టాటా నెక్సాన్ మీద భారీగా తగ్గుతున్న వెయిటింగ్ పీరియడ్: ఎలా...?

Written By:

భారతీయుల ఫేవరెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి లాభదాయకమైన ఎస్‌యూవీతో టాటా మోటార్స్ ప్రవేశించింది. భారీ అంచనాల మధ్య నెక్సాన్ ఎస్‌యూవీని విపణిలోకి విడుదల చేసినప్పటి నుండి మంచి ఆదరణ లభిస్తోంది.

టాటా నెక్సాన్

నెక్సాన్ మీద రోజు రోజుకీ బుకింగ్స్ పెరిగేకొద్దీ డిమాండ్ తగ్గ ఉత్పత్తి చేయలేక, ఒకానొక దశలో వెయిటింగ్ పీరియడ్ ప్రకటించింది. దీంతో నెక్సాన్ మీద వెయిటింగ్ పీరియడ్ రెండు నెలలకు పెరిగిపోయింది.

Recommended Video - Watch Now!
[Telugu] Tata Nexon Review: Specs
టాటా నెక్సాన్

అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు, నెక్సాన్ ఎస్‌యూవీని బుక్ చేసుకున్న వారికి వెంటనే డెలివరీ ఇచ్చేందుకు నెక్సాన్ మీదున్న వెయిటింగ్ పీరియడ్ తగ్గించాలని టాటా నిర్ణయం తీసుకుంది. ఇదే జరిగితే నెక్సాన్ మీద కాలపరిమితి దాదాపు తగ్గిపోనుంది.

టాటా నెక్సాన్

గడిచిన రెండు నెలలో సగటున నెలకు 3,000 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇప్పుడు నెక్సాన్ ప్రొడక్షన్‌ను 3,000 నుండి 6,000 లకు పెంచేందుకు టాటా సిద్దమవుతోంది.

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ గడిచిన రెండేళ్ల నాలుగు విభిన్న సెగ్మెంట్లలోకిం నాలుగు మోడళ్లను విడుదల చేసింది. అవి, టియాగో(హ్యాచ్‌బ్యాక్), హెక్సా(క్రాసోవర్ ఎస్‌యూవీ), టిగోర్(కాంపాక్ట్ సెడాన్), నెక్సాన్(కాంపాక్ట్ ఎస్‌యూవీ).

టాటా నెక్సాన్

ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా నిర్మించిన వీటిలో టాటా బెస్ట్ సెల్లింగ్ కారుగా టియాగో హ్యాచ్‌బ్యాక్ మరియు టాటా రెండవ బెస్ట్ సెల్లింగ్ కారుగా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ స్థానం సంపాదించుకున్నాయి.

టాటా మోటార్స్ గురించి మీకు తెలియని పది విషయాలు

అవమానించిన ఫోర్డ్ మీద ఇలా ప్రతీకారం తీర్చుకున్న రతన్ టాటా

టాటా నెక్సాన్

ధరకు తగ్గ విలువలతో టాటా మోటార్స్ విడుదల చేసిన నెక్సాన్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ వితారా బ్రిజాకు గట్టి పోటీనిస్తోంది. దీనితో పాటు ఎకోస్పోర్ట్ మరియు టియువి300 లకు నెక్సాన్ సెగ బాగానే తగులుతోంది.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్‌లో ఎన్నో ప్రీమియమ్ ఇంటీరియర్ ఫీచర్లను అందించింది. ఇప్పటి ఈ సెగ్మెంట్లో పరిచయం కాని ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హార్మన్ మ్యూజిక్ సిస్టమ్ మరియు విభిన్న కనెక్టివిటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్

సాంకేతికంగా నెక్సాన్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా నెక్సాన్

నెక్సాన్‌లోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తున్నాయి.

టాటా నెక్సాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా నెక్సాన్ ఎంతో యంగ్ ఇండియన్స్‌కు ఫేవరెట్ ఎస్‌యూవీగా నిలిచిపోయింది. వెయిటింగ్ పీరియడ్ అధికంగా ఉన్నప్పటికీ నెక్సాన్‌నే ఎంచుకుంటున్నారు. వీలైనంత వరకు ఎక్కువ మంది కస్టమర్లను చేరుకునేందుకు టాటా నెక్సాన్ ప్రొడక్షన్‌ను మరింత పెంచేసింది.

మొత్తానికి టాటా నెక్సాన్ ఇటు కస్టమర్లకు, అటు కంపెనీకి బెస్ట్ ప్రొడక్ట్‌గా నిలిచింది.

.

మారుతి వితారా బ్రిజాతో పోల్చితే నెక్సాన్ ఎంపిక సరైనదేనా...?

టాటా నెక్సాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ: పెను సంచలనమే...!!

ఫస్ట్ టైమ్ మారుతి కార్లకు చెమటలు పట్టిస్తున్న టాటా

English summary
Read In Telugu: Tata nexon waiting period to decrease as production increases

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark