ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు

దూర ప్రాంత ప్రయాణాలకు ఉన్న ఏకైక బడ్జెట్ రవాణా సాధనం రైలు, అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన అధునాతన బస్సులు ఈ ధోరణిని మార్చేస్తున్నాయి.

రవాణా రంగంలో దూర ప్రాంత రవాణా సేవలకు రైళ్లకు ప్రత్యామ్నాయంగా వోల్వో బస్సులు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. ప్రభుత్వ మరియు ప్రయివేట్ రంగ రవాణా సంస్థలు దూర ప్రాంతాలకు విరివిగా సేవలందిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు వోల్వో బస్సులను విపరీతంగా వినియోగిస్తున్నాయి.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

ఉత్తర భారత దేశాన్ని కలుపుతూ దక్షిత భారతం నుండి ప్రముఖ ప్రభుత్వ రంగ రవాణా సంస్థ కెఎస్‌ఆర్‌టిసి దూర ప్రాంత సర్వీసును నడుపుతోంది. బెంగళూరు నుండి జోధ్‌పూర్ వరకు ఈ సంస్థ బస్సు సర్వీసును ప్రారంభించింది. భారత దేశపు అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు కూడా ఇదే.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

కర్ణాటకలోని బెంగళూరు నుండి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వరకు సుమారుగా 1,950 కిలోమీటర్ల మేర ఇది ప్రయాణిస్తుంది. ఇది బెంగళూరు నుండి అహ్మదాబాద్, ఉదయ్ పూర్ మరియు జైపూర్ మీదుగా జోధ్ పూర్ చేరుకుంటుంది.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ, ప్రస్తుతం ఉన్న ప్రయివేట్ రవాణా సంస్థలకు పోటీగా వోల్వో సర్వీసులను నడుపుతోంది. అంతే కాకుండా కెఎస్ఆర్‌టిసి చాలా రూట్లలో చాలా వరకు వోల్వో సర్వీసులను నడుపుతోంది.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

ప్రస్తుతం దూర ప్రాంత ప్రయాణాలకు వోల్వో ఇండియన్ మార్కెట్లోకి బి9ఆర్, బి7ఆర్ మరియు మల్టీ ఆక్సిల్ బస్సులను అందుబాటులో ఉంచింది. ప్రపంచ స్థాయి నాణ్యత మరియు సదుపాయాలతో వోల్వో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. వోల్వో అందించే సుమారుగా అన్ని బస్సు ఉత్పత్తులను కెఎస్ఆర్‌టిసి కలిగి ఉంది.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

సాధారణ బస్సుల్లో ఆధునిక సాంకేతికత లేమితో ప్రయాణికులు ఎక్కువ సమయం పాటు ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులను ఎందుర్కొంటున్నారు. ఇందుకోసం అధునాతనమైన సీటింగ్ మరియు సౌకర్యాలతో దూర ప్రాంత ప్రయాణాలను ఎంతో సుఖవంతం మరియు సౌకర్యవంతంగా మార్చింది వోల్వో.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

బెంగళూరు నుండి జోధ్ పూర్ వరకు సర్వీసును నడపడానికి కారణం అంటూ ఏమీ లేవు. ఎక్కువ ఈ రూటులో వోల్వో బి9ఆర్ మరియు బి11ఆర్ అదే విధంగా మల్టీ ఆక్సిల్ బస్సులను నడుపుతున్నారు.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

వోల్వో బి11ఆర్ బస్సులో సింగల్ వీల్ ఆక్సిల్ మాత్రమే కలదు. వెనక్కి నడిచేటపుడు ముందు వైపున చక్రాలు వ్యతిరేక దిశలో తిరుగుతాయి. వీటిని ఎక్కువగా సన్నని, ఇరుకైన మరియు అత్యధికంగా రద్దీ ఉండే ప్రదేశాలకు నడుపుతారు.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

వోల్వో బి9ఆర్ మరియు బి11ఆర్ బస్సుల పొడవు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బస్సుల్లో గరిష్టంగా 53 మంది వరకు ప్రయాణించవచ్చు.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

బి11ఆర్ లోని వోల్వో 9400పిఎక్స్ వేరియంట్ బస్సు భారత దేశపు అత్యంత పొడవైన బస్సు. దీని పొడవు గరిష్టంగా 14.5 మీటర్లుగా ఉంది.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

ఈ బస్సును చాలా వరకు ప్రభుత్వ మరియు ప్రయివేట్ రవాణా రంగ సంస్థలు దూర ప్రాంత సర్వీసుల కోసం వినియోగిస్తున్నాయి. ఇందులో షిప్ట్ గేర్‌బాక్స్, స్టీరింగ్ చేసినపుడు వ్యతిరేక దిశలో తిరిగే ఫ్రంట్ వీల్స్, మల్టీ ఆక్సిల్ వంటి ప్రత్యేకతలున్నాయి.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

వోల్వో లోని 9400పిఎక్స్ మోడల్ బస్సు యొక్క టర్నింగ్ రేడియస్ 180 డిగ్రీలుగా ఉంది.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

వోల్వో లోని బి9ఆర్ బస్సుల నిర్వహణ వ్యయం చాలా తక్కువ అందుకోసం ఈ బస్సులను అధికంగా దూర ప్రాంత ప్రయాణాల కోసం వినియోగిస్తారు.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

వోల్వో బి9ఆర్ బస్సులో 340హార్స్‌పవర్ ఉత్పత్తి చేయగల 9.4-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. ఇదు యూరో-3 ఉద్గార నియమాలను పాటిస్తుంది. ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఐ షిఫ్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆప్షనల్‌గా అందించారు.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

ఐ-షిప్ట్ గేర్ బాక్స్ వలన ఎక్కువ మైలేజ్, తక్కువ కుదుపులు మరియు ఇంజన్ యొక్క పనితీరు ఉత్తమంగా ఉంచటుంది. ఈ ఐ-షిఫ్ట్ గేర్‌బాక్స్‌ని వినియోగించడం వలన సాంకేతికంగా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

వోల్వో లోని సుమారుగా అన్ని ఇంజన్‌లు కూడా త్వరితగతిన అత్యంధిక పవర్‌ను విడుదల చేస్తాయి, అద్భుతమైన పర్ఫామెన్స్‌ వలన అతి తక్కువ కాల వ్యవధిలోనే గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. ఈ బస్సుల్లో సుమారుగా 300 నుండి 400 లీటర్ల వరకు ఇంధన సామర్థ్యం గల ట్యాంకులు కలవు.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఇందులో అధునాతనమైన సస్పెన్షన్ సిస్టమ్ అందించారు. ఎలాంటి వేగం వద్ద అయినా ధృడంగా మరియు స్థిరంగా ఉంటుంది. ఇందులో చాలా వరకు ఎంత పెద్ద కుదుపులైనా ప్రయాణికుల వరకు రావు.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

వోల్వో సంస్థ తమ బస్సుల్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ గల బ్రేకింగ్ సిస్టమ్ అందించింది. మృదువైన జారుడు రోడ్లు మరియు వాలు తలం మీద పటిష్టాన్ని కలిగి ఉండేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. అత్యవసర సందర్భాల్లో వెంటనే బ్రేక్స్ ఉపయోగించడం వలన టైర్లు డ్యామేజ్ అవకుండా ట్యూబ్ లెస్ టైర్లను అందించారు.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

చాలా మంది బస్సు ప్రయాణాల్లో పొద్దుపోలేదని అసహనం వ్యక్తం చేస్తారు. అయితే వోల్వో వారి లగ్జరీ బస్సుల్లో ఉన్నసదుపాయాలతో ప్రయాణం ఎంతో సుఖమయంగా ఉంటుది. అత్యంత దూరం ప్రయాణించే బస్సు సుమారుగా తన 36 గంటల ప్రయాణాన్ని ఏ ఇబ్బంది లేకుండా ఎంతో సౌకర్యవంతంగా పూర్తి చేస్తుంది.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

ఈ రూట్‌లో సుమారుగా 1,500 నుండి 2,200 వరకు ప్రయాణ ధర ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఒక్కో సారి విమాన ఛార్జీలకు సమాన ధరను చెల్లించి మరి ప్రయాణిస్తుంటారు.

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సులు

దూర ప్రాంత ప్రయాణాల సర్వీసులను నడపడానికి ప్రభుత్వ మరియు ప్రయివేట్ రంగ రవాణా సంస్థలు వోల్వోతో పాటు మెర్సిడెస్ బెంజ్, స్కానియా మల్టీ ఆక్సిల్ వంటి బస్సులను కూడా వినియోగిస్తున్నాయి.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

పంజాబ్‌లో ఓ రైతు ట్రాక్టర్లతో కాకుండా... 60 లక్షల ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీతో నారు మడులు దున్నుతున్నాడు. 60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు గురించి తెలుసుకుందాం రండి...

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

60 లక్షల ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీతో ఇలా నారు మడులను దున్నడం ఎప్పుడైనా చూశారా...? ఇవాళ్టి కథనంలో వీడియోతో పాటు ఆ రైతు వివరాలు కూడా చూద్దాం రండి. మిత్సుబిషి మోంటెరో లగ్జరీ ఎస్‌యూవీ వ్యక్తిగత వాహనంగా ఇండియన్ మార్కెట్లో పెద్ద రాణించలేకపోయింది. అయితే పంజాబ్ రాష్ట్రంలోని నారు మడులలో ట్రాక్టర్ శైలిలో మంచి పనితీరును కనబరిచింది.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

నారు మడులలో దున్నడం పూర్తయిన తరువాత చదును చేయాడనికి పంజాబ్‌లోని ఓ రైతు తన మిత్సిబిషి మోంటెరో ఎస్‌యూవీని వినియోగించాడు. ట్రాక్టర్ చేయాల్సిన పనులను ఈ లగ్జరీ ఎస్‌యూవీతో పూర్తి చేశాడు.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

ఒక రకంగా చెప్పాలంటే ఈ రైతు మంచి ధనవంతుడే. ఇతని వద్ద రూ. 60 లక్షల విలువైన మిత్సుబిషి మోంటెరో లగ్జరీ ఎస్‌యూవీతో పాటు టయోటా ల్యాండ్ క్రూయిజర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ వాహనాలు కూడా ఉన్నాయి.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

ఒకప్పుడు లండన్‌కు వెళ్లిన మన భారతీయ రాజుకు రోల్స్ రాయిస్ షోరూమ్‌లో అవమానం జరిగిందని, రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసి వాటిని వీధుల్ని శుభ్రం చేయడానికి వినియోగించాడని విన్నాం కదా, ఈ పంజాబ్ రైతు కూడా అదే తరహాలో అత్యంత ఖరీదైన వాహనాలతో వ్యవసాయం చేస్తున్నాడు.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

ట్రాక్టర్ ఉపయోగించి సేద్యం చేయడం ఈ రైతుకి అసౌకర్యంగా ఉందని, పూర్తిగా పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నేసిన తరువాత, సౌకర్యవంతంగా తన లగ్జరీ ఎస్‌యూవీని వినియోగించి మొత్తం పొలాన్ని చదును చేసుకున్నాడు.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

సాధారణ పొలాలు కాకుండా నారు మడులలో ఇలాంటి ఎస్‌యూవీలతో సేద్యం ఎలా సాధ్యం ట్రాక్టర్లు సైతం మట్టిలో ఇరుక్కుపోతున్నాయి కదా అని ఆలోచిస్తున్నారా...? 60 లక్షల కన్నా ఎక్కువ ధర ఉన్న ఈ వెహికల్‌లో మనకు తెలియని అనేక ఫీచర్లు ఉన్నాయి. బురద మట్టిలో సైతం సులభంగా ప్రయాణించే డ్రైవ్ సిస్టమ్ ఇందులో ఉంది.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

జపాన్ దిగ్గజం మిత్సుబిషి ఈ మోంటెరో ఎస్‌యూవీని నిర్మించింది. ఇందులో 3.2-లీటర్ల సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు, ఇది 3,800ఇంజన్ వేగం వద్ద 196పిఎస్ పవర్ మరియు 2,000 ఇంజన్ వేగం వద్ద 441ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ అన్ని చక్రాలకు అందించడానికి ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. అత్యుత్తమ డ్రైవింగ్ అదే విధంగా అన్ని రకాల భూబాగాల్లో సునాయాసంగా ప్రయాణించడానికి 4-వీల్ స్లిప్ కంట్రోల్ మరియు 4-వీల్ ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థలను అందివ్వడం జరిగింది.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

సాధారణ ప్రయాణ సమయాల్లో ఇది లీటర్‌కు 11.56కిమీలు మరియు హై వే డ్రైవింగ్ పరిస్థితుల్లో 10కిమీల మైలైజ్ ఇస్తుంది. మరి ఇలా పొలాల్లో వ్యవసాయానికి వినియోగిస్తే ఏ మేరకు మైలేజ్ వస్తోందో ఆ రైతుకే తెలియాలి మరి.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

లాడర్ (నిచ్చెన) ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా నిర్మించిన ఈ మిత్సుబిషి మోంటెరో ఎస్‌యూవీలో భద్రత పరంగా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆక్టివ్ స్టెబిలిటి, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ మరియు ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

ముందు వైపు రెండు, ప్రక్క వైపుల రెండు మరియు రెండు కర్టన్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. వీటితో పాటు లగ్జరీ లెథర్ అప్‌హోల్‌స్ట్రే, 60:40 నిష్పత్తిలో మలిపే వీలున్న మధ్య వరుస సీటింగ్ మరియు చివరి వరుస సీటును పూర్తిగా మలిపేయవచ్చు.

60 లక్షల కారుతో నారు మడులు దున్నుతున్న పంజాబ్ రైతు

ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్-సిరీస్ లగ్జరీ వాహనాలతో పోటీపడే ఈ మిత్సుబిషి మోంటెరోలోని డ్రైవర్ మరియు కో ప్యాసింజర్ సీట్లను వ్యక్తిగతంగా 8 విధాలుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

  

English summary
Read In Telugu: Interesting Details About India's Longest Bus Route
X

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more