ఈ కారుని నడపటానికి జస్ట్ ఎండ ఉంటే చాలు.. స్క్వాడ్ సోలార్ సిటీ మినీ ఎలక్ట్రిక్ కార్..

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు అత్యంత ప్రాచుర్యం పొందాయి. అయితే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ప్రధానంగా ఉన్న సమస్య వాటి చార్జింగ్ గురించే. కాబట్టి, ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తూ, కేవలం సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసింది నెదర్లాండ్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థ స్క్వాడ్ మొబిలిటీ (Squad Mobility). ఈ కంపెనీ ఇటీవలే సోలార్ సిటీ మినీ ఎలక్ట్రిక్ కారును (Solar City Mini Electric Car) విడుదల చేసింది.

ఈ కారుని నడపటానికి జస్ట్ ఎండ ఉంటే చాలు.. స్క్వాడ్ సోలార్ సిటీ మినీ ఎలక్ట్రిక్ కార్..

సోలార్ సిటీ మినీ ఒక రెండు-సీట్ల ఎలక్ట్రిక్ కారు మరియు ఇది పూర్తిగా సోలార్ పవర్‌తో నడుస్తుంది. యూరోపియన్ యూనియన్ దేశాలలో ఈ ఎలక్ట్రిక్ కారును నడిపేందుకు డ్రైవర్ లైసెన్స్ కూడా అవసరం లేదు. ప్రైవేట్ కొనుగోలుదారులు మరియు ఫ్లీట్ కంపెనీల కోసం స్క్వాడ్ మొబిలిటీ ఈ మినీ ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. ఈ సోలార్-ఛార్జ్డ్ కాంపాక్ట్ కారు త్వరలో ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మధ్య అంతరాన్ని తగ్గించగలదని భావిస్తున్నారు.

ఈ కారుని నడపటానికి జస్ట్ ఎండ ఉంటే చాలు.. స్క్వాడ్ సోలార్ సిటీ మినీ ఎలక్ట్రిక్ కార్..

స్క్వాడ్ మొబిలిటీ సోలార్ సిటీ కార్ల కోసం బుకింగ్ లను కూడా ప్రారంభించింది మరియు 2023 నుండి వీటి డెలివరీలు కూడా ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు. యూరప్ దేశాలలో, ఈ సోలార్ సిటీ కారు ధర 6,250 యూరోలుగా నిర్ణయించబడింది. మన భారతీయ కరెన్సీలో దీని ధర సుమారు 5 లక్షల రూపాయల వరకూ ఉంటుంది.

ఈ కారుని నడపటానికి జస్ట్ ఎండ ఉంటే చాలు.. స్క్వాడ్ సోలార్ సిటీ మినీ ఎలక్ట్రిక్ కార్..

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు

స్క్వాడ్ సోలార్ కార్ అనేది యూరోపియన్ యూనియన్ (EU) లో L6e వాహనంగా వర్గీకరించబడిన తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనం (LEV). కాబట్టి, దీనిని నడపడానికి కమర్షియల్ లేదా ఫోర్-వీలర్ డ్రైవర్ లైసెన్స్ అవసరం లేదు. దీన్ని నడపడానికి సాధారణ మోపెడ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. ఈ క్లాస్ వర్గీకరణ కారణంగా, డ్రైవర్‌లు ఏ దేశంలో డ్రైవింగ్ చేస్తున్నారనే దాన్ని బట్టి వారి వయస్సు 14, 15 లేదా 16 సంవత్సరాల ఉండవచ్చు.

ఈ కారుని నడపటానికి జస్ట్ ఎండ ఉంటే చాలు.. స్క్వాడ్ సోలార్ సిటీ మినీ ఎలక్ట్రిక్ కార్..

సైజులో మినీ కారు, కానీ ఎక్కువ స్థలం

స్క్వాడ్ సోలార్ సిటీ కారు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, ఇందులో ఇద్దరు ప్రయాణీకులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. అలాగే, ఇందులో లగేజ్ కోసం తగిన స్థలం కూడా ఉంటుంది. ఇందులో 68 లీటర్ల కార్గో స్పేస్ ఉంటుంది. అదే సమయంలో, గాలి మరియు వెలుతురు లోపలికి రావడానికి పెద్ద విండోలు కూడా ఉంటాయి. కారులో రెండు తలుపులు ఉంటాయి, అవసరమైతే వాటిని పూర్తిగా తొలగించుకునే వెసలుబాటు కూడా ఉంటుంది. కారులో నిత్యావసర వస్తువులను ఉంచేందుకు కూడా స్థలం ఉంటుంది. ఇందులో బ్యాగ్ లేదా ల్యాప్‌టాప్, కప్ హోల్డర్‌లు, ఫోన్ హోల్డర్ మరియు USB ఛార్జర్ కోసం డాష్‌బోర్డ్ లో స్థలం ఉంటుంది.

ఈ కారుని నడపటానికి జస్ట్ ఎండ ఉంటే చాలు.. స్క్వాడ్ సోలార్ సిటీ మినీ ఎలక్ట్రిక్ కార్..

100 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది

ఈ చిన్న ఎలక్ట్రిక్ కారులో వెనుక చక్రాలకు శక్తినిచ్చే రెండు 2kW ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. ఇవి మొత్తం 4kW శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కారుకు శక్తినివ్వడానికి ఇందులో నాలుగు 1.6 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు ఉపయోగించబడ్డాయి. ఇద్దరు రైడర్లతో, ఈ ఎలక్ట్రిక్ కారు ఫుల్ ఛార్జింగ్ పై 100 కి.మీ రేంజ్ ను అందిస్తుంది మరియు అదే సమయంలో ఇది గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

ఈ కారుని నడపటానికి జస్ట్ ఎండ ఉంటే చాలు.. స్క్వాడ్ సోలార్ సిటీ మినీ ఎలక్ట్రిక్ కార్..

పైకప్పుపై సౌర ఫలకాలు (సోలార్ ప్యానెల్స్) అమర్చారు

ఈ మినీ ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీని తరచూ చార్జ్ చేయడం కోసం కంపెనీ ఈ కారు పైభాగంలో సోలార్ ప్యానెళ్లను అమర్చారు. ఫలితంగా, కారును ఎండలో నడుపుతున్నంతసేపు సౌరశక్తి ద్వారా వచ్చే విద్యుత్ బ్యాటరీని చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కేవలం సోలార్ ప్యానెల్‌తో, ఇది 20 కిలోమీటర్ల వరకు రన్నింగ్ ఛార్జీని అందిస్తుంది. పరిమాణంలో చాలా చిన్నది కావడంతో ఇరుకైన ప్రదేశాలలో కూడా సులభంగా డ్రైవ్ చేయడానికి మరియు పార్క్ చేయడానికి వీలుగా ఉంటుంది.

ఈ కారుని నడపటానికి జస్ట్ ఎండ ఉంటే చాలు.. స్క్వాడ్ సోలార్ సిటీ మినీ ఎలక్ట్రిక్ కార్..

భద్రతలోనూ పటిష్టంగా ఉంది

ఈ ఎలక్ట్రిక్ కారు పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ, కంపెనీ దీని సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. అయితే, సాధారణం కారులో ఉన్నంత సేఫ్టీ ఇందులో లేదని, కానీ బైక్ కంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సోలార్ సిటీ కారు తేలికైన మరియు బలంగా ఉండే రోల్ కేజ్ అల్లాయ్ ఫ్రేమ్‌పై నిర్మించబడింది. ఇది లోపలి ప్రయాణీకులను అన్ని వైపుల నుండి సురక్షితంగా ఉంచుతుంది. యూరోపియన్ ప్రమాణాల ప్రకారం, సోలార్ సిటీ కారులో మరిన్ని భద్రతా ఫీచర్లు ఇవ్వబడ్డాయి.

ఈ కారుని నడపటానికి జస్ట్ ఎండ ఉంటే చాలు.. స్క్వాడ్ సోలార్ సిటీ మినీ ఎలక్ట్రిక్ కార్..

4-సీటర్ వెర్షన్ రావచ్చు

కాగా, ఈ సోలార్ సిటీ కారులో కంపెనీ ఓ 4-సీటర్ మోడల్‌ను కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతానికి, ఇందులో 2-సీటర్ వెర్షన్ మాత్రమే యూరోపియన్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఐరోపాలోని అనేక దేశాలలో ఈ మోడల్ కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి మరియు ఇది 2022 చివరి నాటికి రోడ్లపైకి రానుంది.

Most Read Articles

English summary
Squad solar city mini electric car that runs on pure solar power and you dont need license to drive
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X