లిఫ్ట్ ఇచ్చిన పాపానికి కోర్టులో జరిమానా కట్టించిన పోలీసులు

మన ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనపుడు లేదా అత్యవసరంగా వెళ్లాలన్నపుడు రోడ్డు మీద వెళ్లే వాహనాదారులను లిఫ్ట్ అడగం షరా మామూలే. కానీ, మీకు తెలుసా భారత మోటార్ వాహనాల చట్టం ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవడ్డం నేర

By Anil Kumar

మన ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైనపుడు లేదా అత్యవసరంగా వెళ్లాలన్నపుడు రోడ్డు మీద వెళ్లే వాహనాదారులను లిఫ్ట్ అడగం షరా మామూలే. కానీ, మీకు తెలుసా భారత మోటార్ వాహనాల చట్టం ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవడ్డం నేరం.

లిఫ్ట్ ఇవ్వడం నేరం

విడ్డూరంగా ఉంది కదూ... ఇది అక్షరాలా నిజం. ముంబాయ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఎదురైన ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అభివృద్ది చెందిన భారతదేశంలో పాత కాలం నాటి చట్టాలు ఇంకా ఎందుకు ఉన్నాయని ప్రజలు మరియు నెటిజన్లు ప్రభుత్వం మీద మండిపడుతున్నారు.

లిఫ్ట్ ఇవ్వడం నేరం

వివరాల్లోకి వెళితే, ముంబాయ్‌కి చెందిన నితిన్ నాయర్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నితిన్ ఇటీవల ఓ కంపెనీని కూడా ప్రారంభించారు. రోజూలాగే తన విధులు ముగించుకుని జూన్ 18 వ తేదీ సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు.

లిఫ్ట్ ఇవ్వడం నేరం

మార్గమధ్యలో ఉన్న ఐరోలీ సర్కిల్ వద్దకు వచ్చాడు. అక్కడున్న బస్‌స్టాప్ వద్ద ఎంతో బస్సు మరియు ఆటోల కోసం వేచి ఉన్నారు. చీకటి పడటం, అందులో జోరుగా వర్షం పడుతుండటంతో కొంత మంది సహాయం కోసం ఎదురుచూస్తుండటాన్ని గమనించిన నితిన్ సహాయం చేద్దామని అదే మార్గంలో వెళుతున్న ఓ ముగ్గురిని తన కారులో ఎక్కించుకున్నాడు.

లిఫ్ట్ ఇవ్వడం నేరం

కొంత దూరం నుండి గమనించిన ట్రాఫిక్ పోలీసులు క్షణాల్లో నితిన్ కారు దగ్గరికి వచ్చి, డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించుకున్నాడు. ఎవరు వీళ్లు, ఇక్కడెందుకు ఎక్కారు అని ప్రశ్నించడంతో అసలు విషయం పోలీసులు చెప్పాడు.

లిఫ్ట్ ఇవ్వడం నేరం

అంతా విన్న ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ రూ. 1500 ల చలనా చేతిలో పెట్టాడు. చలానా చూసి ఆశ్చర్యపోయిన నితిన్ నాయర్ లిఫ్ట్ ఇవ్వడం చట్టపరంగా నేరం అనే విషయం తెలియక చలానా ఎందుకిచ్చారని అడిగాడు.

లిఫ్ట్ ఇవ్వడం నేరం

సెక్షన్ 66/192 చట్టం ప్రకారం గుర్తు తెలియని మరియు అపరిచిత వ్యక్తులకు పర్సనల్ కారులో లిఫ్ట్ ఇవ్వడం నేరం. తొలు పోలీసులు తప్పుగా ఫైన్ వేశారని భావించి మళ్లీ ప్రశ్నించగా వారి నుండి అదే సమధానం. ఖంగుతిన్న నితిన్ నాయర్‌కు తన 12 ఏళ్ల డ్రైవింగ్ అనుభవంలో ఈ సంఘటన మొదటిసారి ఎదురైంది.

లిఫ్ట్ ఇవ్వడం నేరం

షాక్ నుండి తేరుకున్న నితిన్ నాయర్ కారులో ఎక్కించుకున్న వ్యక్తులను వారి ప్రదేశాల్లో దింపి ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, అక్కడి నుండి కోర్టుకు వెళ్లి నితిన్‌ చేత జరిమానా చెల్లించి, నేను చేసింది తప్పే అని ఒప్పించి తన డ్రైవింగ్ లైసెన్స్ వెనక్కి ఇప్పించారు.

లిఫ్ట్ ఇవ్వడం నేరం

చాలా మందికి ట్రాఫిక్ పోలీసులకు డ్రైవింగ్ రూల్స్ మరియు మోటార్ వాహనాల చట్టాల పట్ల సరైన అవగాహన ఉండదని సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు చూస్తుంటాం. తొలుత అందరూ ఇది కూడా అలాంటిదే అని భావించారు. కానీ, ఈ పోలీస్ చాలా తెలివైన వాడు, చట్టాన్ని అవపోసన పట్టినట్లున్నాడు. సరైన సమయంలో వచ్చి చేసిన తప్పుకు నితిన్ నాయర్ మీద చట్టంతో కొరడా ఝులిపించాడు.

ఇబ్బందుల్లో వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమా....? అసలు లిఫ్ట్ ఇచ్చేది అపరిచితులకే కదా...? ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయాలన్నా కూడా చట్టాలు అడ్డు వస్తున్నాయి. ఇలాంటి చట్టాలు ఎవరికి ఉపయోగం అన్ని ప్రశ్నిస్తూ తన అనుభవాన్నంతా ఫేస్‌‌బుక్ ద్వారా పంచుకున్నాడు. ఆ పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

దీని పట్ల మీ అభిప్రాయం ఏమిటి? క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి...

Most Read Articles

English summary
Read In Telugu: You can be fined for ‘giving a lift’ to strangers in India; Yes, it really happened!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X