Just In
Don't Miss
- Sports
Brisbane Test: పాపం శుభమన్ గిల్.. తృటిలో సెంచరీ మిస్!!
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- Movies
క్రాక్ డిజిటల్ రైట్స్.. మాస్ రాజా సత్తా ఏంటో మరోసారి రుజువయ్యింది
- News
నెల్లూరు ఎస్పీపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న బూతుపురాణం- అట్రాసిటీ కేసు పెట్టలేదని- తీవ్రవ్యాఖ్యలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కోయంబత్తూర్‌లో తొలి సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్‌జి
చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ కోయంబత్తూర్‌లో తమ తొలి 60 కిలోవాట్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ ఈవీ స్టేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఎమ్‌జి మోటార్స్ దేశంలో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి టాటా పవర్‌తో కుదుర్చున్న ఓ అవగాహన ఒప్పందంలో భాగంగా, కోయంబత్తూర్‌లోని ఎమ్‌జి డీలర్‌షిప్‌లో ఈ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ ఈవీ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌లను CCS / CHAdeMO ఫాస్ట్ ఛార్జింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అన్ని ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఉపయోగించవచ్చు మరియు ఇది 5-వే ఛార్జింగ్ పర్యావరణ వ్యవస్థను అందించడానికి ఎమ్‌జి బ్రాండ్ యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది.

టాటా పవర్ ఈజీ ఛార్జ్ బ్రాండ్ క్రింద 26 వేర్వేరు నగరాల్లో 270కి పైగా ఛార్జింగ్ పాయింట్లతో విస్తృతమైన ఈవీ ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్‌ను సులభతరం చేయడానికి కంపెనీ బలమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా అందిస్తోంది.
MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

ఈ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌లో ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కస్టమర్లు తమ ఎస్‌యూవీని కేవలం 50 నిమిషాల్లోనే 80 శాతం వరకు చార్జ్ చేసుకోవ్చచు. ఎమ్‌జి జిఎస్ కారు కోసం కంపెనీ ఇతర ఛార్జింగ్ ఆప్షన్లు కూడా అందిస్తోంది. ఇందులో కస్టమర్ ఇంటి వద్ద లేదా ఆఫీస్ వద్ద ఉచిత ఏసి ఫాస్ట్ ఛార్జర్ ఇన్‌స్టాలేషన్, ఎక్స్‌టెండెడ్ ఛార్జింగ్ నెట్‌వర్క్, ఎక్కడైనా ఛార్జ్ చేయడానికి ఒక కేబుల్ మరియు రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో కూడిన ఛార్జ్-ఆన్-ది-గో మొదలైనవి ఉన్నాయి.

ఎమ్‌జి జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీ విషయానికి వస్తే, జనవరి 2020లో ఇది భారత మార్కెట్లో విడుదలైంది. ఇది ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ వేరియంట్ (ఎక్సైట్) ధర రూ.20.88 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ (ఎక్స్‌క్లూజివ్) ధర రూ.23.58 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.
MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

ఎమ్‌జి జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీలో 3-ఫేజ్ పర్మినెంట్ మాగ్నెట్ 44.5 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 141 బిహెచ్‌పి పవర్‌ను మరియు 353 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జీపై గరిష్టంగా 340 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 8.5 సెకండ్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

ఎమ్‌జి మోటార్స్ తమ జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన ఏడాది కాలంలోనే 1,100 యూనిట్లకు పైగా విక్రయించింది. ప్రైవేటుగా రిజిస్టర్ చేయబడిన ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కార్ల కోసం "ఇషీల్డ్" ప్యాకేజ్ లభిస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ కారుపై అపరిమిత కిలోమీటర్లకు గానూ 5 సంవత్సరాల ఉచిత తయారీదారు వారంటీ, బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1,50,000 కిమీ వారంటీ మరియు 5 సంవత్సరాల పాటు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ) ఆఫర్లు ఉన్నాయి.
MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

దేశవ్యాప్తంగా పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు మెరుగైన సౌలభ్యం మరియు యాజమాన్యాన్ని సులభతరం చేయడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎమ్‌జి మోటార్స్ ఏర్పాటు చేసిన ఈ సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ కేవలం ఎమ్‌జి ఎలక్ట్రిక్ కార్ల కోసం మాత్రమే కాకుండా, అన్ని బ్రాండ్ల ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడ చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.