టాటా హ్యారీయర్ ఇంటీరియర్ ఫోటోలు లీక్

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో తమ హ్యారియర్ ఎస్‌యూవీ విడుదలకు చకచకా ఏర్పాట్లను పూర్తి చేసుకుంటోంది. అత్యంత రహస్యంగా పరీక్షిస్తుండగా, పలుమార్లు మీడియా కంటబడింది. తాజాగా, టాటా హ్యారియర్ ఇంటీరియర్ ఫోటో

By Anil Kumar

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో తమ హ్యారియర్ ఎస్‌యూవీ విడుదలకు చకచకా ఏర్పాట్లను పూర్తి చేసుకుంటోంది. అత్యంత రహస్యంగా పరీక్షిస్తుండగా, పలుమార్లు మీడియా కంటబడింది. తాజాగా, టాటా హ్యారియర్ ఇంటీరియర్ ఫోటోలు లీక్ అయ్యాయి.

టాటా హ్యారీయర్ ఇంటీరియర్ ఫోటోలు లీక్

చాలా వరకు కార్ల కంపెనీలు, తమ నూతన మోడళ్లను రోడ్ల మీద పరీక్షిస్తున్నపుడు డిజైన్ మరియు ఫీచర్లను గుర్తించడానికి వీల్లేకుండా ఎక్ట్సీరియర్ మొత్తాన్ని బ్లాక్ అండ్ వైట్ పేపరుతో పూర్తిగా కప్పేస్తారు. కానీ, టాటా బృందం హ్యారియర్ ఇంటీరియర్‌ను కూడా పూర్తిగా కప్పేసి పరీక్షించింది.

టాటా హ్యారీయర్ ఇంటీరియర్ ఫోటోలు లీక్

టాటా హ్యారియర్‌ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో ఉన్న డ్యాష్‌బోర్డు, స్టీరింగ్ వీల్ మరియు ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏ మాత్రం గమనించడానికి వీల్లేకుండా పూర్తిగా కప్పేశారు. మోనోటోన్ లైటింగ్ గల ఇంస్ట్రుమెంట్ చాలా సింపుల్‌‌గా ఉంది. క్రోమ్ ఫినిషింగ్ గల స్పీడో మీటర్ మరియు ఆర్‌పిఎమ్ మీటర్లను గుర్తించవచ్చు.

టాటా హ్యారీయర్ ఇంటీరియర్ ఫోటోలు లీక్

టాటా హ్యారియర్ ఇంటీరియర్‌లో మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్ల్పే (MID) కలదు. ఇది, ఫ్యూయల్ లెవల్, మైలేజ్, ఓడో మీటర్, ట్రిప్ మీటర్ ఇంకా ఎన్నో వివరాలను చూపిస్తుంది. MID సిస్టమ్ యొక్క వివి ఫంక్షన్స్ యాక్సెస్ చేసుకునేందుకు మోడ్ అండ్ సెటప్ బటన్లు ఉన్నాయి.

టాటా హ్యారీయర్ ఇంటీరియర్ ఫోటోలు లీక్

టాటా హ్యారియర్‌లోని స్టీరింగ్ వీల్ చాలా కొత్తగా ఉంది మరియు స్టీరింగ్ వీల్‌కు ఇరువైపులా పలు రకాల కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్‌కు ఎడమవైపున మ్యూజిక్, బ్లూటూత్, మరియు రిసీవ్ అండ్ ఎండ్ కాల్ బటన్స్ ఉన్నాయి. అదే విధంగా స్టీరింగ్ వీల్ మీద కుడివైపున క్రూయిజ్ కంట్లోల్ బటన్స్ ఉన్నాయి.

టాటా హ్యారీయర్ ఇంటీరియర్ ఫోటోలు లీక్

హ్యారియర్ ఇంటీరియర్‌లో టియాగోలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ లైట్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. ప్రీమియం ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో పలు రకాల అప్లికేషన్స్‌తో అనుంసధానమయ్యే అధునాతన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

టాటా హ్యారీయర్ ఇంటీరియర్ ఫోటోలు లీక్

టాటా మోటార్స్ హ్యారియర్ ప్రీమియం ఎస్‌యూవీని కంపెనీ యొక్క నూతన ఆప్టిమల్ మోడ్యులర్ ఎఫీషియంట్ గ్లోబల్ అడ్వాన్స్‌డ్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. ఈ ఫ్లాట్‌ఫామ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్లాట్‌ఫామ్ యొక్క మోడిఫైడ్ వెర్షన్. సాంకేతికంగా ఇందులో 140బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఫియట్ నుండి సేకరించిన 2.0-లీటర్ డీజల్ ఇంజన్ వస్తోంది.

టాటా హ్యారీయర్ ఇంటీరియర్ ఫోటోలు లీక్

టాటా మోటార్స్ హ్యారియర్ ప్రీమియం ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో విడుదల చేస్తే, విపణిలో ఉన్న జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. హ్యారియర్ ఎస్‌యూవీని 5 లేదా 7 సీటింగ్ లౌఔట్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

టాటా హ్యారీయర్ ఇంటీరియర్ ఫోటోలు లీక్

టాటా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ వెర్షన్ 2.0 ఆధారంగా డిజైన్ చేసిన తొలి మోడల్ టాటా హ్యారియర్. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో హెచ్5ఎక్స్ అనే కోడ్ పేరుతో ఆవిష్కరించిన ఈ ఎస్‌యూవీకి ఇటీవల అధికారికంగా హ్యారియర్ అనే పేరును ఖరారు చేశారు. 2019 మొదటి త్రైమాసికంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ఇది వరకే ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Source: IAB

Most Read Articles

English summary
Read In Telugu: Tata Harrier Interior Spied — Instrument Cluster And Features Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X