జీప్ కంపాస్‌కు ఊహించని సవాల్ విసిరిన టయోటా

టయోటా కిర్లోస్కర్ మోటార్ తమ సీహెచ్ఆర్ క్రాసోవర్ ఎస్‌యూవీని ఇండియా విడుదలకు ఖరారు చేసింది. గత ఏడాది విడుదలైన జీప్ కంపాస్ ఎస్‌యూవీకి ఇది సరాసరి పోటీనివ్వనుంది. టయోటా సీహెచ్ఆర్ ఇండియన్ ప్యాసింజర్ కార్ల ప

By Anil Kumar

ఇండియన్ మార్కెట్లో ఎస్‌యూవీలకు డిమాండ్ నానాటికీ పెరుగుతూనే ఉంది. ఎస్‌యూవీ సామ్రాజ్యం విస్తరించేకొద్దీ ఈ విభాగం కాంపాక్ట్ ఎస్‌యూవీ, 5-సీటర్ మరియు 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ ఇలా పలు విభిన్న కెటగిరీలుగా విడిపోయింది. కార్ల కంపెనీలు కూడా ఆ యా కెటగిరీల వారీగా అంతర్జాతీయ విపణిలో ఉన్న తమ మోడళ్లను దేశీయంగా ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

టయోటా సీహెచ్ఆర్

తాజాగా టయోటా కిర్లోస్కర్ మోటార్ తమ సీహెచ్ఆర్ క్రాసోవర్ ఎస్‌యూవీని ఇండియా విడుదలకు ఖరారు చేసింది. గత ఏడాది విడుదలైన జీప్ కంపాస్ ఎస్‌యూవీకి ఇది సరాసరి పోటీనివ్వనుంది. ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలోకి కొత్త గాలిని తీసుకొస్తున్న టయోటా సీహెచ్ఆర్ గురించి పూర్తి వివరాలు...

టయోటా సీహెచ్ఆర్

ఖరీదైన ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా క్రిస్టా మోడళ్లతో భారీ విజయాన్ని అందుకున్న టయోటా ఇండియా మరో ఖరీదైన క్రాసోవర్ ఎస్‌యూవీతో సెగ్మెంట్ లీడర్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది.

టయోటా సీహెచ్ఆర్

మిడ్ సైజ్ ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో జీప్ కంపాస్ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తోంది. జీప్ కంపాస్ ఇటీవల 25,000 యూనిట్ల సేల్స్ మైలు రాయిని సాధించింది. ఇదే సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ టుసాన్, టాటా హెక్సా మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలు తలపడుతున్నాయి. వీటి లక్ష్యంగా టయోటా సీహెచ్ఆర్ సిద్దం అవుతోంది.

టయోటా సీహెచ్ఆర్

సీహెచ్ఆర్ క్రాసోవర్ ఎస్‌యూవీతో పాటు రష్ ఎస్‌యూవీని కూడా ఇండియన్ మార్కెట్‌కు ప్రతిపాదించింది. వీటిలో సీహెచ్ఆర్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2018 ఆటో ఎక్స్ పోలో పరిచయం కావాల్సి ఉండగా, దీని స్థానంలో మారుతి సియాజ్, హోండా సిటీ మరియు హ్యుందాయ్ వెర్నా కార్లకు పోటీగా యారిస్‌ సెడాన్ కారును తీసుకొచ్చింది.

టయోటా సీహెచ్ఆర్

టయోటా సీహెచ్ఆర్ ఎస్‌యూవీని టయోటా న్యూ జనరేషన్ ఆర్కిటెక్చర్ (TNGA) ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. లో-కాస్ట్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన రష్ ఎస్‌యూవీ కంటే సీహెచ్ఆర్ మోడల్ కాస్త ఖరీదైనది. ధర మరియు పొజిషన్ పరంగా ఇది విపణిలో ఉన్న ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ క్రింది స్థానాన్ని భర్తీ చేస్తుంది.

టయోటా సీహెచ్ఆర్

సీ-హెచ్ఆర్ అంటే, కూపే హై రైడ్ అని అర్థం. కంపెనీ TNGA మీద నిర్మించిన మోడళ్లలో ఇండియాకు వస్తున్న మొదటి మోడల్ ఇదే. టయోటా సీహెచ్ఆర్ ఇండియా విడుదల విషయానికి వస్తే ఇప్పటికీ దీని గురించి టయోటా నుండి ఎలాంటి సమాచారం లేదు.

టయోటా సీహెచ్ఆర్

అయితే, ఇండియాలో ఉన్న ఎస్‌యూవీ ట్రెండ్ మరియు రహస్యంగా అందుతున్న సమాచారం మేరకు, టయోటా కిర్లోస్కర్ మోటార్ 2019-2020 మధ్య కాలంలో రష్ మరియు సీహెచ్ఆర్ ఎస్‌యూవీలను విడుదల చేసే అవకాశం ఉంది.

టయోటా సీహెచ్ఆర్

ఇతర ప్రీమియం మిడ్ సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిచ్చేలా, సీహెచ్ఆర్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో అత్యాధునిక ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లు పరిచయం కానున్నాయి. టయోటా సీహెచ్ఆర్ ధరల శ్రేణి రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

టయోటా సీహెచ్ఆర్

టయోటా సీహెచ్ఆర్ అంతర్జాతీయ విపణిలోకి 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ మరియు 1.8-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది. రెండు ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తున్నాయి.

టయోటా సీహెచ్ఆర్

అయితే, ఇండియన్ వెర్షన్ సీహెచ్ఆర్ ఇంజన్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 148బిహెచ్‌పి పవర్ మరియు 193ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ సివిటి ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Jeep Compass Rival From Toyota
Story first published: Wednesday, June 20, 2018, 13:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X