టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఫస్ట్ రైడ్ రివ్యూ: అద్భుతం చేసిన టీవీఎస్

By Anil Kumar

ఇండియన్ మార్కెట్లో స్కూటర్ల సామ్రాజ్యం శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి అత్యంత నాణ్యతతో, అత్యాధునిక ఫీచర్లతో అధునాతన స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. స్కూటర్ల పరిశ్రమను శాసించే లక్ష్యంతో టీవీఎస్ తాజాగా ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

పర్ఫామెన్స్ స్కూటర్ల బరిలోకి టీవీఎస్ సరికొత్త ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను రూ. 58,750ల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లు మరియు 125సీసీ ఇంజన్‌తో వచ్చిన ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను రైడ్ చేసి, రైడింగ్ అనుభవాలను పాఠకులతో పంచుకునే అవకాశాన్ని టీవీఎస్ డ్రైవ్‌స్పార్క్ బృందానికి కల్పించింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ కొనడం మంచిదేనా...? ఇందులో ఉన్న ప్లస్సులు మరియు మైనస్సుల గురించి క్లుప్తంగా నేటి టీవీఎస్ ఎన్‌టార్క్ 125 టెస్ట్ రైడ్ రివ్యూ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం రండి....

Recommended Video - Watch Now!
Aprilia SR 125; Walkaround, Details, Specifications, Features - DriveSpark
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 డిజైన్

టీవీఎస్ డిజైనింగ్ బృందం స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రేరణతో తమ ఎన్‌టార్క్ 125 ప్రీమియమ్ స్కూటర్‌ను డిజైన్ చేసింది. షార్ప్ లైన్స్, కండలు తిరిగిన శరీరాకృతి మరియు ఉలి చెక్కిన తరహా డిజైన్ అంశాలు ఫ్రంట్ లుక్ ఎన్‌టార్క్ 125 ఓవరాల్ డిజైన్ భిన్నంగా ఉండేలా చేశాయి. అత్యుత్తమ రైడింగ్ కల్పించే టీవీఎస్ రేసింగ్ అనుభవాలను రంగరించి రూపొందించారు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఫస్ట్ రైడ్ రివ్యూ

ప్రాథమిక డిజైన్ మరియు కొలతలన్నింటినీ గతంలో 2014 ఆటో ఎక్స్-పోలో టీవీఎస్ ప్రదర్శించిన గ్రాఫైట్ ఆధారంగా డెవలప్ చేశారు. విభిన్నమైన పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఎరుపు రంగుతో కుట్టబడిన సీటు, ఫాక్స్ కార్బన్ ఫైబర్ బాడీ ప్యానల్స్ వంటివి ఇందులో ఉన్నాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్‌లో అధునాతన సిగ్నేచర్ ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు ఫైటర్ జెట్ ఎగ్జాస్ట్ తరహా రియర్ డిజైన్‌ను ఇందులో అందివ్వడం జరిగింది. దీనికి తోడు లావుగా ఉన్న ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు ఈ స్కూటర్ ఇచ్చే ఇంజన్ సౌండ్ మిగతా స్కూటర్ల నుండి దీనిని సులభంగా గుర్తించడంలో సహాయపడతాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

డిజైన్ అంశాలతో యువ కస్టమర్లను ఆకట్టుకోవడానికి టీవీఎస్ ఎన్‌టార్క్ లభించే అన్ని కలర్ ఆప్షన్‌లను మ్యాట్ ఫినిషింగ్‌లో స్టాండర్డ్ ఫీచర్‌గా అందించింది. సాధారణ పెయింట్ జాబ్ కంటే మ్యాట్ ఫినిషింగ్‌లో ఉన్న స్కూటర్లు చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

టీవీఎస్ ఎన్‍‌టార్క్ 125 స్పెసిఫికేషన్స్

ధర రూ. 58,750 లు
ఇంజన్ రకము సింగల్-సిలిండర్
ఇంధన రకము పెట్రోల్
ఇంజన్ కెపాసిటి 125సీసీ
పవర్ 9.27బిహెచ్‌పి
టార్క్ 10.4ఎన్ఎమ్
ట్రాన్స్‌మిషన్ సివిటి
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఇంజన్ మరియు పనితీరు

ఎన్‌టార్క్ స్కూటర్‌లో టీవీఎస్ ప్రత్యేకంగా అభివృద్ది చేసిన నూతన 125సీసీ ఇంజన కలదు. గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 7,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 9.27బిహెచ్‌పి పవర్ మరియు 10.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సివిటి ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఎన్‌టార్క్ గరిష్ట వేగం గంటకు 95కిలోమీటర్లుగా ఉంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

కంపెనీ ప్రకారం దీని గరిష్ట వేగం 95కిమీల అయినప్పిటకీ, మేము టెస్ట్ చేసినప్పుడు 99కిమీల వేగాన్ని అందుకుంది. ఇప్పటి వరకు స్కూటర్లలో రానటువంటి ఆటో చోక్, ఇంటెలిజెంట్ ఇగ్నిషన్ సిస్టమ్, స్ల్పిట్ టైప్ ఇంటేక్ డిజైన్, ఫోమ్-ఆన్-పేపర్ ఎయిర్ ఫిల్టర్ మరియు విభిన్న ఆయిల్ కూలింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రైడ్ మరియు హ్యాండ్లింగ్

ఎలక్ట్రిక్ స్టార్టర్ బటన్ ప్రెస్ చేయగానే, క్విక్ రేసిప్రొకేటింగ్ స్టార్టర్ మోటార్ మరియు ఎగ్జాస్ట్ ఇచ్చే శబ్దాన్ని స్కూటర్ స్టార్ట్ అయ్యే సమయంలో ప్రదానంగా గుర్తించవచ్చు. స్టార్టింగ్ సమయంలో వచ్చే శబ్దాన్ని ఇంకా తగ్గించే అవకాశాలు ఉన్నాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

యాక్సిలరేషన్ చాలా చురుకుగా ఉంది. అద్భుతమైన ఇన్-బిల్ట్ యాక్సిలరేషన్ టైమర్ ద్వారా టీవీఎస్ ఎన్‌టార్క్ కేవలం 7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 60కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

టీవీఎస్ ఎన్‌టార్క్‌లో ముందు వైపున సెగ్మెంట్ ఫస్ట్ పెటల్ డిస్క్ బ్రేక్ స్టాండర్డ్‌గా వచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్ స్కూటర్ల సెగ్మెంట్లో ఈ పెటల్ డిస్క్ బ్రేక్ సెటప్ రాలేదు. దీంతో ఎన్‌టార్క్ మరింత సురక్షితమైంది. చురుకైన యాక్సిలరేషన్‌కు అంతే యాక్టివ్‌గా బ్రేక్ పడేందుకు పెటల్ డిస్క్ సహాయపడుతుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

టీవీఎస్ ప్రత్యేకించి ఎన్‌టార్క్ కోసం అభివృద్ది చేసిన బ్రాండ్ న్యూ ఫ్రేమ్ మీద నిర్మించడంతో ఎన్‌టార్క్ 125లో మెరుగైన సస్పెన్షన్ సాధ్యమైంది. మలుపుల్లో మరియు సీటీలో సులభంగా రైడ్ చేసేందుకు డైనమిక్ రైడింగ్ లక్షణాలు ఇందులో ఉన్నాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

రోజూ వారి అవసరాలకు బాగా సెట్ అయ్యే స్పోర్టివ్ స్కూటర్ టీవీఎస్ ఎన్‌‌టార్క్ 125 అంతే కాకుండా లాంగ్ రైడ్‌లో చక్కటి పనితీరు కనబరిచింది. అత్యంత కఠినమైన రేస్ ట్రాక్‌ నుండి గతుకుల రోడ్లను కూడా ఎదుర్కొంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

క్షణాలో దూసుకెళ్లే తత్వం మరియు మంచి రైడింగ్ అనుభవం కల్పించడంలో టీవీఎస్ ఎన్‌టార్క్ 125లోని టైర్లు కీలక పాత్ర పోషించాయి. ముందు వైపున 100/80-12 మరియు వెనుక వైపున 110/80-12 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి. టీవీఎస్ టైర్స్ నుండి రూపాంతరం చెందిన రిమోరా బ్రాండ్ నుండి ఈ టైర్లను సేకరించారు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

టీవీఎస్ ఎన్‌టార్క్ బ్లూటూత్ కనెక్టివి: భారతదేశపు తొలి కనెక్టెడ్ స్కూటర్...

బ్లూటూత్ కనెక్టివిటి గల భారతదేశపు తొలి స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్. ఇందులో స్మార్ట్ కనెక్టివిటి టెక్నాలజీ కలదు, ఇప్పటికీ మరే ఇతర ఇండియన్ స్కూటర్‌లో ఈ టెక్నాలజీ రాలేదంటే నమ్మండిన. టీవీఎస్ డెవలప్ చేసిన అప్లికేషన్ ద్వారా బ్లూటూత్ సహాయంతో స్కూటర్‌ను స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

దీంతో స్కూటర్‌లోని ఎల్‌సిడి ఇంస్ట్రుమెంటేషన్ డిస్ల్పే బ్లూటూత్ ద్వారా యూజర్ స్మార్ట్‌ ఫోన్‌తో కనెక్ట్ అవుతుంది. ఇది రైడర్ మొబైల్ ఫోన్‌కు వచ్చే కాల్స్ మరియు మెసేజ్‌లను చూపిస్తుంది. మరియు వాటికి ఆటోమేటిక్‌గా యూజర్ స్కూటర్ రైడ్ చేస్తున్నాడనే సమాచారాన్ని చేరవేస్తుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

టీవీఎస్ ఎన్‌టార్క్ ఎల్‌సిడి స్క్రీన్

టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్‌లోని ఎల్‌సిడి స్క్రీన్ ఇస్ట్రుమెంట్ క్లస్టర్ ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అంశం. టాప్ స్పీడ్ రికార్డర్, ల్యాప్ టైమర్, ఫోన్ బ్యాటరీ స్ట్రెంథ్ ఇండికేటర్, చివరి సారి పార్క్ చేసిన ప్రదేశం, సగటు వేగం, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ ఇలా 55 రకాల ఫీచర్లు ఈ ఎల్‌సిడి స్క్రీన్‌లో ఉన్నాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

వివిధ రకాల రైడింగ్ మోడ్స్‌లో స్కూటర్ రైడ్ చేసిన అనంతరం, రైడింగ్ వివరాలను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిన స్మార్ట్ ఫోన్‌కు చేరవేస్తుంది. ఇందులోని ఎల్‌సిడి డిస్ల్పే న్యావిగేషన్ అసిస్ట్ కూడా కలిగి ఉంది. మ్యాప్‌మైఇండియా ద్వారా ఎల్‌సిడి డిస్ల్పే టర్న్-బై-టర్న్ న్యావిగేషన్ అందిస్తుంది. స్కూటర్ ఎంచుకోవాలనుకునే ప్రతి కస్టమర్‌ను ఈ ఫీచర్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

టీవీఎస్ ఎన్‌టార్క్ ఫీచర్లు

టీవీఎస్ ఎన్‌టార్క్‌ 125 స్కూటర్‌లో ఎక్ట్సర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఇంజన్ కిల్ స్విచ్, హెడ్‌ల్యాంప్ పాస్-బై స్విచ్, పార్కింగ్ బ్రేకులు, డ్యూయల్ సైడ్ హ్యాండిల్ లాక్, యుఎస్‌బి మొబైల్ ఫోన్ ఛార్జర్ మరియు 22 లీటర్ల విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ స్కూటర్‌కు ప్రీమియమ్ ఫీల్ తీసుకొచ్చాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

టీవీఎస్ ఎన్‌టార్క్ కలర్స్

టీవీఎస్ ఎన్‌టార్క్ ఎంచుకోదగిన యెల్లో, గ్రీన్, రెడ్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్‌లో మ్యాట్ ఫినిషింగ్‌లో లభిస్తోంది. మ్యాట్ ఫినిషింగ్, ప్రకాశవంతమైన కలర్ ఆప్షన్స్ మరియు ఫ్యూచరిస్టిక్ డిజైన్ లక్షణాలతో టీవీఎస్ ఖచ్చితంగా యువకొనుగోలు దారులను ఉద్దేశించి ఎన్‌టార్క్‌ను ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

మరి మీరు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను ఎంచుకుంటారా...?

అట్రాక్టివ్ మరియు ఫ్యూచరిస్టిక్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజన్, స్మార్ట్ కనెక్ట్ బ్లూటూత్ ఫీచర్, మొబైల్ యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, పెటల్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లతో కేవలం రూ. 58,750 లకే లభిస్తోంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రివ్యూ

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, నాణ్యత మరియు పనితీరు విషయంలో రాజీపడకుండా టీవీఎస్ రూపొందించిన ఎన్‌టార్క్ స్కూటర్ 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో ఒక సునామీలా దూసుకొచ్చింది. ఏ ఒక్క అంశంలో కూడా నిరాకరించడానికి వీల్లేకుండా జర్మన్ టూ వీలర్ల తయారీ దిగ్గజాలకు ఊహించని షాక్ ఇచ్చింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ విపణిలో ఉన్న హోండా గ్రాజియా, అప్రిలియా ఎస్ఆర్ 125 మరియు ఆటో ఎక్స్‌పోలో హీరో ఆవిష్కరించిన హీరో డ్యూయెట్ 125 మరియు మాయెస్ట్రో 125 స్కూటర్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: TVS NTorq 125 Review: A Feature-Packed Sporty Scooter For The Masses
Story first published: Wednesday, February 28, 2018, 19:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X