Just In
Don't Miss
- News
మావోయిస్టులకు బిగ్ షాక్: కేంద్ర కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి?
- Lifestyle
మీ రాశిని బట్టి 2020లో ఏ నెల మీకు ప్రమాదకరమైన మరియు దురదృష్టకరమైన నెల అవుతుందో మీకు తెలుసా?
- Movies
మెగా అభిమాని మరణం.. ఫ్యామిలీని ఆదుకునేందుకు రంగంలోకి రామ్ చరణ్
- Technology
పీసీ సరిగా పనిచేయడం లేదా, అయితే ఇది చూడండి
- Sports
85 కోట్లు: రాజస్థాన్ రాయల్స్‌లో తన 3 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమైన షేన్ వార్న్
- Finance
మరో రూ.1 లక్ష కోట్లు టార్గెట్, వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్: నేరుగా కాకుండా...
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
జావా పెరాక్ విడుదల.. సంచలనాత్మక ధరతో దిగ్గజాలకు దడ
జావా మోటార్‌సైకిల్స్ సరికొత్త "జావా పెరాక్" మోటార్ సైకిల్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. జావా పెరాక్ మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ. 1.94 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఖరారు చేశారు. జావా మరియు జావా 42 బైకుల తర్వాత జావా మోటార్ సైకిల్స్ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన మూడవ మోడల్ జావా పెరాక్.
డిజైన్ పరంగా దీనిని బాబర్ స్టైల్ అంటారు, ఈ డిజైన్ శైలిలో ఇండియన్ మార్కెట్లో లభించే చీపెస్ట్ బాబర్ స్టైల్ మోటార్ సైకిల్ ఇదే కావడం గమనార్హం. జావా పెరాక్ బాబర్ బైకు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి...

జావా సిరీస్‌లోకి కొత్త మోడల్
పురాతణ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థగా పేరుగాంచిన జావా మోటార్ సైకిల్స్ సరిగ్గా ఏడాది క్రితం ఇండియన్ మార్కెట్లోకి రెండోసారి ఎంటర్ అయ్యింది. తమ జావా మరియు జావా 42 బైకులకు కొనసాగింపుగా మూడో మోడల్ "జావా పెరాక్" బైకును పూర్తి స్థాయిలో అత్యంత సరసమైన ధరతో రిలీజ్ చేసింది.

న్యూ స్టైల్.. న్యూ లుక్..
సింగల్ సీటు, ఎత్తయిన హ్యాండిల్, గుండ్రటి హెడ్ ల్యాంప్ మరియు తక్కువ పొడవుతో ఉండే బైకులను డిజైన్ పరంగా బాబర్ స్టైల్ అంటారు. 1940 కాలం నాటి అసలైన జావా బైకుల డిజైన్ ప్రేరణతో "జావా పెరాక్" బాబర్ బైకును విభిన్నమైన డిజైన్ లక్షణాలతో తీర్చిదిద్దారు, ఈ ధరల శ్రేణిలో ఏకైక మోడల్ కావడం విశేషం.

బుకింగ్స్ & డెలివరీ
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జావా షోరూముల్లో జావా పెరాక్ మోటార్ సైకిల్‌పై అధికారికంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి మరియు ఆన్లైన్లో జనవరి 01, 2020 నుండి అందుబాటులోకి రానుంది. అదే విధంగా ఏప్రిల్ 02, 2020 నుండి డెలివరీ ప్రారంభిస్తామని వెల్లడించారు.

డిజైన్
జావా పెరాక్ బాబర్ బైక్ సైడ్ డిజైన్‌లో ఫ్రేమ్ కనబడేలా ఇంజన్ ఎక్స్పోజింగ్, కన్నీటి చుక్క ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, ఎత్తయిన స్టైలిష్ హ్యాండిల్ బార్, పొడవాటి సైలెన్సర్,సింగల్ సీటు వంటి దీనికి అద్భుతమైన లుక్ తీసుకొచ్చాయి.

ఇంజన్, పవర్ & గేర్‌బాక్స్
జావా పెరాక్ బైకులో ఉన్న ఇంజన్ జావా మరియు జావా 42 బైకుల్లో ఉన్న ఇంజన్ కంటే కాస్త పెద్దది. సాంకేతికంగా ఇందులో 334సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే ఈ ఇంజన్ 30బిహెచ్పి పవర్ మరియు 31ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

సేఫ్టీ ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే, లెథర్ తొడుగు గల స్టైలిష్ సీటు మరియు ఇతర జావా బైకుల్లో ఉండే అదే సింగల్ పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ హెడ్‌ల్యాప్ హౌసింగ్స్ మీద యధావిధిగా వచ్చింది. సేఫ్టీ విషయంలో రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఇరువైపులా డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చింది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
విభిన్న డిజైన్, రైడింగ్ పొజిషన్‌తో ఇండియన్ కస్టమర్ల కోసం చీపెస్ట్ బాబర్ స్టైల్ బైకును జావా మోటార్ సైకిల్స్ తీసుకొచ్చింది. బాబర్ స్టైల్ బైకులనగానే గుర్తొచ్చేది హ్యార్లీ డేవిడ్సన్ సాఫ్టెయిల్ రేంజ్ బైకులే.. డిజైన్ పరంగా జావా పెరాక్ ఈ మోడల్‌కు సవాల్ విసురుతోంది. ఇంజన్ రేంజ్లో అయితే, దేశీయ మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350 మరియు బెనెల్లీ ఇంపీరియాలె 400 మోడళ్లకు పోటీనిగా నిలవనుంది.