టయోటా ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

Written By:
Recommended Video - Watch Now!
New Honda Amaze Facelift Auto Expo 2018

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. లిమిటెడ్ ఎడిషన్ ప్లాటినమ్ సెడాన్ విఎక్స్ వేరియంట్లో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభ్యమవుతుంది.

టయోటా ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 7.84 లక్షలు మరియు డీజల్ వేరియంట్ ధర రూ. 8.94 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

టయోటా ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్

కొత్తగా విడుదలైన టయోటా ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్‌‌ను రెగ్యులర్ ఎటియోస్‌తో పోల్చుకుంటే పలు ప్రీమియమ్ ఫీచర్లు వచ్చాయి. లిమిటెడ్ ఎడిషన్ ఎటియోస్‌లో సరికొత్త పెయింట్ స్కీమ్, అదనపు ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్లు, డ్యూయల్ టోన్ సీట్ మరియు అప్‌హోల్‌స్ట్రే వంటివి ఉన్నాయి.

టయోటా ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్

టయోటా ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్ సరికొత్త ఫాంటమ్ బ్రౌన్ కలర్ ఆప్షన్‌ మరియు పర్ల్ వైట్ కలర్ స్టాండర్డ్ మోడల్‌లో లభ్యమవుతోంది. డిజైన్ పరంగా ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

టయోటా ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్

ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌లో ఎక్ట్సీరియర్ బాడీ కలర్‌తో మ్యాచ్ అయ్యే డ్యూయల్ టోన్ అప్‌హోల్‌స్ట్రే మరియు సరికొత్త ప్యాట్రన్‌లో గల ఆర్మ్‌రెస్ట్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో అతి ముఖ్యమైన ఫీచర్ 6.8-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

టయోటా ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్

సరికొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఏయుఎక్స్, యుఎస్‍‌బి, బ్లూటూత్ కనెక్టివిటి, వాయిస్ రికగ్నిషన్ మరియు రిమోట్ కంట్రోల్ వంటి వాటిని సపోర్ట్ చేస్తుంది. అయితే, దీనికి పోటీగా ఎన్నో సెడాన్ కార్లలో స్టాండర్డ్‌గా వచ్చిన ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లు ఇందులో మిస్సయ్యాయి.

టయోటా ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్

సాంకేతికంగా ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్‌ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 132ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టయోటా ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్

అదే విధంగా ఎటియోస్‌లోని 1.4-లీటర్ డీజల్ ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తున్నాయి.

టయోటా ఎటియోస్ ప్లాటినమ్ లిమిటెడ్ ఎడిషన్

డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా కిర్లోస్కర్ ఇండియా ఎటియోస్ ప్లాటినమ్ కాంపాక్ట్ సెడాన్ సేల్స్ పెంచుకోవడానికి పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ అందించి లిమిటెడ్ ఎడిషన్‌గా విపణిలోకి లాంచ్ చేసింది. అదనంగా వచ్చిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగిన మార్పులేమీ జరగలేదు.

ఇటీవల ముగిసిన ఆటో ఎక్స్‌పో 2018లో టయోటా ఆవిష్కరించిన యారిస్ మిడ్ సైజ్ సెడాన్ కారును కూడా అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Toyota Etios Platinum Limited Edition Launched In India; Prices Start At Rs 7.84 Lakh
Story first published: Thursday, March 1, 2018, 13:19 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark