ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

భారతదేశంలో ప్రారంభించిన అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రసిద్ధి చెందిన కంపెనీ ఎంజి మోటార్స్. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాల వాహనాలు దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఎంజి మోటార్స్ యొక్క మరో ఎస్‌యూవీ ఈ ఎంజి హెక్టర్ ఎస్‌యూవీ.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఎంజి హెక్టర్ ఎస్‌యూవీ గత ఏడాది 2019 మధ్యలో మన దేశంలో లాంచ్ చేయబడింది. ఈ ఎస్‌యూవీని నాలుగు వేరియంట్లు మరియు మూడు ఇంజిన్ కాన్ఫిగరేషన్లలో అందించారు. ఇది అనతి కాలంలోనే చాలామంది వినియోగదారుల అభిమాన వాహనంగా మారిపోయింది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

హెక్టర్ ఎస్‌యూవీ చూడటానికి కొంత భారీగా అనిపించినా చాలా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది దేశంలో మొట్టమొదటి AI ఎనేబుల్ ఎస్‌యూవీగా నిలిచింది.

ఇటీవల పూణేలో ఎంజి హెక్టర్ ప్లస్ డీజిల్ వేరియంట్‌ను నడపడానికి మాకు అవకాశం లభించింది. ఇక్కడ మా ఫస్ట్ డ్రైవ్ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాము. ఎంజి హెక్టర్ ప్లస్ డీజిల్ వేరియంట్ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

డిజైన్ & స్టైలింగ్ :

ఎంజి హెక్టర్ ప్లస్ యొక్క మొత్తం రూపకల్పన చాలా స్టైలింగ్ గా ఉంటుంది. ఇది ఐదు సీట్ల వేరియంట్ నుండి ప్రేరణ పొందింది. ఇది చూటటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

సాధారణంగా స్టాండర్డ్ హెక్టర్ 5-సీటర్ ఎస్‌యూవీ యొక్క కొలతలను గమనించినట్లయితే వెడల్పు 1,835 మిమీ, ఎత్తు 1,760 మిమీ, మరియు 2,720 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. కానీ ఈ కొత్త ఎంజి హెక్టర్ ప్లస్ కొలతలు, 5 సీట్ల ఎస్‌యూవీ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో హెక్టర్ ఎస్‌యూవీలో కనిపించే క్రోమ్ సరౌండ్‌లో కొత్త క్రోమ్ స్టడెడ్ గ్రిల్ సాన్స్ ఉన్నాయి. బంపర్‌లు పునఃరూపకల్పన చేయబడ్డాయి. ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్‌లు, డైనమిక్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ మరియు ఫాగ్ లాంప్స్ కూడా ఉంటాయి.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో అద్భుతమైన సైడ్ ప్రొఫైల్, డోర్ హ్యాండిల్స్ వద్ద క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వీటిలో ముందు డోర్ హ్యాండిల్స్ వద్ద పుష్ బటన్ లాక్ మరియు అన్‌లాక్ బటన్ ఉన్నాయి. ఎంజి పేరును కలిగి ఉన్న ఫుట్‌బోర్డ్‌లో క్రోమ్ హైలైట్ కూడా ఉంది. ఈ ఎస్‌యూవీ వెనుక భాగంలో పునఃరూపకల్పన చేసిన బంపర్, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, బూట్ క్యాప్ మరియు ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్ కూడా ఇందులో ఉన్నాయి.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఇంటీరియర్స్ :

ఎంజి హెక్టర్ ప్లస్ ఇంటీరియర్స్ ఖరీదైనవి మాత్రమే కాదు సౌకర్యవంతమైనవి కూడా, హెక్టర్ ప్లస్ డాష్‌బోర్డ్ క్వాలిటీ మెటీరియల్ తో పూర్తయింది. ఈ ఎస్‌యూవీలో లెదర్ తో చుట్టిన స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది వాల్యూమ్ కంట్రోల్, కాలింగ్ ఫంక్షన్లు, టాక్ బటన్ పుష్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

డాష్‌బోర్డ్ ఇరువైపులా రెండు అడ్డంగా అమర్చిన ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ మరియు 10.4 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు ఇరువైపులా నిలువుగా పేర్చబడిన వెంట్స్ కలిగి ఉంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ MG యొక్క ఐ-స్మార్ట్ కనెక్టెడ్ టెక్నాలజీని కలిగి, ‘చిట్-చాట్' ఫీచర్స్ ని అందిస్తుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఎంజి యొక్క ఐ-స్మార్ట్ కనెక్టెడ్ టెక్నాలజీలో 55 కి పైగా కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్స్ మరియు మెషిన్-టు-మెషిన్ ఎంబెడెడ్ 5G సిమ్ కార్డును కలిగి ఉంది.

జియోఫెన్సింగ్, ఫైండ్ మై కార్, వాయిస్ అసిస్టెంట్, స్టార్ట్ / స్టాప్ కోసం రిమోట్ ఫంక్షన్లు, ఎయిర్ కండిషనింగ్, & లాక్ అండ్ అన్‌లాక్, ఎమర్జెన్సీ కాల్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

స్మోక్డ్ సెపియా బ్రౌన్ లెదర్‌లో పూర్తయిన పవర్ అడ్జస్టబుల్ ఫ్రెంట్ సీట్లతో ఈ ఎస్‌యూవీ వస్తుంది. రెండవ వరుసలో చాలా సౌకర్యవంతమైన కెప్టెన్ సీట్లను కలిగి ఉంది. కెప్టెన్ సీట్ల మధ్య ఖాళీ భాగం దాదాపు కారిడార్ లాగా ఉంటుంది. పిల్లలు మూడవ వరుస సీట్లను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. మూడవ వరుస సీట్లను పిల్లల ప్రయాణీకుల కోసం రూపొందించారు.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

రెండవ మరియు మూడవ వరుసల మధ్య పరిమిత లెగ్ రూమ్ ఉంది, ఇది పెద్దలకు కొంత అసౌకర్యంగా ఉంటుంది. సీట్లు 50:50 స్ప్లిట్‌ను కలిగి ఉంటాయి మరియు స్వతంత్రంగా మడవగలవు. అవసరాన్ని బట్టి మల్టిపుల్ కాన్ఫిగరేషన్‌లను అందిస్తాయి. మూడవ వరుస సీట్లలో ఎయిర్ కండిషనింగ్ కంట్రోల్ కూడా ఉన్నాయి.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ యొక్క హైలైట్ ఏమిటంటే దాని డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్. పైకప్పును ఒక బటన్ తాకినప్పుడు ఓపెన్ చేయవచ్చు. కానీ ఇది రెండు దశల్లో తెరుచుకుంటుంది, మొదట సన్‌రూఫ్‌ సగం తెరవడానికి వీలు కల్పిస్తుంది, మరియు మిగిలిన సగం బటన్‌ను మళ్లీ నెట్టివేసినప్పుడు ఓపెన్ అవుతుంది. ఈ సన్‌రూఫ్ ఓపెన్‌తో డ్రైవింగ్ చేయడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా వర్షాకాలంలో చాలా గొప్ప అనుభూతిని కల్పిస్తుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ప్రాక్టికాలిటీ, కంఫర్ట్ & బూట్ స్పేస్ :

ఈ ఎస్‌యూవీలో చాలా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడిన అద్భుతమైన బూట్ స్పేస్‌ ఉంటుంది. ఇది మునుపటి మోడల్ కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఇందులో ఉన్న డ్రైవర్ మరియు ముందు వరుస ప్రయాణీకుల సీట్లు చాలా అనుకూలంగా ఉంటాయి. రెండవ వరుస సీట్లు కూడా అద్భుతమైన సౌకర్యాన్ని ఇస్తాయి. ఈ సీట్ల మధ్య చిన్న కారిడార్ ప్రయాణికులకు ఎక్కువ పర్సనల్ స్పెస్ అందిస్తుంది. మూడవ వరుస సీట్లు పరిమిత లెగ్‌రూమ్‌ను అందిస్తాయి మరియు పిల్లల ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో ఒక చిన్న బూట్ ఉంది, ఇది మునుపటి మోడల్ యొక్క 587-లీటర్లతో పోలిస్తే 155-లీటర్ల ఎక్కువ పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఏదేమైనా మూడవ వరుసను ముడుచుకోవడంతో లోపలి స్థలం కొంత పెరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఇంజిన్ పనితీరు & డ్రైవింగ్ ఇంప్రెషన్స్ :

ఎంజి హెక్టర్ ప్లస్ రెండు ఇంజన్ ఎంపికతో లభిస్తుంది. ఒకటి 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇది పెట్రోల్-హైబ్రిడ్ వేరియంట్లో కూడా లభిస్తుంది. ఈ రెండు పెట్రోల్ వేరియంట్లు 141 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిసిటి కలిగి ఉంటుంది. హైబ్రిడ్ వేరియంట్లో 6-స్పీడ్ మాన్యువల్ మాత్రమే ఉంటుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఇక రెండవ ఎంపిక 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, ఇది 168 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

మాకు ప్రస్తుతం డీజిల్ వేరియంట్‌ను మాత్రమే డ్రైవ్ చేసే అవకాశం లభించింది. ఇది దాని శక్తి మరియు పనితీరు గణాంకాలతో వినోయోగదారులను చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

ఈ ఎస్‌యూవీలో ఇంజిన్ మరియు క్లచ్ చాలా ప్రతిస్పందిస్తాయి. గేర్‌బాక్స్ దాదాపుగా సున్నితంగా ఉంటుంది, మరియు గేర్ లివర్‌ను ఉపయోగించడం సహజంగా అనిపిస్తుంది. టార్క్ ప్రారంభంలోనే ప్రారంభమవుతుంది. ఇందులో బ్రేకింగ్ సిస్టం చాల అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో నాలుగు డిస్క్ బ్రేక్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని నగరాలలో ప్రయాణించడానికి మాత్రమే కాకుండా రహదారుల కోసం ప్రత్యేకంగా నిర్మించారు, అయితే వాహనం ట్రాఫిక్ లో ప్రయాణించడానికి కూడా చాల సులభంగా ఉంటుంది. ఇందులో డ్రైవింగ్ చేసేటప్పుడు లోపలి భాగంలో ఇంజిన్ శబ్దం కూడా వినబడదు.

Engine Specs Petrol Petrol Hybrid Diesel
Engine CC 1541 1541 1956
No.Of Cylinders 4 4 4
Power (bhp) 141 141 168
Torque (Nm) 250 250 350
Transmission 6-MT/7-DCT 6-MT 6-MT
ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఫీచర్స్ & సేఫ్టీ ఎక్విప్మెంట్స్ :

ఎంజి హెక్టర్ ప్లస్ చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. వీటిలో కొంత వరకు అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్ గా ఉంటాయి.

 • రిమోట్ కీలెస్ ఎంట్రీ
 • రెండవ వరుస కెప్టెన్ సీట్లు రిక్లైన్ & స్లైడ్ ఫంక్షన్స్
 • మూడవ వరుస 50:50 స్ప్లిట్ సీట్లు
 • రెండవ మరియు మూడవ వరుస AC వెంట్స్
 • స్టోరేజ్ & 12 వి పవర్ అవుట్‌లెట్‌తో డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్
 • పవర్ అడ్జస్టబుల్ ORVM లు
 • ఫ్రంట్ & రియర్ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్
 • కూల్డ్ గ్లోవ్ బాక్స్
ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఈ ఎంజి హెక్టర్ ప్లస్ యొక్క భద్రత లక్షణాలను గమనించినట్లయితే ఇందులో

 • ఆరు ఎయిర్‌బ్యాగులు
 • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్
 • ఇబిడి తో ఏబిఎస్
 • రియర్ పార్కింగ్ సెన్సార్లు
 • 360-డిగ్రీ కెమెరా (షార్ప్ వేరియంట్లో లభిస్తుంది)
 • ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు
 • హై స్పీడ్ వార్ణింగ్ సిస్టం
 • స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్
 • కార్నరింగ్ ఫాగ్ లాంప్స్
 • ట్రాక్షన్ కంట్రోల్

ఇందులో ఉన్న 360 డిగ్రీల కెమెరా పార్కింగ్ ప్రదేశాలలో ముఖ్యంగా ఉపయోగపడుతుంది మరియు పాదచారులతో గుద్దుకోకుండా ఉండటానికి సహాయపడుతుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

వేరియంట్స్, కలర్స్ మరియు ధర :

ఎంజి హెక్టర్ ప్లస్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే వేరియంట్లు. హెక్టర్ ప్లస్ యొక్క ధరలను గమనించినట్లయితే బేస్ పెట్రోల్ వేరియంట్ రూ. 13.49 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి. అయితే టాప్-ఎండ్ ‘షార్ప్' డీజిల్ ట్రిమ్ ధర రూ. 18.54 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంటుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఎంజి హెక్టర్ ప్లస్ ఆరు కలర్ ఎంపికలో లభిస్తుంది. అవి స్టార్రి స్కై బ్లూ, గ్లేజ్ రెడ్, బుర్గుండి రెడ్, స్టార్రి బ్లాక్, కాండీ వైట్ మరియు అరోరా సిల్వర్ కలర్స్.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ప్రత్యర్థులు :

ఎంజి హెక్టర్ ప్లస్ టయోటా యొక్క ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివికి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా త్వరలో ప్రారంభించబోయే టాటా గ్రావిటాస్ వంటి ఆరు మరియు ఏడు సీట్ల ఎస్‌యూవీలకు కూడా ప్రత్యర్థిగా ఉంటుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఎంజి హెక్టర్ ప్లస్ నగరంలో ప్రయాణించడానికి చాలా అద్భుతమైన వాహనం మరియు ప్రత్యేకించి పొడవైన రోడ్‌ట్రిప్స్‌కు ఉద్దేశించబడింది. మోరిస్ గ్యారేజీలు చాలా పోటీ ధర వద్ద అద్భుతమైన ఇటువంటి ఎస్‌యూవీని విడుదల చేశాయి.

Competitors/Specs MG Hector Plus Toyota Innova Crysta Tata Gravitas
Engine 1.5 Petrol/2.0 Diesel 2.7 Petrol/2.4 Diesel 2.7 Diesel
Power (bhp) 141/168 164/148 170
Torque (Nm) 250/350 245/343 350
Transmission 6-MT/DCT 5-MT/6-MT/AT 6-MT/6-AT
Price (ex-showroom) Rs 13.49-18.54 Lakh Rs 15.67 - Rs 24.68 Lakh *TBA
ఎంజి హెక్టర్ ప్లస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

ఎంజీ హెక్టర్ ప్లస్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఇది ఎక్కువమంది ప్రయాణికులు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది మరియు చాలా సౌకర్యవంతమైన క్యాబిన్ కలిగి ఉంది. కుటుంబంతో కలిసి ప్రయాణించాలనుకునే వినియోగదారులకు ఎంజీ హెక్టర్ ప్లస్ చాలా మంచి ఎంపిక అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Most Read Articles

English summary
MG Hector Plus First Drive Review. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X