కెయువి100 nxt మైక్రో ఎస్‌యూవీ ఆవిష్కరించిన మహీంద్రా

Written By:

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా భారీగా అప్‌డేట్ చేసిన కెయువి100 మైక్రో ఎస్‌యూవీని NXT వెర్షన్‌లో ఆవిష్కరించింది. సరికొత్త కెయువి100 nNXT మైక్రో ఎస్‌‍యూవీ అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

మహీంద్రా తమ ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ మోడల్ కెయువి100 ను తొలుత 2016 జనవరిలో విపణిలోకి విడుదల చేసింది. చిన్న పరిమాణంలో బాక్సీ డిజైన్‌తో వచ్చిన కెయువి100 ఇండియన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, మరోసారి జాతకాన్ని పరీక్షించుకోవడానికి NXT వెర్షన్‌లో విడుదలకు సిద్దమవుతోంది.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

అభివృద్ది చెందిన కెయువి100 మహీంద్రా కెయువి100 NXT పేరుతో రానుంది, మార్పులకు గురైన ఈ ఎస్‌యూవీకి చెందిన వీడియో ఒకటి యూట్యూబ్ ‌లోకి చేరింది. ఇందులో ఫ్రంట్ బంపర్, రియర్ బంపర్ మరియు బానెట్ వంటి ప్రధాన భాగాలు రీడిజైన్ చేయబడ్డాయి.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

మహీంద్రా కెయువి100 NXTలో ముందు మరియు వెనుక వైపున ఫాక్స్ స్కిడ్ ప్లేట్ మరియు రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, ప్లాస్టిక్ క్లాడింగ్, ప్లాస్టిక్ వీల్ ఆర్చెస్, రీడిజైన్ చేయబడిన హెడ్ ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్స్ క్లస్టర్స్ ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

మహీంద్రా వారి మైక్రో ఎస్‌యూవీ అత్యంత ఆకర్షణీయంగా కనబడేందుకు డోర్లు, టెయిల్ సెక్షన్ లను షార్ప్ లుక్స్‌తో తీర్చిదిద్దింది. ఎస్‌యూవీ మొత్తాన్ని ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగా రీఫ్రెష్‌డ్ లుక్‌తో పాటు అదనపు సొబగులను జోడించింది.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

అంతే కాకుండా ఇందులో ఇంటిగ్రేటెడ్ రూఫ్ రెయిల్స్, టెయిల్‌గేట్ స్పాయిలర్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ 15-అంగుళాల పరిమాణం ఉన్న మెషీన్ కట్ అల్లాయ్ వీల్స్‌తో రానుంది.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

ఇంటీరియర్‌లో ఎన్నో కొత్త ఫీచర్లను అందివ్వడం జరిగింది. అందులో మల్టీ ఫంక్షన్స్ గల 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జిపిఎస్ న్యావిగేషన్ మరియు మ్యాప్‌మైఇండియా ద్వారా మ్యాప్స్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

సాంకేతికంగా మహీంద్రా కెయువి100 NXTలో 82బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 72బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌ ఆప్షన్‌లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

భద్రత పరంగా మహీంద్రా కెయువి100 NXT డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, కార్నరింగ్ బ్రేకింగ్ కంట్రోల్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి సేఫ్టీ ఫీచర్లు రానున్నాయి.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా కెయువి100 NXT ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్ల జోడింపుతో సరికొత్త ప్రయోగం చేస్తోందని చెప్పవచ్చు. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మారుతి ఇగ్నిస్, హోండా డబ్ల్యూఆర్-వి, హ్యుందాయ్ ఐ20 ఆక్టివ్ మరియు ఎటియోస్ క్రాస్ మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Mahindra KUV100 NXT Revealed Ahead Of Launch In India
Story first published: Thursday, October 5, 2017, 18:52 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark