విడుదలకు సిద్ధమవుతున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ

చైనా కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ భారత్‌లో మరో కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న హెక్టర్ ఎస్‌యూవీలో ఓ పొడవాటి వెర్షన్‌ను ఎమ్‌జి మోటార్స్ డెవలప్ చేస్తోంది. దీనిని 'ఎమ్‌జి హెక్టర్ ప్లస్' (MG Hector Plus) అనే పేరుతో మార్కెట్లో విడుదల చేయనున్నారు.

విడుదలకు సిద్ధమవుతున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ పేరుకు తగినట్లుగానే మరిన్ని అదనపు ఫీచర్లతో ప్రత్యేకించి అదనపు సీటింగ్ కెపాసిటీతో మార్కెట్లోకి రానుంది. తాజాగా.. హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీకి సంబంధించిన చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. స్టారీ స్కై బ్లూ అనే కొత్త కలర్ ఆప్షన్‌తో ఈ పొడవాటి ఎస్‌యూవీ వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విడుదలకు సిద్ధమవుతున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ

ఎమ్‌జి మోటార్స్ అధికారిక సోషల్ మీడియా పేజ్‌లో హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ లాంచ్ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కంపెనీ ఈ విషయాన్ని ఖరారు చేసింది. కొత్త హెక్టర్ ప్లస్‌కి సంబంధించి కంపెనీ ఇప్పటికే ఓ కమర్షియల్ ప్రకటను కూడా చిత్రీకరిస్తోంది. ఈ చిత్రాల్లో ఆ కమర్షియల్ ప్రకటను షూటింగ్ దృశ్యాలను చూడొచ్చు.

MOST READ: స్పోర్ట్స్ కారు రూపం దాల్చిన మారుతి 800 కార్

విడుదలకు సిద్ధమవుతున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ

గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ఎమ్‌జి మోటార్స్ తమ సరికొత్త హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీతో పాటుగా మరికొన్ని మోడళ్లను కూడా ప్రదర్శనకు ఉంచింది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ దశలో పలుమార్లు కెమెరాకు చిక్కింది. ఈ నేపథ్యంలో హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీకి సంబంధించిన కొన్ని ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి.

విడుదలకు సిద్ధమవుతున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ

ఇది వరకు చెప్పుకున్నట్లుగానే ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న హెక్టర్ ఎస్‌యూవీని పొడగించి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు. హెక్టర్ మోడల్‌లో రెండు వరుసల సీట్లు (5 సీట్లు) మాత్రమే ఉంటాయి. అయితే, హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో మూడవ వరుస సీట్లను జోడించి 6-సీటర్ లేదా 7-సీటర్ ఆప్షన్‌తో విడుదల చేసే అవకాశం ఉంది. హెక్టర్‌తో పోల్చుకుంటే హెక్టర్ ప్లస్ పొడవు 40 ఎమ్.ఎమ్. ఎక్కువగా ఉంటుంది. అయితే, వీల్‌బేస్‌లో మాత్రం ఈ రెండు మోడళ్లలో ఎలాంటి మార్పు ఉండదు.

MOST READ: సైకిల్ ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ?

విడుదలకు సిద్ధమవుతున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ

స్టాండర్డ్ హెక్టర్ మోడల్‌పై ఎక్కువగా క్రోమ్ ఫినిష్ ఉంటుంది. అయితే, ఈ హెక్టర్ ప్లస్‌లో మాత్రం ఎక్కువగా బ్లాక్ కలర్ గ్లాసీ ఫినిష్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ చుట్టూ ఈ మార్పు గమనించవచ్చు. అంతేకాకుండా, ఈ కొత్త చిత్రాలను చూస్తుంటే హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్ క్లస్టర్, వెనుక బూట్ లిడ్‌పై రెడ్ రిఫ్లెక్టర్ స్ట్రిప్ వంటి మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది.

విడుదలకు సిద్ధమవుతున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ

ఇంటీరియర్స్‌లో సీటింగ్ ఆప్షన్ మినహా హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలలో పెద్దగా మార్పులేవీ ఉండబోవని తెలుస్తోంది. హెక్టర్‌లో ఉపయోగించిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 7-ఇంచ్ సెమీ-డిజిటలల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పానరోమిక్ సన్‌రూఫ్, ఈ బ్రాండ్‌కి 'iSmart' కనెక్టివిటీ టెక్నాలజీ ఫీచర్లను హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో కూడా ఆఫర్ చేయనున్నారు.

MOST READ: త్వరలో నిలిపివేయనున్న మహీంద్రా గ్రూప్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎందుకో తెలుసా ?

విడుదలకు సిద్ధమవుతున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ రెండు సీటింగ్ ఆప్షన్లతో రావచ్చని సమాచారం. రెండవ వరుసలో కెప్టెన్ సీట్లను జోడించి, వెనుక మూడవ వరుసలో 2 సీట్లను కలిపి మొత్తం 6-సీట్లతో ఒక వెర్షన్‌ను ఆఫర్ చేయనున్నారు. ఇక రెండవ ఆప్షన్‌గా 2+3+2 సీటింగ్‌తో ఓ స్టాండర్డ్ 7-సీటర్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనున్నారు. హెక్టర్‌లో ఉన్న ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి అన్ని సేఫ్టీ ఫీచర్లు ఇందులో కూడా లభ్యం కానున్నాయి.

విడుదలకు సిద్ధమవుతున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ

ఇంజన్ విషయానికి వస్తే హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో హెక్టర్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్లనే ఉపయోగించనున్నారు. ఫలితంగా పెర్ఫార్మెన్స్‌లో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. హెక్టర్‌లోని 1.5 లీటర్ పెట్రోల్ టర్బో ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 173 బిహెచ్‌పిల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: కరోనా ఎఫెక్ట్ : విమానాశ్రయాలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఉబర్, ఎందుకంటే ?

విడుదలకు సిద్ధమవుతున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ

పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో పాటుగా ఇందులో ఓ ఆప్షనల్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తాయి. పెట్రోల్ వెర్షన్‌లో ఆప్షనల్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది.

విడుదలకు సిద్ధమవుతున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇటీవలే భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్ తమ మొట్టమొదటి మోడల్ అయిన హెక్టర్‌తో ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో మంచి బ్రాండ్ ఇమేజ్‌ని సంపాధించుకుంది. హెక్టర్ లుక్‌లో ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కోరుకునే వారికి హెక్టర్ ప్లస్ ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది. ఎమ్‌జి మోటార్స్ ప్రస్తుతం భారత మార్కెట్లో రెండు మోడళ్లను (హెక్టర్, జిఎస్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ) మాత్రమే విక్రయిస్తోంది. హెక్టర్ ప్లస్ భారత్‌లో కంపెనీ మూడవ మోడల్ కానుంది.

IMAGES:carandbike

Most Read Articles

English summary
MG Motor India is all geared up to launch the Hector Plus SUV in India. Ahead of its launch, the upcoming SUV has been spotted in a new paint scheme called 'Starry Sky Blue'. The company is expected to launch the Hector Plus sometime in the next month. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X