మార్కెట్లోకి కొత్త పెట్రోల్: లీటర్ రూ. 100 లతో 99 ఆక్టేన్ పెట్రోల్ విడుదల

Written By:

దేశీయ ఇంధన మార్కెట్లో మరో కొత్త రకం పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. దిగ్గజ చమురు సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం దేశ ఆర్థిక రాజధాని ముంబాయ్ నగర వేదికగా హై-ఆక్టేన్ పెట్రోల్ ఇంధనాన్ని విడుదల చేసింది. ముంబాయ్‍లోని ఎన్‌ఎస్ రోడ్డులో ఉన్న ఆటో కేర్ రిటైల్ స్టోర్‌ ఆక్టేన్ పెట్రోల్‌ను లాంచ్ చేసింది.

మార్కెట్లోకి కొత్త పెట్రోల్: లీటర్ రూ. 100 లతో 99 ఆక్టేన్ పెట్రోల్ విడుదల

ఇండియాలో 99 ఆక్టేన్ పెట్రోల్ తొలిసారిగా పరిచయమైన మొదటి మెట్రో నగరం ముంబాయ్. ఈ 99 ఆక్టేన్ పెట్రోల్ లీటరు ధర రూ. 100 లుగా ఉంది.

మార్కెట్లోకి కొత్త పెట్రోల్: లీటర్ రూ. 100 లతో 99 ఆక్టేన్ పెట్రోల్ విడుదల

హై-ఆక్టేన్ పెట్రోల్‌ను పవర్ 99 అని పిలుస్తారు. గతంలో దీనిని బెంగళూరు మరియు పూనే నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రెండు నగరాల్లో కూడా 99 ఆక్టేన్ పెట్రోల్‌కు మంచి స్పందన లభించిందని హిందుస్తాన్ పెట్రోలియం పేర్కొంది.

మార్కెట్లోకి కొత్త పెట్రోల్: లీటర్ రూ. 100 లతో 99 ఆక్టేన్ పెట్రోల్ విడుదల

పవర్ 99 పెట్రోల్ ఇండియాలో అత్యధిక ఆక్టేన్ ఉన్న పెట్రోల్. కంపెనీ సమాచారం ప్రకారం, ఇండియాలో 93 శాతం మంది ప్రజలు సాధారణ 91 ఆక్టేన్ ఫ్యూయల్ వినియోగిస్తుండగా, మిగతా ఏడు శాతం మంది ఎక్కువ ఆక్టేన్ ఇంధనాన్ని వినియోగిస్తున్నట్లు తెలిసింది.

మార్కెట్లోకి కొత్త పెట్రోల్: లీటర్ రూ. 100 లతో 99 ఆక్టేన్ పెట్రోల్ విడుదల

పవర్ 99 పెట్రోల్ ఇంజన్ శబ్దం మరియు ఇంజన్ డ్యామేజ్‌ను తగ్గిస్తుంది, దీంతో అధిక ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. ఈ పెట్రోల్‌లో లోహ మూలకాలు లేకపోవడంతో ఇంజన్ జీవిత కాలాన్ని పెంచుతుంది. అంతే కాకుండా ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ వంటి ఉద్గారాలను తగ్గిస్తుంది.

మార్కెట్లోకి కొత్త పెట్రోల్: లీటర్ రూ. 100 లతో 99 ఆక్టేన్ పెట్రోల్ విడుదల

హిందుస్తాన్ పెట్రోలియం మొట్టమొదటిసారిగా 2017లో 99 ఆక్టేన్ పెట్రోల్ ఇంధనాన్ని ప్రయోగాత్మకంగా పరిచయం చేసింది. ఇండియాలో ఉన్న సూపర్ కార్లు మరియు పర్ఫామెన్స్ కార్లను లక్ష్యంగా చేసుకుని పవర్ 99 ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

మార్కెట్లోకి కొత్త పెట్రోల్: లీటర్ రూ. 100 లతో 99 ఆక్టేన్ పెట్రోల్ విడుదల

పెట్రోల్ ఇంజన్ లోపల జరిగే అనియంత్రిత దహనాన్ని నిరోధించడాని ఆక్టేన్ కొలమానం. ఆక్టేన్ శాతం ఎక్కువ ఉన్న పెట్రోల్ వాడితో ఇంజన్‌ కంబషన్ కంట్రోల్‌లో ఉంటుంది.

మార్కెట్లోకి కొత్త పెట్రోల్: లీటర్ రూ. 100 లతో 99 ఆక్టేన్ పెట్రోల్ విడుదల

సూపర్ కార్లు ఆక్టేన్ శాతం ఎక్కువ ఉన్న కార్లను ఉపయోగించడానికి ప్రధాన కారణం, పైన పేర్కొన్నట్లుగా ఇంజన్‌లో అనియంత్రిత దహనంతో పాటు అత్యంత శక్తివంతమైన మరియు అధిక-మైలేజ్‌ ఇచ్చే ఇంజన్‌లను రూపొందించడానికి తయారీ సంస్థలకు సహాయపడుతుంది.

మార్కెట్లోకి కొత్త పెట్రోల్: లీటర్ రూ. 100 లతో 99 ఆక్టేన్ పెట్రోల్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలో ఈ మధ్య కాలంలో సూపర్ కార్లు మరియు సూపర్ బైకులు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ హై పర్ఫామెన్స్ కార్లు మరియు బైకులకు హై ఆక్టేన్ పెట్రోల్ అవసరం. సూపర్ కార్లే కాదు ఈ ఇంధనం ఉపయోగించడంతో సాధారణ కార్లలోని ఇంజన్ జీవిత కాలం మెరుగుపడటంలో సహాయపడుతుంది.

English summary
Read In Telugu: 99 Octane Petrol Priced At Rs. 100/Litre In India — Availability & More Details

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark