. ఉచిత హెల్మెట్ ల పంపిణీ కోసం కుమార్ నిధుల కొరతను ఎదుర్కొన్నప్పుడు, అతను గ్రేటర్ నోయిడాలోని ఉన్న తన పూర్వీకుల భూమిని మరియు ఇంటిని విక్రయించి, నిర్విరామంగా హెల్మెట్ పంపిణీ చేపట్టాడు.

యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం.. స్థలం అమ్మి మరీ రూ.2 కోట్ల హెల్మెట్లు దానం చేసిన వ్యక్తి..!

ఈ విషయం గురించి రాఘవేంద్ర కుమార్ మాట్లాడుతూ.. "2014లో బీహార్‌ లోని మధుబని జిల్లాకు చెందిన నా స్నేహితుడు కెకె ఠాకూర్ నోయిడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో అతడు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. అప్పటి నుంచి ఆయన జ్ఞాపకార్థం హెల్మెట్ లను పంపిణీ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు.

యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం.. స్థలం అమ్మి మరీ రూ.2 కోట్ల హెల్మెట్లు దానం చేసిన వ్యక్తి..!

కుమార్ గత ఏడేళ్లలో ఢిల్లీ, బీహార్, యూపీ, ఎంపీ, రాజస్థాన్, హర్యానా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా 22 రాష్ట్రాల్లో 49,272 హెల్మెట్‌లను పంపిణీ చేసినట్లు కుమార్ తెలిపారు. "ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో, నేను హెల్మెట్ లేని బైకర్లకు 6,500 కంటే ఎక్కువ హెల్మెట్లను పంపిణీ చేసాను" అని ఆయన గర్వంగా చెప్పారు.

యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం.. స్థలం అమ్మి మరీ రూ.2 కోట్ల హెల్మెట్లు దానం చేసిన వ్యక్తి..!

కుమార్ తన సొంత జిల్లా అయిన కైమూర్‌లో 4,000 హెల్మెట్‌లతో సహా బీహార్‌లో అత్యధిక సంఖ్యలో 13,000 హెల్మెట్ లను పంపిణీ చేశారు. "నేను హెల్మెట్‌ల కొనుగోలుకు నిధుల కొరతను ఎదుర్కొన్నప్పుడు, బీహార్‌ లోని నా స్వస్థలంలో 3 బిఘాల భూమిని మరియు గ్రేటర్ నోయిడాలో కొనుగోలు చేసిన ఇంటిని విక్రయించాను" అని కుమార్ చెప్పారు.

ఈ హెల్మెట్ పంపిణీ ప్రక్రియను ఇలానే కొనసాగించేందుకు మరియు భారతదేశాన్ని ప్రమాద రహితంగా మార్చేందుకు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద తనకు హెల్మెట్‌ లను అందజేయాలని కార్పొరేట్‌ సంస్థలకు కుమార్ విజ్ఞప్తి చేశారు. కుమార్ ఇప్పటివరకు వివిధ బ్రాండెడ్ కంపెనీల నుండి 49,272 హెల్మెట్‌ల కొనుగోలు చేశారు, ఇందు కోసం అతను సుమారు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు.

యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం.. స్థలం అమ్మి మరీ రూ.2 కోట్ల హెల్మెట్లు దానం చేసిన వ్యక్తి..!

కుమార్ తన స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరేలా ఈ ఉచిత హెల్మెట్ పంపిణీ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంటానని చెప్పారు. కుమార్ వివిధ హెల్మెట్ తయారీ కంపెనీల లింక్‌లు మరియు చిరునామాలతో కూడిన ‘హెల్మెట్‌మ్యాన్' (Helmetman) పేరుతో ఓ వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ఇటీవల, కుమార్ బీహార్‌లో రక్షాబంధన్ రోజున వారి సోదరుల కోసం అమ్మాయిలకు 172 హెల్మెట్ లను బహుమతిగా ఇచ్చాడు.

యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం.. స్థలం అమ్మి మరీ రూ.2 కోట్ల హెల్మెట్లు దానం చేసిన వ్యక్తి..!

రాఘవేంద్ర కుమార్ చేస్తున్న సేవలకు ముగ్ధుడైన బాలీవుడ్ నటుడు మరియు పరోపకారి సోనూ సూద్ ఒక ప్రైవేట్ వార్తా ఛానెల్ కోసం అతని పనికి సంబంధించిన ప్రోగ్రామ్‌కు హోస్ట్ గా చేశారు. దీంతో కుమార్ చేసే పనులు ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కార్యక్రమం త్వరలో ప్రసారం కానుంది.

యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం.. స్థలం అమ్మి మరీ రూ.2 కోట్ల హెల్మెట్లు దానం చేసిన వ్యక్తి..!

ఇటీవలి కాలంలో భారత ఆటోమొబైల్ పరిశ్రమలో టెక్నాలజీ ప్రమాణాలు రోజురోజుకూ మెరుగుపడుతున్నాయి. వాహనాల పనితీరును పెంపొందించే సాంకేతికతలతో పాటు ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసే సాంకేతికతలను కూడా ఆటోమొబైల్ కంపెనీలు ఆవిష్కరిస్తున్నాయి. అయితే, ద్విచక్ర వాహనాల విషయంలో ప్రయాణీకుల కోసం అందుబాటులో ఉన్న భద్రతా ఫీచర్లు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఖరీదైన ద్విచక్ర వాహనాలలో మాత్రమే అందించబడతాయి.

యాక్సిడెంట్‌లో ఫ్రెండ్ మరణం.. స్థలం అమ్మి మరీ రూ.2 కోట్ల హెల్మెట్లు దానం చేసిన వ్యక్తి..!

మనదేశంలో టూవీలర్ వినియోగదారులు ఎక్కువగా రూ. 1 లక్ష కన్నా తక్కువ ధర కలిగిన బడ్జెట్ టూవీలర్లను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి బడ్జెట్ టూవీలర్లలో మెరుగైన భద్రతా సాంకేతికతలు ఉండవు. అయితే, హై-ఎండ్ మోటార్‌సైకిళ్లలో మాత్రం ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, మీరు ఉపయోగించే టూవీలర్లలో ఎలాంటి అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు ఉన్నప్పటికీ, మీరు టూవీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం అన్నింటి కన్నా సురక్షితం అని గుర్తుంచుకోండి.

మూలం: న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌

Most Read Articles

English summary
Bihar man distributes 49000 helmets for free there is a sad story behind this lets find out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X