విమాన ప్రమాదంలో టోటల్ సీఈఓ, ఎఫ్1 స్పాన్సర్ మృతి

Posted By:

ఫ్రెంచ్ ఆయిల్ కంపెనీ 'టోటల్' (Total) ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టోఫ్ డి మార్గెరీ (ఆగస్ట్ 6, 1951 - అక్టోబర్ 20, 2014) ఈనెల 20వ తేదీన మాస్కోలోని వుంకోవ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఫ్రెంచ్ కంపెనీ తయారు చేసిన ఫాల్కన్ 50 అనే మిడ్-సైజ్ కార్పోరేట్ జెట్ విమానం మంచు ముద్దను ఢీకొట్టడం వలన విమానంలో మంటలు చెలరేగి క్షణాల్లో బూడిదైపోయింది. ఆ సమయంలో విమానంలో క్రిస్టోఫ్‌తో పాటుగా ముగ్గురు సిబ్బంది కూడా ఉన్నారు. ఈ విమానం ప్యారిస్ వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.

టోటల్‌కి ఎఫ్కి లింక్ ఏంటి?

గత 2007వ సంవత్సరం నుంచి యూరప్‌లో కెల్లా మూడవ అతిపెద్ద చమురు కంపెనీ టోటల్ గ్రూప్, రెనో పవర్డ్ రెడ్ బుల్, లోటస్ జట్లను స్పాన్సర్ చేస్తోంది.

మీకు తెలుసా?

సింథటిక్ రేసింగ్ ఆయిల్స్‌కి అత్యంత పాపులర్ అయిన ఎల్ఫ్ లూబ్రికెంట్స్, టోటల్ గ్రూప్ యొక్క ప్రధాన బ్రాండ్. టోటల్ సింథటిక్ రేసింగ్ ఆయిల్‌లో అగ్రగామి అయిన మొదటి కంపెనీ ఎల్ఫ్ అనే విషయం మీకు తెలుసా?

రేసింగ్ ప్రపంచంలో టోటల్, ఎల్ఫ్ రెండు కూడా స్పాన్సర్లుగా ఎంతో ప్రాచుర్యాన్ని కలిగి ఉన్నాయి. మోటార్‌స్పోర్ట్స్ కోసం అనేక ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో ఇవి రెండు కీలకమై ఉన్నాయి.

'ఒరిజినల్ పర్సనాలిటీ'

ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఆఫీస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఫ్రాంకోయిస్ హోలాండ్ మాట్లాడుతూ.. క్రిస్టోఫ్ డి మార్గెరీ తన జీవితాన్ని ఫ్రెంచ్ పరిశ్రమకు మరియు టోటల్ గ్రూప్‌ని నిర్మించడానికే అంకితం చేశారని, టోటల్‌ను అతను ప్రపంచంలోని అగ్రగామి కంపెనీలలో ఒకటిగా ఎదిగేలా చేయటంలో ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. క్రిస్టోఫ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్, ఒరిజినల్ పర్సనాలిటీ మరియు దేశానికి అతను చేసిన కృషిని ఆయన కొనియాడారు.

మరి ఈ ఒరిజినల్ పర్సనాలిటీని కోల్పోవటం వలన మోటార్‌స్పోర్ట్ ప్రపంచంలో ఏదైనా తేడా ఉంటుందా?

క్రిస్టోఫ్ డి మార్గెరీ అత్యంత ప్రముఖమైన వ్యక్తి, మంచి స్వభావం కలిగిన వారు. అతని లేని లోటును ఎవరూ తీర్చలేరు, పరిశ్రమకు మరియు దాని భవిష్యత్తుకు ఆయన లేకపోవటం తీరని లోటనే చెప్పాలి.

ఈ విచారకర సమయంలో మేము.. క్రిస్టోఫ్ డి మార్గెరీ కుటుంబానికి, అతని మిత్రులకు మరియు సమాజానికి మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాము.

క్రిస్టోఫ్ డి మార్గెరీ ఫ్యాక్ట్స్:

* 1974లో టోటల్ గ్రూపులో చేరారు.

* ఇతని మారుపేరు "బిగ్ మస్టాచ్" (పెద్ద మీసం)

* సద్దాం వ్యాపార భాగస్వాములలో ఒకరిగా నింద మోపబడ్డారు

English summary
The chief executive of the French oil company Total, Christophe de Margerie (6 August 1951 – 20 October 2014), died in a plane crash at the Vnukovo airport in Moscow.

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark