ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ నుండి భారత మార్కెట్‌కు వస్తున్న నాల్గవ ఉత్పత్తి ఎమ్‌జి గ్లోస్టర్‌కు సంబంధించి కంపెనీ తాజాగా మరిన్ని ఇతర వివరాలను వెల్లడించింది. మరికొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ ప్రీమియం ఎస్‌యూవీ అంచనా ధరతో పాటుగా, ఇందులో అనేక ఏఐ-ఆధారిత డ్రైవర్ సహాయక ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, భారత మార్కెట్లో కొత్త 2020 ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా వేసింది. ఈ ప్రీమియం ఎస్‌యూవీలో ‘ఫెటీగ్ రిమైండర్ సిస్టమ్' (అలసట రిమైండర్ సిస్టమ్) కూడా ఉంటుందని, ఇది డ్రైవర్ వాహనాన్ని ఎక్కువ సమయం నడుపుతున్నప్పుడు స్వల్ప విరామం తీసుకోవాల్సిందిగా అతడిని అప్రమత్తం చేస్తుందని కంపెనీ తెలిపింది.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

ఈ కారులోని ఫెటీగ్ రిమైండర్ సిస్టమ్‌ను సాంప్రదాయ టైమర్ ద్వారా కాకుండా బ్రాండ్ యొక్క ఏఐ (అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సు) సహాయంతో పనిచేస్తుంది. స్టీరింగ్ ఇన్‌పుట్ ఆధారంగా చేసుకొని ఇందులోని ఏఐ అసిస్టెన్స్ సిస్టమ్ డ్రైవర్‌ను హెచ్చరిస్తుందని కంపెనీ వివరించింది.

MOST READ:ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అక్కడ వాటర్ టాక్సీ సర్వీస్.. ఎక్కడో తెలుసా ?

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

గ్లోస్టర్ ఎస్‌యూవీలో ఫెటీగ్ రిమైండర్‌తో పాటుగా, ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో కనిపించే విధంగా ఈ ఎస్‌యూవీ బూట్‌ని తెరవడానికి స్మార్ట్ స్వైప్ గెశ్చర్ కూడా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. రెండు చేతులతో సామాను పట్టుకొని, బూట్‌ని ఓపెన్ చేయటం కోసం బటన్‌ను నొక్కలేకపోతున్నప్పుడు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంలో, బూట్ ఓపెన్ చేయటానికి వెనుక బంపర్ క్రింది భాగంలో కాలును స్వైప్ చేయవలసి ఉంటుంది.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

ఇందులోని త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరొక విశిష్టమైన ఫీచర్ అని ఎమ్‌జి మోటార్ తెలిపింది. దీని సాయంతో డ్రైవర్, కో-డ్రైవర్ మరియు వెనుక సీటు ప్రయాణీకులు వారికి తగినట్లుగా కారులోని ఉష్ణోగ్రతలను సెట్ చేసుకోవచ్చు. వెనుక సీటు ప్రయాణికుల కోసం టెంపరేచర్ కంట్రోల్స్ వెనుక సెంటర్ కన్సోల్‌పై అమర్చబడి ఉంటాయి.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

గ్లోస్టర్ ఎస్‌యూవీతో 2020 సంవత్సరంలో అతిపెద్ద లాంచ్‌కు ఎమ్‌జి మోటార్స్ సన్నద్ధమవుతోంది. భారత మార్కెట్లో దీపావళి (నవంబర్) పండుగ సందర్భంగా ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. ఎమ్‌జి గ్లోస్టర్ ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా విడుదల కానుంది.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

గ్లోస్టర్ ఎస్‌యూవీలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసినప్పుడు వాహనం ముందు వెళ్తున్న కారు వేగం తగ్గినట్లయితే, డ్రైవర్ ప్రమేయం లేకుండానే గ్లోస్టర్ వేగం కూడా తగ్గుతుంది. అలాగే, ముందు వెళ్తున్న కారు వేగాన్ని పుంజుకుంటే, గ్లోస్టర్‌లో ఇదివరకు సెట్ చేసిన వేగానికి ఆటోమేటిక్‌గా చేరుకుంటుంది. స్టీరింగ్ వీల్‌పై అమర్చిన బటన్ల సాయంతో కూడా ఈ ఫీచర్‌ను మ్యాన్యువల్‌గా కంట్రోల్ చేయవచ్చు.

MOST READ:బిఎండబ్ల్యు సూపర్ బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా.. ఈ బైక్ ఎలా ఉందో మీరే చూడండి

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

ఎమ్‌జి మోటార్స్ ఇటీవలే గ్లోస్టర్‌కు సంబంధించి ఓ టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది, ఇందులో గ్లోస్టర్ యొక్క హై-ఎండ్ డ్రైవర్-అసిస్టెడ్ లెవల్ 1 అటానమస్ సిస్టమ్‌ను హైలైట్ చేసింది. ఈ టీజర్ వీడియోలో, డ్రైవర్ చాలా తక్కువ ప్రయత్నంతో ఆటో పార్క్ అసిస్ట్‌ను ఉపయోగించి పెద్ద గ్లోస్టర్ ఎస్‌యూవీని విజయవంతంగా పార్క్ చేయటాన్ని చూడొచ్చు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

ఇంకా ఇందులో ఆటో పార్కింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో బ్రేకింగ్, కొల్లైజన్ అవైడెన్స్ సిస్టమ్ వంటి యాక్టివ్ మరియు ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. గ్లోస్టర్ ఎస్‌యూవీలో బ్రాండ్ యొక్క అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడిఏఎస్)ను కలిగి ఉంటుంది.

MOST READ:700 కి.మీ ప్రయాణించినా పరీక్ష రాయడానికి నిరాకరించబడిన విద్యార్థి.. కారణం ఏంటో తెలుసా

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్‌తో లభ్యం కావచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 215 బిహెచ్‌పి పవర్ మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో జతచేయబడి ఉంటుంది.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో ఆన్-డిమాండ్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేయనున్నారు. ఇందులో ఆటో, ఎకో, స్పోర్ట్, స్నో, మడ్, శాండ్ అండ్ రాక్ అనే వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి. వీటిని నియంత్రించడానికి రోటరీ నాబ్‌తో కూడిన కంట్రోల్‌ను కూడా ఇందులో అమర్చారు. ఈ కారులో బ్రాండ్ యొక్క టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ కూడా లభిస్తుంది.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర ఎంత ఉండొచ్చో తెలుసా?

ఎమ్‌జి గ్లోస్టర్ అంచనా ధర, కొత్త ఫీచర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇప్పటి వరకూ ప్యాసింజర్ కార్ల విభాగంలో తన సత్తా చాటిన ఎమ్‌జి మోటార్స్ ఇప్పుడు భారత లగ్జరీ కార్ మార్కెట్‌పై కన్నేసింది. ఈ విభాగంలో ఈ తరహా హై-ఫై ఫీచర్లు కలిగిన ఇతర బ్రాండ్‌ల లగ్జరీ కార్ల ధరలు అత్యధికంగా ఉంటే, ఎమ్‌జి మోటార్స్ మాత్రం సుమారు రూ.45 లక్షల ధరతో ఎమ్‌జి గ్లోస్టర్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఎమ్‌జి మోటార్స్ ఈ పోటీతత్వ ధరతో లగ్జరీ కార్ విభాగంలోని బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి బ్రాండ్‌లకు చెమటలు పట్టించే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
MG Motor India has revealed a couple of important details of the upcoming Gloster premium SUV in the country. The revealed details include the price expectation and new AI-assisted features of the Gloster. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X