35 లక్షల విక్రయాలతో మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి ఆల్టో

Written By:

ఇండియాలో అంబాసిడర్ కారు తర్వాత అత్యధికంగా ప్రాచుర్యం పొందిన కారు మారుతి ఆల్టో. ఈ మధ్య కాలంలో విభిన్న డిజైన్‌లలో కొన్ని వందల సంఖ్యలో కొత్త కార్లు మార్కెట్లో కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. కానీ, ఓ ఇరవైయేళ్ల క్రితం చూసుకుంటే అంబాసిడర్, ఆల్టో వంటి కార్లదే సింహ భాగం.

Recommended Video - Watch Now!
2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
మారుతి ఆల్టో

మరో ఆశక్తకరమైన విషయం ఏమిటంటే... మారుతి ప్రవేశపెట్టిన మొట్టమొదటి కారు ఆల్టో ఇప్పటికీ ప్రతి నెలా భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. మరే కంపెనీకి సాధ్యం కానీ విజయాన్ని మారుతి సుజుకి అందుకొంది.

మారుతి ఆల్టో

ఇండియన్ ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో ఆల్టో మరియు సెలెరియో కార్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటిలో కొన్ని సంవత్సరాల నుండి ప్రతి నెలా భారీ విక్రయాలతో మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చిన మారుతి ఆల్టో సేల్స్ పరంగా ఇప్పుడు మరో అరుదైన మైలురాయిని చేధించింది.

మారుతి ఆల్టో

అవును, భారత్‌లో మారుతి ఆల్టో 35 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేధించింది. మార్కెట్లోకి విడుదలయ్యి కొన్ని సంవత్సరాలే గడిచిపోయినప్పటికీ దీని మీద ఆదరణ ఇంకా తగ్గడం లేదు. సరసమైన ధర మరియు ధరకు తగ్గ విలువలతో కూడిన ఫీచర్లు ఆల్టో సక్సెస్‌కు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

మారుతి ఆల్టో

2017-18 ఆర్థిక సంవత్సరంలో మారుతి ఆల్టో విక్రయాల్లో 6 శాతం వృద్దిని నమోదు చేసుకుని, ఇదే కాలంలో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ మొత్తం మార్కెట్ వాటాలో 33 శాతాన్ని ఆల్టో సొంతం చేసుకుంది.

మారుతి ఆల్టో

మారుతి ఆల్టో మొత్తం విక్రయాల్లో 44 శాతం 35 ఏళ్ల వయస్సు లోపున్న యువ కొనుగోలుదారుల నుండే వచ్చాయి. ఎప్పటికప్పుడు డిజైన్ పరంగా మార్పులు చేస్తూ, అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తూ యువ కస్టమర్లను ఆకర్షిస్తోంది.

మారుతి ఆల్టో

ప్రస్తుతం, విపణిలో ఉన్న మారుకి ఆల్టో రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. అవి, 800సీసీ మరియు 1-లీటర్ ఇంజన్.800సీసీ పెట్రోల్ ఇంజన్ 47బిహెచ్‌పి పవర్ మరియు 69ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

మారుతి ఆల్టో

అదే విధంగా ఆల్టోలోని 1-లీటర్ ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో ఎంచుకోవచ్చు.

మారుతి ఆల్టో

మారుతి ఆల్టో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లో కూడా కొన్ని ప్రీమియమ్ ఫీచర్లు ఉన్నాయి. అవి, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, అంతర్గతంగా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, స్టైలిష్ హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ స్టీరియో మరియు ఆల్టో టాప్ ఎండ్ వేరియంట్లో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది.

మారుతి ఆల్టో

మారుతి ఆల్టో భారీ సేల్స్ సాధించడానికి దేశవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన మారుతి సుజుకి డీలర్‌షిప్ నెట్‌వర్క కూడా ఇందుకు కలిసొచ్చింది. విస్తారమైన సేల్స్, సర్వీసింగ్ నెట్‌వర్క్, అతి తక్కువ నిర్వహణ ఖర్చులు మారుతి ఆల్టోను భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిపింది.

మారుతి ఆల్టో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

విపరీతమైన అమ్మకాలతో మారుతి ఆల్టో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో అగ్రగామిగా రాణిస్తోంది. ఆల్టో అందుకున్న 35 లక్షల సేల్స్ ఇప్పుడు భారత్‌లో ఆల్టో విజయాన్ని ప్రతిబింబిస్తుంది.

తాజాగా అందిన సమాచారం మేరకు, మారుతి సుజుకి ఆల్టో హ్యాచ్‌బ్యాక్‌లో బిఎస్-VI ప్రమాణాలను పాటించే ఇంజన్ అందించి ఏప్రిల్ 2020 గడువులోపు మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇదే సెగ్మెంట్లో పోటీగా ఉన్న ఇతర మోడళ్లకు గట్టి పోటీనిచ్చేందుకు సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌లో నూతన ఆల్టోను పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి.

English summary
Read In Telugu: Maruti Alto Becomes Best-Selling Car In India — Crosses 35 Lakh Sales Milestone

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark