షాకింగ్ న్యూస్: స్కార్పియోలోని ఆటోమేటిక్ వేరియంట్లను తొలగించిన మహీంద్రా

Written By:

మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీలలో ఒకటైన స్కార్పియో ఇండియాలో ఎంతో మంది ఫేవరేట్ వెహికల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మహీంద్రా తలరాతనే మార్చేసింది స్కార్పియో. అయితే స్కార్పియోలోని మోస్ట్ సక్సెస్‌ఫుల్ వేరియంట్ అయిన ఆటోమేటిక్ వేరియంట్‌ను లైనప్ నుండి తొలగించినట్లు ప్రకటించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
స్కార్పియోలోని ఆటోమేటిక్ వేరియంట్లను తొలగించిన మహీంద్రా

మీరు విన్నది అక్షరాలా నిజమే,ఇక మీదట స్కార్పియోలోని ఆటోమేటిక్ వేరియంట్‌ను కొనుగోలు చేయడం దాదాపు అసంభవమే. మహీంద్రా ప్రొడక్ట్ లైనప్‌లోని మహీంద్రాలో అన్ని ఆటోమేటిక్ వేరియంట్లను పూర్తిగా తొలగించింది.

స్కార్పియోలోని ఆటోమేటిక్ వేరియంట్లను తొలగించిన మహీంద్రా

అయితే ఆటోమేటిక్ వేరియంట్ల విశయమై మహీంద్రా ప్రతినిధులను ఓ ఆటోమొబైల్ మీడియా సంప్రదించగా, ఫ్యూచర్‌లో ఆటోమేటిక్ స్కార్పియో ఎస్‌యూవీలకు డిమాండ్ పెరిగితే మళ్లీ విడుదల చేసే విషయమై ఆలోచిస్తామని మహీంద్రా ప్రతినిధులు పేర్కొన్నారు.

స్కార్పియోలోని ఆటోమేటిక్ వేరియంట్లను తొలగించిన మహీంద్రా

చేతితో గేర్ వేయకుండానే వెహికల్ వేగాన్ని బట్టి గేర్లను మార్చుకునే గేర్‌బాక్స్‌ను ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్ అంటారు. ఆటోమేటిక్ వేరియంట్లను ఎంచుకునే వారి సంఖ్య పెరగడంతో 2015 లో స్కార్పియోను ఆటోమేటిక్ ఆప్షన్‌లో పరిచయం చేసింది.

స్కార్పియోలోని ఆటోమేటిక్ వేరియంట్లను తొలగించిన మహీంద్రా

సాధారణ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో లభించే స్కార్పియో 9.29 లక్షల నుండి 10.28 లక్షల ఎక్స్-షోరూమ్ ధరల శ్రేణిలో అందుబాటులో ఉంది. అత్యాధునిక ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అభివృద్ది చేస్తున్న తరుణంలోనే ప్రస్తుతం ఉన్న ఆటోమేటిక్ వేరియంట్లను తొలగించిందనే ఆధారం లేని కథనాలు పుట్టుకొస్తున్నాయి.

Source

English summary
Read In Telugu Mahindra Scorpio Automatic Variants Removed From Official Website
Story first published: Wednesday, June 28, 2017, 14:58 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark