సరికొత్త మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ విడుదల: ధర, ఇంజన్, వేరియంట్లు, ఫీచర్లు మరియు ఫోటోలు

జపాన్ దిగ్గజం మిత్సుబిషి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 2018 మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ ప్రీమియం ఎస్‌యూవీని లాంచ్ చేసింది. మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ భారీ ఫీచర్లతో కూడిన సింగల్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది.

By Anil Kumar

జపాన్ దిగ్గజం మిత్సుబిషి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 2018 మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ ప్రీమియం ఎస్‌యూవీని లాంచ్ చేసింది. మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ భారీ ఫీచర్లతో కూడిన సింగల్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. ఔట్‌ల్యాండర్ ఎస్‌యూవీ ధర రూ. 31.54 లక్షలు ఎక్స్-షోరూమ్(ముంబాయ్)గా ఉంది.

మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ విడుదల

మిత్సుబిషి ఇండియా ఈ ఔట్‌ల్యాండర్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో నిర్మించిన మోడల్‌గా (CBU) దిగుమతి చేసుకుని ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తోంది. సాంకేతికంగా ఇందులో 2.4-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ప్రొడ్యూస్ చేసే 164బిహెచ్‌పి పవర్ మరియు 222ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ విడుదల

సరికొత్త మిత్సుబిషి ఔట్‌ల్యాండ్ ఎస్‌యూవీ 7-సీటింగ్ లేఔట్లో లభిస్తోంది. లగేజ్ స్పేస్ పెంచుకోవడానికి రెండవ మరియు మూడవ వరుస సీట్లను సమాంతరంగా మడిపేయవచ్చు. ప్రస్తుతానికి డీజల్ వెర్షన్ ఔట్‌ల్యాండర్ పరిచయం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను ఇండియాకు ఖరారు చేస్తోంది.

మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ విడుదల

సరికొత్త మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ ఇంటీరియర్‌లో 6.1-అంగుళాల పరిమాణం గల టచ్‌స్క్రీన్-ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, 710వాట్ రాక్‌ఫోర్డ్ సౌండ్ సిస్టమ్, సివిటి గేర్‌బాక్స్ వేరియంట్లో పెడల్ షిఫ్టర్లు మరియు లెథర్ సీట్లు ఉన్నాయి.

మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ విడుదల

మిత్సుబిషి ఔట్‌ల్యాండ్ ఎస్‌యూవీలోని ఇతర ప్రీమియం ఫీచర్లలో... ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి డీఆర్ఎల్స్ గల ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, ఎల్ఇడి ఫాగ్ ల్యాంప్స్, హీటెడ్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, ఎల్ఇడి టెయిల్ లైట్ క్లస్టర్ మరియు 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇండియాలో కేవలం ఒక్క వేరియంట్లో లభించే ఔట్‌ల్యాండర్ ఎస్‌యూవీలో ఈ అన్ని ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి.

మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ విడుదల

భద్రత పరంగా, మిత్సుబిషి ఔట్‌ల్యాండర్‌లో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, యాక్టివ్ స్టెబిలిటి కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఆటోమేటిక్ హెడ్ లైట్లు మరియు వైపర్లతో పాటు ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ విడుదల

సరికొత్త 2018 మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ ఏడు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, బ్ల్యాక్ పర్ల్, కాస్మిక్ బ్లూ, ఓరియెంట్ రెడ్, కూల్ సిల్వర్, వైట్ సాలిడ్, వైట్ పర్ల్ మరియు టైటానియం గ్రే.

మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే సరికొత్త మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌లో ఉంది. డీజిల్ ప్రియులు ఎక్కువగా ఉన్న ఇండియాలో ఇప్పటికీ, డీజల్ వెర్షన్ ఔట్‌ల్యాండర్ వేరియంట్ పరిచయం చేయలేదు.

సరికొత్త మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ విపణిలో ఉన్న స్కోడా కొడియాక్ మరియు అప్‌కమింగ్ కొత్త తరం హోండా సీఆర్-వీ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: New Mitsubishi Outlander Launched In India; Priced At Rs 31.54 Lakh
Story first published: Friday, June 22, 2018, 11:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X