టాటా నెక్సాన్ ఎంచుకుంటున్నారా...? అయితే వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే

Written By:

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. సరికొత్త టాటా నెక్సాన్ విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హోండా డబ్ల్యూఆర్-వి మరియు మహీంద్రా టియువి300 వాహనాల నోర్లు మూయించనుంది.

టాటా నెక్సాన్

దేశవ్యాప్తంగా ఉన్న టాటా విక్రయ కేంద్రాలలో రూ. 11,000 ల టోకన్ అమౌంట్ చెల్లించి టాటా నెక్సాన్‌ను బుక్ చేసుకోవచ్చు. నెక్సాన్ మీద వెయింటింగ్ పీరియడ్ 3 నెలలుగా ఉంది మరియు జిఎస్‌టితో సహా నెక్సాన్ ప్రారంభ ధర రూ. 5.885 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

టాటా నెక్సాన్

వివిధ నగరాలలో టాటా నెక్సాన్ బుకింగ్ మొత్తం

నగరం బుకింగ్ ధర
హైదరాబాద్ రూ. 11,000 లు
బెంగళూరు రూ. 11,000 లు
చెన్నై రూ. 11,000 లు
ముంబాయ్ రూ. 11,000 లు
ఢిల్లీ రూ. 11,000 లు
పూనే రూ. 11,000 లు
టాటా నెక్సాన్

నెక్సాన్‌కు పోటీగా ఉన్న వాహనాల బుకింగ్ ధరలు

మోడల్ బుకింగ్ ధర
టాటా నెక్సాన్ రూ. 11,000 లు
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ రూ. 10,000 లు
మారుతి సుజుకి వితారా బ్రిజా రూ. 21,000 లు
మహీంద్రా టియువి300 రూ. 25,000లు
టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ మరియు పోటీదారుల వెయింట్ పీరియడ్:

మోడల్స్ వెయిటింగ్ పీరియడ్
టాటా నెక్సాన్ 12 వారాలు
మారుతి వితారా బ్రిజా 18 వారాలు
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 1 వారం
మహీంద్రా టియువి300 1 వారం
టాటా నెక్సాన్

వేరియంట్ల వారీగా టాటా నెక్సాన్ ధరలు

టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో ఎంచుకోగలరు...

నెక్సాన్ పెట్రోల్ వేరియంట్లు ధరలు(ఢిల్లీ)
ఎక్స్ఇ రూ. 5,85,000 లు
ఎక్స్ఎమ్ రూ. 6,49,900 లు
ఎక్స్‌టి రూ. 7,29,900 లు
ఎక్స్‌జడ్ ప్లస్ రూ. 8,44,900 లు
ఎక్స్‌జడ్ ప్లస్(డ్యూయల్ టోన్) రూ. 8,59,900 లు
టాటా నెక్సాన్
నెక్సాన్ డీజల్ వేరియంట్లు ధరలు(ఢిల్లీ)
ఎక్స్ఇ రూ. 6,85,000 లు
ఎక్స్ఎమ్ రూ. 7,39,900 లు
ఎక్స్‌టి రూ. 8,14,900 లు
ఎక్స్‌జడ్ ప్లస్ రూ. 9,29,900 లు
ఎక్స్‌జడ్ ప్లస్(డ్యూయల్ టోన్) రూ. 9,44,900 లు
టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ ఇంజన్ స్పెసిఫికేషన్లు

ఇంజన్(పెట్రోల్) 1,198సీసీ మూడు సిలిండర్ల టుర్బో పెట్రోల్
ఇంజన్(డీజల్) 1,497సీసీ నాలుగు సిలిండర్ల టుర్బో డీజల్
గేర్‌బాక్స్ 6-స్పీడ్ మ్యాన్యువల్
పవర్/టార్క్పెట్రోల్

108.5Bhp@ 5,000Rpm/ 170Nm@1750-4,000Rpm

పవర్/టార్క్ డీజల్ 108.5Bhp@3,750Rpm/ 260Nm@1500-2,700Rpm
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 44 లీటర్లు
గ్రౌండ్ క్లియరెన్స్ 209ఎమ్ఎమ్
మొత్తం బరువు 1237కిలోలు(పెట్రోల్)/ 1305కిలోలు(డీజల్)
టైర్లు గుడ్ఇయర్ 215/60 ఆర్16
టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ ప్రత్యేక ఫీచర్లు

  • డ్యూయల్ ఎయిర్ బ్యాగులు (అన్ని వేరియంట్లలో)
  • యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) [అన్ని వేరియంట్లలో]
  • స్పోర్ట్, సిటి మరియు ఎకో డ్రైవింగ్ మోడ్స్ (అన్ని వేరియంట్లలో)
  • అంబ్రెల్లా హోల్డర్ (అన్ని వేరియంట్లలో)
  • హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (XM, XT మరియు XZ+ వేరియంట్లలో)
  • రియర్ పార్కింగ్ సెన్సార్లు (XM, XT మరియు XZ+ వేరియంట్లలో)
  • రిమోట్ కంట్రోల్ లాకింగ్ (XM, XT మరియు XZ+ వేరియంట్లలో)
  • ఇల్ల్యూమినేటెడ్ మరియు కూల్డ్ గ్లూవ్ బాక్స్ (XT మరియు XZ+ వేరియంట్లలో)
  • పుష్ బటన్ స్టార్ (కేవలం XZ+ వేరియంట్లో మాత్రమే)
  • కెమెరా ఆధారిత పార్క్ అసిస్ట్ (కేవలం XZ+ వేరియంట్లో మాత్రమే)
Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
టాటా నెక్సాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్స్ అనంతరం అత్యధికంగా అమ్ముడవుతున్నది కాంపాక్ట్ ఎస్‌యూవీలు. ఈ సెగ్మెంట్లో ఇది వరకే, ఉన్న మారుతి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా టియువి300 లకు గట్టి పోటినిచ్చేలా టాటా తమ తొలి కాంపాక్ట్ ఎస్‍యూవీని పరిచయం చేసింది.

వీటిలో వెహికల్ విజయాన్నందుకుంటుందో... ఈ పండుగ సీజన్ ముగిస్తే తెలుస్తుంది. ఇదే సరే... ఇది చెప్పండి, నెక్సాన్, బ్రిజా, ఎకోస్పోర్ట్ మరియు టియువి300 లలో మీకు నచ్చిన మోడల్ ఏది ?(క్రింది కామెంట్ బాక్సులో తెలపగలరు).

English summary
Read In Telugu: Planning To Book A Tata Nexon? Things You Should Know Before Booking The Nexon
Story first published: Saturday, September 23, 2017, 16:42 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark