కళ్లు చెదిరే మోడళ్లు, అదిరే ఫీచర్లతో ఎమ్‌జి మోటార్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

Written By:

ఇండియన్ మార్కెట్లో ఖరీదైన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటి హ్యుందాయ్ క్రెటా. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న మారుతి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, రెనో డస్టర్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా టియువి300 వెహికల్స్‌తో పోల్చుకుంటే హ్యుందాయ్ క్రెటా ఖరీదైన మోడల్. మరియు సేల్స్ పరంగా కూడా మంచి ఫలితాలు కనబరుస్తోంది.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

విపణిలో ఇప్పటి వరకు క్రెటాకు సరైన పోటీ వచ్చింది లేదు. అయితే బ్రిటన్‌కు చెందిన ఎమ్‍‌జి మోటార్స్ హ్యుందాయ్ క్రెటాకు పోటీని తీసుకొస్తూ దేశీయ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమవుతోంది.

Recommended Video - Watch Now!
Do Airplanes Have A Reverse Gear? - DriveSpark
ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఇండియన్ మార్కెట్లో అధిక సంఖ్యలో అమ్ముడుపోవుతున్న ప్రీమియమ్ మోడళ్లకు గట్టి పోటీనిచ్చేవాటి మీద దృష్టిసారిస్తోంది. కేవలం అలాంటి సెగ్మెంట్లోనే రాణించే లక్ష్యంతో ఎమ్‌జి మోటార్స్ పనిచేస్తోంది.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తొలి మోడల్‌గా జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. హ్యుందాయ్ క్రెటాతో పోటీపడే ఈ జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని 2019లో ఉత్పత్తి ప్రారంభించనుంది.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఎమ్‌జి మోటార్స్ ఇండియా విభాగం ఇటీవలె తమ అధికారిక ఫేస్‌బుక్ పేజిని ప్రారంభించి ఎమ్‌జి జడ్ఎస్ మరియు డిఎస్ ఎస్‌యూవీలను టీజర్ వీడియోలను లాంచ్ చేసింది. వీటిని అత్యంత పోటీతత్వమున్న ధరతో విడుదల చేసే విధంగా గుజరాత్‌లోని హలోల్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది.

Trending On DriveSpark Telugu:

భారీ సంఖ్యలో మారుతి డిజైర్ రీకాల్

మారుతి స్విఫ్ట్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ప్యూజో

2018 ఫిబ్రవరిలో భారీ సంచలనానికి తెర దించిన మారుతి

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఎమ్‌జి మోటార్స్ ఇప్పటికే తమ జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇంగ్లాడ్ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇంగ్లాడ్ మోడల్ జడ్ఎస్ రెండు రకాల ఇంజన్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అవి, 1-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. వీటిలో 1.0-లీటర్ ఇంజన్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 1.5-లీటర్ ఇంజన్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ కలదు.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

డిజైన్ పరంగా ఎమ్‌జి జడ్ఎస్ ఎస్‌యూవీ అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్ కలిగి ఉంది. పెద్ద పరిమాణంలో ఉన్న స్పోర్టివ్ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి లైట్లు మరియు స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయి.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఎస్‌యూవీ రియర్ డిజైన్‌లో రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ కలదు. వ్రాప్ అరౌండ్ ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్, స్కిడ్ ప్లేట్స్ మరియు 17-అంగుళాల పరిమాణం గల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కలవు.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఎమ్‌జి జడ్ఎస్ ఇంటీరియర్‌లో స్పోర్టివ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, కనెక్టివిటి ఆప్షన్స్ గల పెద్ద పరిమాణంలో ఉన్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ కన్సోల్ పైభాగంలో ఉన్న హారిజంటల్ ఎయిర్ వెంట్స్, సిల్వర్ ట్రిమ్ హైలైట్ డ్యాష్ బోర్డ్‌తో పాటు ప్రీమియమ్ ఫీల్ కలిగించే మెటీరియల్‌తో తయారు చేసిన అప్‌హోల్‌స్ట్రే మరియు సౌకర్యవంతమైన సీట్లు.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ప్రయాణికుల సేఫ్టీ పరంగా ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, కర్టెన్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, హిల్ లాంచ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

విపరీతమైన స్పందన లభిస్తున్న కాంపాక్ట్ సెగ్మెంట్లోకి 5-సీటింగ్ కెపాసిటితో ఎమ్‌జి జడ్ఎస్ విడుదల కానుంది. 2019లో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించే సందర్భంలో జడ్ఎస్ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి ఎమ్‌జి మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్ మరియు నిస్సాన్ టెర్రానో లకు గట్టి పోటీనివ్వనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: MG Motors’ Creta Rival Is Coming To India — Launch Details Revealed

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark