Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బహిర్గతమైన టాటా హారియర్ బ్లాక్ ఎడిషన్ ధర వివరాలు
టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి హారియర్ ఎస్యువి యొక్క బ్లాక్ ఎడిషన్ ను లాంచ్ చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. కొత్త టాటా హారియర్ బ్లాక్ ఎడిషన్ త్వరలో ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి వెళ్లనుంది. ఇండియాలో దీని లాంచ్ కు ముందు ఎస్యువి బ్లాక్ ఎడిషన్ కు సంబంధించిన ధరలు లీకయ్యాయి. ఆ వివరాలు ఇవాల్టి కథనంలో..

ఎస్యువి లైనప్ లోని టాప్-స్పెక్ ఎక్స్ జడ్ వేరియంట్ ను బట్టి టాటా హర్రియర్ బ్లాక్ ఎడిషన్ ను కలిగి ఉంటుంది. ఇది ఒక బ్రాండ్ కొత్త ' ఆల్టాస్ బ్లాక్ ' ఎక్స్ టీరియర్ కలర్ స్కీమ్ తో వస్తుంది. కొత్త బ్లాక్ కలర్ స్కీమ్ కాకుండా, టాటా హారియర్ ఇతర బ్లాక్ ఎలిమెంట్స్ తో పాటు కూడా వస్తుంది.

ఇందులో 17 అంగుళాల బ్లాక్ స్టోన్ అల్లాయ్ వీల్స్, ఇరువైపులా బ్లాక్ స్యుఫ్ ప్లేట్లు మరియు బ్లాక్/గ్రే కలర్ హెడ్ ల్యాంప్ లు ఉంటాయి. అలాగే పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉన్న ఇంటీరియర్ తో హారియర్ కొత్త వేరియంట్ ను కూడా టాటా ఆఫర్ చేస్తుందని ఆశిస్తున్నాం.

హారియర్ బ్లాక్ ఎడిషన్ సీట్ల మీద బ్లాక్ స్టోన్ లెదర్ ను అందజేయాలని భావిస్తున్నారు, గ్రే కలర్ కాంట్రాస్ట్ స్టిచింగ్, గ్రే కలర్ డ్యాష్ బోర్డ్ మరియు ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ మరియు డోర్ ప్యానెల్స్ పై బ్లాక్ లెదర్ ను కూడా అందిస్తున్నాయి.

పైన పేర్కొన్నవి కాకుండా, టాటా హారియర్ బ్లాక్ ఎడిషన్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఎక్స్ జడ్ వేరియంట్ పై చేయబడ్డ అన్ని ఫీచర్లు మరియు ఎక్విప్ మెంట్ ని ఇది కలిగి ఉంటుంది.

ఇందులో 8.8 అంగుళాల టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, స్మార్ట్ ఫోన్ కనెక్టువిటీ, 8-వే ఎలక్ట్రిక్-ఎడ్జెస్టబుల్ డ్రైవర్స్ సీట్, క్రూయిజ్ కంట్రోల్ కలిగి ఉంటుంది.

కొత్త టాటా హారియర్ బ్లాక్ ఎడిషన్ అదే మెకానికల్స్ పరంగా స్టాండర్డ్ ఎస్యువి వేరియెంట్స్ గా ఉంటుంది. ఇందులో 2.0-లీటర్ ' క్రయోటెక్ ' డీజల్ ఇంజన్ కలదు. టీమ్-బిహెచ్పి నుంచి అందిన నివేదికల ప్రకారం టాటా హారియర్ బ్లాక్ ఎడిషన్ రూ.16.75 లక్షలు, ఎక్స్ షోరూమ్ ధర ట్యాగ్ తో రావాల్సి ఉంది.
Most Read: హ్యాపీ బర్త్ డే సైరా! చిరంజీవి కార్లు, కొన్ని ఆసక్తికరమైన నిజాలు!

ఇది 143 బిహెచ్పి మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఆరు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటుంది. మరింత ఎక్కువ వినియోగదారులను ఆకర్షించడానికే టాటా హారియర్ బ్లాక్ ఎడిషన్ పరిచయం చేయనుంది.
Most Read: ' డ్రైవర్ లెస్ ' కారు లో క్రికెట్ గాడ్

ఎంజి హెక్టర్ మరియు కియా సెల్టోస్ పై పెరుగుతున్న పోటీ తో, టాటా మరింత స్పోర్టివ్ వేరియంట్ తో వారి ప్రత్యర్థులను ఓడించాలని ఆశతో ఉంది.
Most Read: మీ వాహనంపై ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉంటే జాగ్రత్త..!

టాటా హారియర్ బ్లాక్ ఎడిషన్ కాకుండా, భారత మార్కెట్లో హారియర్ కు చెందిన సెవెన్ సీటర్ వర్షన్ ను కూడా పరిచయం చేసే పనిలో ఉంది. సెవెన్ సీటర్ అయిన టాటా హారియర్ ను ' క్యాసిని ' అని పేరు పెట్టనుంది.

2020 ఆటో ఎక్స్ పోలో దీనిని ప్రారంభించాల్సి ఉంది. కొత్త టాటా క్యాసిని పై ఆటోమేటిక్ గేర్ బాక్స్ ని కూడా తీసుకొస్తుంది. హారియర్ అనే పెట్రోల్ వెర్షన్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టనున్నట్లు కూడా రిపోర్టులు వచ్చాయి.
Source: Team Bhp
Image Courtesy: Autocarindia