సంచలన నిజం: సేఫ్టీ టెస్టుల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300కు 5-స్టార్ రేటింగ్

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లోకి కార్ల కంటే ఎక్కువగా ఎస్‌యూవీలే విక్రయిస్తోంది. పవర్‌ఫుల్ ఇంజన్ మరియు ఎక్కువ ప్రయాణించేలా సీటింగ్ లేఔట్ వీటి ప్రత్యేకం. అయితే, ఇప్పటి వరకు ఎన్నో మోడళ్లకు క్రాష్ టెస్ట్ నిర్వహించిన మహీంద్రా ప్రతిసారీ నిరుత్సాహపరించింది. ఈ సారి మహీంద్రా కూడా ఆశ్చర్యపోయే విధంగా మహీంద్రా ఎక్స్‌యూవీ300 మోడల్ అంతర్జాతీయ సేఫ్టీ పరీక్షల్లో ఏకంగా 5-స్టార్ రేటింగ్ సాధించింది సంచలన సృష్టించింది.

సంచలన నిజం: సేఫ్టీ టెస్టుల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300కు 5-స్టార్ రేటింగ్

ఇప్పటి వరకూ సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ పొందిన మేడిన్ ఇండియా కార్లు రెండే రెండు.. రెండూ కూడా టాటా మోటార్స్‌కు చెందినవే.. అందులో ఒకటి టాటా నెక్సాన్ మరొకటి టాటా ఆల్ట్రోజ్. అయితే, వీటి సరసన మరో మోడల్ మహీంద్రా ఎక్స్‌యూవీ300 కూడా వచ్చి చేరింది.

సంచలన నిజం: సేఫ్టీ టెస్టుల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300కు 5-స్టార్ రేటింగ్

ఇటీవల గ్లోబల్ ఎన్సీఏపీ (NCAP - న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం) ఆధ్వర్యంలో జరిపిన క్రాష్ టెస్టుల్లో మహీంద్రా 17కు గాను 16.42 పాయింట్లు సాధించింది. ఇదే రౌండ్‌లో టాటా ఆల్ట్రోజ్ 16.13 మరియు టాటా నెక్సాన్ 16.06 పాయింట్లు సాధించాయి.

సంచలన నిజం: సేఫ్టీ టెస్టుల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300కు 5-స్టార్ రేటింగ్

ఇప్పటి వరకూ మహీంద్రా నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ పొందిన ఏకైక మోడల్ మహీంద్రా ఎక్స్‌యూవీ300. పెద్దల భద్రత పరంగా 5-స్టార్ మరియు చిన్న పిల్లల భద్రత పరంగా 4-స్టార్ రేటింగ్ సాధించింది. ఈ కెటగిరీలో ఎక్స్‌యూవీ300 మోడల్ 49కి గాను 37.44 పాయింట్లు, నెక్సాన్ 25 మరియు ఆల్ట్రోజ్ 29 పాయింట్లు సాధించాయి.

సంచలన నిజం: సేఫ్టీ టెస్టుల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300కు 5-స్టార్ రేటింగ్

మహీంద్రా ఎక్స్‌యూవీ300 మోడల్‌ను ఢీకొట్టించి నిర్వహించిన పరీక్షల్లో ప్రమాద తీవ్రత కారు మీద చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. NCAP ఆధ్వర్యంలో ఇండియన్ కార్లకు నిర్వహించిన సైడ్-ఇంపాక్ట్ క్రాష్ టెస్టులో చాలా వరకూ ఫెయిల్ అయ్యాయి. కానీ మహీంద్రా ఎక్స్‌యూవీ300 అద్భుతమైన ధృడత్వాన్ని కనబరిచింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో సేఫ్టీ పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సైడ్ ఇంపాక్ట్ ఎయిర్ బ్యాగులు వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా అన్ని వేరియంట్లలో అందించారు. ప్రమాదం జరిగినపుడు ప్రయాణికుల ఛాతీ మీద కలిగే ప్రమాద తీవ్రత చాలా తక్కువగా నమోదైనట్లు వెల్లడించారు.

సంచలన నిజం: సేఫ్టీ టెస్టుల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300కు 5-స్టార్ రేటింగ్

సైడ్-ఇంపాక్ట్ క్రాష్ టెస్టు జరిపినపుడు వెనుక సీట్లలో చిన్న పిల్లల డమ్మీని కూర్చోబెట్టారు. వీటికి కూడా అత్యుత్తమ భద్రత కల్పించడంలో మహీంద్రా సఫలమైంది. అయితే 3-పాయింట్ చైల్డ్ సీట్ యాంకర్స్ లేకపోవడంతో పిల్లల సేఫ్టీ పరంగా ఐదింటికి నాలుగు స్టార్ల రేటింగే లభించిందని గ్లోబల్ ఎన్సీఏపీ ప్రతినిధులు పేర్కొన్నారు.

సంచలన నిజం: సేఫ్టీ టెస్టుల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300కు 5-స్టార్ రేటింగ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంతో కాలంగా సేఫ్టీ పరీక్షల్లో విఫలమైన మహీంద్రా ఎట్టకేలకు తమ మహీంద్రా ఎక్స్‌యూవీ300 మోడల్‌ సాధించిన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో సక్సెస్ సాధించింది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ మేడిన్ ఇండియా కార్ల సరసన మహీంద్రా ఎక్స్‌యూవీ300 చోటు సంపాదించింది. మీరు కనుక మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీని కొనాలనుకుంటే నిశ్చింతగా ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Mahindra XUV300 Scores 5 Stars Rating In Global NCAP Crash Test Result. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X