నదుల్ని సైతం లెక్కచేయని టాటా ఎస్‌యూవీ: వీడియో..!!

హెక్సా వెహికల్ సగం వరకు నీటిలో మునిగిపోయింది. అయినప్పటికీ లోతును, నీటి ప్రవాహాన్ని లెక్కచేయడానికి ముందుకెళ్లింది. శక్తి సామర్థ్యాలను అదేపనిగా చూపించకుండా, సందర్భం వచ్చినపుడు చూపించడం అంటే ఇదే కాబోలు.

By Anil

తన శక్తిసామర్థ్యాలు అదేపనిగా చూపించుకోవాల్సిన అవసరం లేదు... సందర్భం వచ్చినపుడు నిరూపించుకోవాలి. రోడ్డు మీద ఎలాంటి వెహికలైనా బాగానే పోతుంది. అయితే, రోడ్డు దిగి మట్టి రోడ్లను దాటుకొని వాంగులు వంకలను దాటితేనే అసలైన ఆఫ్ రోడింగ్ వెహికల్ అంటాము.

నదులను దాటిన టాటా హెక్సా

పైన చెప్పిన అంశాలను అక్షరాలా నిజం చేసే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ బృందం టాటా హెక్సా వెహికల్‌లో ఆఫ్ రోడింగ్ ట్రిప్ వెళ్లారు. ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలన్నీ నీటితో నిండిపోయాయి. ఉన్నది ఒకటే రూట్ కావడంతో వాటినే దాటుకుంటూ వెళ్లారు.

నదులను దాటిన టాటా హెక్సా

హెక్సా వెహికల్ సగం వరకు నీటిలో మునిగిపోయింది. అయినప్పటికీ లోతును, నీటి ప్రవాహాన్ని లెక్కచేయడానికి ముందుకెళ్లింది. శక్తి సామర్థ్యాలను అదేపనిగా చూపించకుండా, సంధర్భం వచ్చినపుడు చూపించడం అంటే ఇదే కాబోలు.

Recommended Video

Mahindra KUV100 NXT Launched In India | In Telugu - DriveSpark తెలుగు
నదులను దాటిన టాటా హెక్సా

ఏదేమైనప్పటికీ టాటా అత్యుత్తమ నిర్మాణ విలువలతో తమ కొత్త ఉత్పత్తులను నిర్మిస్తోంది. ఈ మధ్య కాలంలో కొత్తగా విడుదలైన టాటా కార్లు ప్రమాదానికి గురయ్యాయి. అన్నింటిలో కూడా టాటా వారి నిర్మాణ విలువలేంటో బయటపడ్డాయి.

నదులను దాటిన టాటా హెక్సా

టాటా హెక్సా ఎస్‌యూవీలో 2.2-లీటర్ సామర్థ్యం గల వారికోర్ డీజల్ ఇంజన్ కలదు. హెక్సా లోని ఎక్స్ఇ వేరియంట్లోని ఇంజన్ 148బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

నదులను దాటిన టాటా హెక్సా

అదే విధంగా హెక్సా లోని ఎక్స్ఎమ్ మరియు ఎక్స్‌టి వేరియంట్లలోని ఇదే ఇంజన్ 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాటా హెక్సా ఎస్‌యూవీని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

Trending On DriveSpark Telugu:

భారీ చెట్టు మీద పడినా చెక్కు చెదరని టాటా హెక్సా

మారుతి వితారా బ్రిజాతో పోల్చితే నెక్సాన్ ఎంపిక సరైనదేనా...?

నదులను దాటిన టాటా హెక్సా

టాటా హెక్సా ఎస్‌యూవీ 4X2 మరియు 4X4 డ్రైవ్ వెర్షన్‌లలో లభిస్తోంది. హెక్సా ఎస్‌యూవీతో ఆఫ్ రోడింగ్‌కు వెళ్లిన బృందంలో ఓ వ్యక్తి హెక్సా వెహికల్ వాగులను దాటే వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు.

రాఘవ్ మునవల్లి అనే వ్యక్తి టాటా హెక్సా ఆఫ్ రోడింగ్ లక్షణాలను చూపించని మూడు వీడియోలను అప్‌లోడ్ చేసాడు. టాటా హెక్సా ఎలాంటి అవాంతరాలు, ఒడిదుడుకులు లేకుండా సునాయాసంగా లోతైన వాగులను దాటడాన్ని చూడవచ్చు.

హెక్సా దాదాపు నీటమునిగింది. అయినప్పటికీ, చాలు ఈజీగా బయటకు వచ్చేసింది. ఈ వీడియోలో టాటా హెక్సా టాప్ ఎండ్ వేరియంట్. ఇందులో పగటిపూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ప్రొజెక్టర్ ల్యాంప్స్ మరియు అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

టాటా హెక్సా ఎస్‌యూవీని హైడ్రోఫార్మ్‌డ్ ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీతో నిర్మించారు. తారు రోడ్డు మీదే కాదు, లోతైన నదుల్లో, మరియు మట్టి రోడ్ల మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా దాటగలదని నిరూపించుకుంది.

నదులను దాటిన టాటా హెక్సా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హెక్సా చూడటానికి ఎస్‌యూవీ మరియు ఎమ్‌పీవీ రూపంలో ఉంటుంది. దీంత 7-సీటింగ్ లేఔట్లో ఉన్న ఇండియన్ ఎస్‌యూవీ/ఎమ్‌పీవీలలో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు టయోటా ఇన్నోవా ఫార్చ్యూనర్‌తో పోటీపడుతోంది.

అయితే, ధరకు తగ్గ విలువలు గల హెక్సా అత్యుత్తమ ఇంటీరియర్ ఫీచర్లు మరియు విశాలమైన క్యాబిన్ స్పేస్‌తో సిటీ మరియు అర్బన్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి తోడు ఇప్పటి వరకు హెక్సా మీద ఎలాంటి కస్టమర్ కంప్లైట్లు రాకపోవడం గమనార్హం.

Most Read Articles

English summary
Read In Telugu: Tata Hexa Demonstrates Extreme Off-Roading Capabilities; Crosses A River In Heavy Rain
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X