మెర్సిడెస్ బెంజ్ విడుదలచేయనున్న ఎలక్ట్రిక్ కార్ : ఇక్యూసి

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఇక్యూసి ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి ఎలక్ట్రిక్ కారు పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మెర్సిడెస్ బెంజ్ విడుదలచేయనున్న ఎలక్ట్రిక్ కార్ : ఇక్యూసి

కరోనా వైరస్ అత్యధికంగా వ్యాపిస్తున్న కారణంగా అనేక కార్ల తయారీదారులు తమ సిరీస్ కార్ల విడుదలను వాయిదా వేశారు. అయితే లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసీ ఎలక్ట్రిక్ కారు విడుదలను వచ్చే ఏడాది వరకు వాయిదా వేయబోమని స్పష్టం చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది భారతదేశంలో లాంచ్ అవుతుందని ధ్రువీకరించారు.

మెర్సిడెస్ బెంజ్ విడుదలచేయనున్న ఎలక్ట్రిక్ కార్ : ఇక్యూసి

దేశీయ మార్కెట్లో లగ్జరీ కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ కార్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అంతే కాకుండా ఇప్పుడు మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కార్లను కూడా అభివృద్ధి చేస్తోంది.

MOST READ:లాక్‌డౌన్ లో ఇల్లుచేరుకోవడానికి 3 లక్షలు పైగా ఖర్చుపెట్టిన వ్యక్తి, ఎలా వెళ్ళాడో తెలుసా ?

మెర్సిడెస్ బెంజ్ విడుదలచేయనున్న ఎలక్ట్రిక్ కార్ : ఇక్యూసి

మెర్సిడెస్ బెంజ్ తన ఇక్యూసి ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో ఆవిష్కరించింది, కంపెనీ ఇక్యూసి బ్రాండ్ కింద పలు కార్లను విక్రయించనుంది. మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కూడా ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేయడం వైపు అడుగులు వేస్తోంది.

మెర్సిడెస్ బెంజ్ విడుదలచేయనున్న ఎలక్ట్రిక్ కార్ : ఇక్యూసి

ఆడి కంపెనీ తమ ఎలక్ట్రిక్ కార్లు ఎప్పుడు విడుదలవుంటాయని విషయాన్ని గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. మెర్సిడెస్ బెంజ్ తన ఇక్యూసి ఎలక్ట్రిక్ కారును 2016 పారిస్ మోటార్ షోలో ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా ఆవిష్కరించింది.

MOST READ:ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతగా ఆకాశంలో హార్ట్ వేసిన పైలెట్

మెర్సిడెస్ బెంజ్ విడుదలచేయనున్న ఎలక్ట్రిక్ కార్ : ఇక్యూసి

ఇటీవల కాలంలో మెర్సిడెస్ బెంజ్ పలు రకాల ఎలక్ట్రిక్ కార్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది. ఇక్యూసి ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సిపై ఆధారపడింది. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటారు 402 బిహెచ్‌పి శక్తి మరియు 760 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ విడుదలచేయనున్న ఎలక్ట్రిక్ కార్ : ఇక్యూసి

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి కారులో 80 కిలోవాట్ల బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో దాదాపు 400 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. కారు కేవలం 5.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 180 కి.మీ.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : ఇతరులు తమ రాష్ట్రంలోకి రాకుండా రోడ్డుపైనే గోడ నిర్మాణం

మెర్సిడెస్ బెంజ్ విడుదలచేయనున్న ఎలక్ట్రిక్ కార్ : ఇక్యూసి

ఇక్యూసి కారు విడుదలైన తరువాత, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ ఎలక్ట్రిక్ లగ్జరీ ఎస్‌యూవీ, వి-క్లాస్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. కంపెనీ తన ప్రసిద్ధ ఎస్ క్లాస్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయనుంది. జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ త్వరలో తన ఇక్యూసి ఎలక్ట్రిక్ కారును భారత్‌లో విడుదల చేయనుంది. ఈ లగ్జరీ కారు కోసం వినియోగదారులు ఇంకా కొంతకాలం వేచి ఉండక తప్పదు.

Most Read Articles

English summary
Mercedes EQC Launch Unaffected By The Coronavirus Crisis. Read in Telugu.
Story first published: Wednesday, April 29, 2020, 10:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X