భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా...

భారత టూవీలర్ మార్కెట్లో ప్రస్తుతం స్కూటర్లకు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఒకప్పుడు, అతి తక్కువ సంఖ్యలో మాత్రమే స్కూటర్లు అందుబాటులో ఉండేవి, కానీ ఎప్పుడైతే హోండా నుండి వచ్చిన గేర్‌లెస్ యాక్టివా స్కూటర్ మార్కెట్లో పోటీని పెంచిందో అప్పటి నుండి దేశీయ మార్కెట్లో ఒక్కొక్కటిగా కొత్త స్కూటర్లు పుట్టుకురావడం ప్రారంభించాయి. ప్రస్తుతం, దేశీయ విపణిలో 110సీసీ స్కూటర్ నుండి శక్తివంతమైన 155సీసీ మాక్సీ స్కూటర్ వరకూ వివిధ రకాల మోడళ్లు వివిధ రకాల వయస్సుల వారి కోసం అందుబాటులో ఉన్నాయి.

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా...

రోడ్లపై స్కూటర్లు మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు నడపడానికి సులువుగా ఉంటాయి. సరసమైన ధర, లైట్ వెయిట్, స్పోర్టీ డిజైన్, రైడ్ కంఫర్ట్ మరియు సేఫ్టీ వంటి అనేక అంశాల కారణంగా ప్రస్తుతం దేశంలో స్కూటర్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే, స్కూటర్ల కొనుగోలుదారులు ప్రధానంగా ఆలోచించేంది వాటి మైలేజ్ గురించి. పెట్రోల్ ధరలు మండిపోతున్న నేటి రోజుల్లో అధిక మైలేజీనిచ్చే స్కూటర్లను కొనుగోలు చేయడం చాలా మంచిది. మరి ఈ కథనంలో మనదేశంలో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ మైలేజ్ స్కూటర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా...

టీవీఎస్ స్కూటీ జెస్ట్ (TVS Scooty Zest)

సాధారణంగానే, టీవీఎస్ ఉత్పత్తులు అత్యుత్తమ మైలేజీని అందిస్తాయని మన అందరికీ తెలిసినదే. ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ 110సిసి స్కూటర్ టీవీఎస్ జెస్ట్. ఇది చూడటానికి పరిమాణంలో చిన్నదిగా ఉండి, ప్రత్యేకించి మహిళా వినియోగదారులు, టీనేజర్లు మరియు పెద్ద వయస్సు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టబడింది. సిటీలో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, పల్లె ప్రాంతాల్లో దూర ప్రయాణాలు చేసే వారికి ఈ చిన్న స్కూటర్ ఎంతో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా...

ఈ స్కూటర్ లో 109.7 సిసి ఇంజన్ ఉపయోగించబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7.81 బిహెచ్‌పి శక్తిని మరియు 8.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుత మోడ్రన్ స్కూటర్లతో పోల్చుకుంటే, ఈ మోడల్ పనితీరు ఆకట్టుకోనప్పటికీ, పైన పేర్కొన్న విధంగా, ఇది ఇటు సిటీ రైడ్స్‌కి మరియు అటు ఎక్కువ దూరం ప్రయాణించే వారికి పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ స్కూటర్ సగటున లీటురు పెట్రోల్‌కి 57 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా...

టీవీఎస్ జూపిటర్ 125 (TVS Jupiter)

టీవీఎస్ బ్రాండ్ నుండి లభిస్తున్న మరొక అద్భుతమైన స్కూటర్ 'జూపిటర్ 125'. ఇదొక బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్ గా ఉంటుంది మరియు ఏ వయస్సు వారికైనా నడిపేందుకు వీలుగా ఉంటుంది. ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్, సెగ్మెంట్లో కెల్లా అత్యధిక లెగ్ స్పేస్ (375 మిమీ), విశాలమైన సీట్ మరియు సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ తో ఇది చాలా బెస్ట్ గా ఉంటుంది.

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా...

ఈ పవర్‌ఫుల్ స్కూటర్ లో పవర్‌ఫుల్ 124.8 సిసి ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 8.15 బిహెచ్‌పి పవర్‌ను మరియు 10.15 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో బెటర్ మైలేజ్ కోసం IntelliGO స్టార్ట్ / స్టాప్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపు సెగ్మెంట్ ఫస్ట్ గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్‌ సస్పెన్షన్ ఉంటాయి. ఇది సగటున లీటరుకు 53 కిమీ మైలేజీని ఆఫర్ చేస్తుంది.

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా...

సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125)

ట్రెడిషనల్ లుక్‌లో కనిపించే స్కూటర్ కావాలనుకునే వారికి అందుబాటులో ఉన్న మరొక ఆప్షన్ సుజుకి యాక్సెస్ 125. అంతేకాదు, ఇది ఈ విభాగంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటిగా ఉంది. ఈ స్కూటర్ ట్రెడిషన్ లుక్ ని కలిగి ఉన్నప్పటికీ, ఇది సాంకేతికంగా అధునాతనమైనది. ఈ ఫ్యామిలీ స్కూటర్ లో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, యూఎస్‌బి ఛార్జింగ్ సాకెట్ మరియు బ్యాటరీ కండిషన్‌ను సూచించడానికి వోల్టేజ్ మీటర్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా...

సుజుకి యాక్సెస్ స్కూటర్ లో 125 సిసి ఇంజన్ ఉంటుంది, ఇది గరిష్టంగా 8.7 బిహెచ్‌పి పవర్ ను మరియు 10 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ తో సుజుకి యాక్సెస్ పవర్ మరియు మైలేజ్ ల మధ్య మంచి సమతుల్యతను అందిస్తుంది. ఈ స్కూటర్ సగటు మైలేజీ 52 కి.మీగా ఉండి, డబ్బుకు తగిన విలువను అందిస్తుంది.

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా...

హోండా యాక్టివా 6జి (Honda Activa 6G)

స్కూటర్ల విభాగంలో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు హోండా యాక్టివా. దాదాపు 2000 కాలంలో మార్కెట్లోకి వచ్చి, స్కూటర్ విభాగంలో ఓ కొత్త అధ్యాయానికి తెరలేపిన మోడల్ ఇది. ప్రస్తుతం, ఈ మోడల్ లో ఆరవ తరం నడుస్తోంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. ఈ స్కూటర్ 7.79 బిహెచ్‌పి పవర్ మరియు 8.79 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేసే 109.51 సిసి ఇంజన్ ఉంటుంది. ఈ స్కూటర్ సగటును లీటరుకు 50 కి.మీల మైలేజీని అందిస్తుంది.

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా...

హీరో మాస్ట్రో ఎడ్జ్ (Hero Maestro Edge)

హీరో మోటోకార్ప్ తమ మాస్ట్రో ఎడ్జ్ సిరీస్‌లో 110సీసీ మరియు 125సీసీ అనే వెర్షన్లను అందిస్తోంది. ఇందులో మొదటిది 110.9సీసీ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 8.15 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని రెండవ హై-ఎండ్ వేరియంట్, 124.6 సిసి ఇంజ‌న్‌తో నుండి 9.1 బిహెచ్‌పి పవర్‌ను మరియు 10.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెద్ద ఇంజన్‌లో i3S స్టార్ట్-స్టాప్ సిస్టమ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. వాస్తవ రహదారి పరిస్థితుల్లో ఈ రెండు మోడళ్లు సగటున లీటరుకు 49 కిమీల మైలేజీని ఆఫర్ చేస్తాయి.

Most Read Articles

English summary
Top five 125 cc scooters in india with best fuel efficinacy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X