విడుదలై నెల కూడా కాలేదు, అప్పుడే రూ.46,000 పెరిగిన హెక్టర్ ప్లస్ ధర!

ఎమ్‌జి మోటార్ ఇండియా ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన తమ సరికొత్త ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ ధరలను కంపెనీ భారీగా పెంచింది. ఎమ్‌జి హెక్టర్ ప్లస్ సిక్స్ సీటర్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.13.74 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. విడుదల సమయంతో పోల్చుకుంటే, దీని ప్రారంభ ధర కన్నా ఇది రూ.25,000 అధికంగా ఉంది.

విడుదలై నెల కూడా కాలేదు, అప్పుడే రూ.46,000 పెరిగిన హెక్టర్ ప్లస్ ధర!

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లోని అన్ని వేరియంట్ల ధరలను కంపెనీ రూ.5000 నుండి రూ.46,000 మధ్యలో పెంచింది. ప్రస్తుతం మార్కెట్లో హెక్టర్ ప్లస్ స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఆరు సీట్ల కాన్ఫిగరేషన్‌తో లభ్యమయ్యే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ ధరలు ఇప్పుడు రూ.13.74 లక్షల నుండి రూ.18.69 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

విడుదలై నెల కూడా కాలేదు, అప్పుడే రూ.46,000 పెరిగిన హెక్టర్ ప్లస్ ధర!

వేరియంట్ల వారీగా పెరిగిన ధరలను దిగువ ఇవ్వబడ్డాయి. ఈ ధరల పట్టికను గమనిస్తే, పెట్రోల్‌తో నడిచే బేస్ వేరియంట్ 'స్టైల్' మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ధర సుమారు రూ.25,000 మరియు ఆటోమేటిక్ ధర రూ.5,000 మేర పెరిగింది. కాగా, బేస్ వేరియంట్ డీజిల్ వెర్షన్ ధర గరిష్టంగా రూ.46,000 పెరిగి రూ.14.44 లక్షల నుండి రూ.14.90 లక్షలకు చేరుకుంది.

Variant Hector Plus Launch Price Hector Plus New Price Difference
Style (1.5P MT) ₹13.49 Lakh ₹13.74 Lakh ₹25,000
Smart (1.5P AT) ₹16.65 Lakh ₹16.70 Lakh ₹5,000
Sharp (1.5P AT) ₹18.21 Lakh ₹18.36 Lakh ₹15,000
Sharp (1.5P-Hybrid MT) ₹17.29 Lakh ₹17.39 Lakh ₹10,000
Style (2.0D MT) ₹14.44 Lakh ₹14.90 Lakh ₹46,000
Super (2.0D MT) ₹15.65 Lakh ₹15.70 Lakh ₹5,000
Smart (2.0D MT) ₹17.15 Lakh ₹17.20 Lakh ₹5,000
Sharp (2.0D MT) ₹18.54 Lakh ₹18.69 Lakh ₹15,000

MOST READ: భారత్‌లో సియట్ అరోనా ఎస్‌యూవీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడల్ టెస్టింగ్

విడుదలై నెల కూడా కాలేదు, అప్పుడే రూ.46,000 పెరిగిన హెక్టర్ ప్లస్ ధర!

మిడ్-స్పెక్ 'సూపర్' మరియు 'స్మార్ట్ 'వేరియంట్ల ధరలు స్వల్పంగా రూ.5,000 పెరుగుదలను నమోదు చేసుకోగా, టాప్-ఎండ్ 'షార్ప్' వేరియంట్ ధరలు రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య పెరిగాయి.

విడుదలై నెల కూడా కాలేదు, అప్పుడే రూ.46,000 పెరిగిన హెక్టర్ ప్లస్ ధర!

భారత మార్కెట్లో ఎమ్‌జి హెక్టర్ ప్లస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ 140 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 170 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. అయితే, పెట్రోల్ ఇంజన్ మాత్రం ఆప్షనల్ 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తుంది.

MOST READ: సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

విడుదలై నెల కూడా కాలేదు, అప్పుడే రూ.46,000 పెరిగిన హెక్టర్ ప్లస్ ధర!

ఎమ్‌జి మోటార్స్ అందిస్తున్న హెక్టర్ మిడ్-సైజ్ ఎస్‍యూవీకి పొడగించబడిన వెర్షనే ఈ ఎమ్‌జి హెక్టర్ ప్లస్. ఇది ఆరు సీట్ల కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది. స్టాండర్డ్ హెక్టర్‌తో పోల్చుకుంటే, హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో కొద్దిపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. కంపెనీ ఇందులో మరో కొత్త 7-సీటర్ వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

విడుదలై నెల కూడా కాలేదు, అప్పుడే రూ.46,000 పెరిగిన హెక్టర్ ప్లస్ ధర!

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రారంభ ఆఫర్లలో భాగంగా కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ ఈ మోడల్‌ను కాస్తంత తక్కువ ధరకే మార్కెట్లో విడుదల చేసినట్లుగా అనిపిస్తోంది. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీని అందించే పరిచయ కాలం ముగిసిన నేపథ్యంలో, కంపెనీ దీని ధరలను అమాంతం పెంచి వేసింది. కొత్త ఎమ్‌జి హెక్టర్ ప్లస్ భారత మార్కెట్లో టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

Most Read Articles

English summary
MG Motor India has increased the prices of its latest offering, the Hector Plus in the market. The MG Hector Plus six-seater SUV is now offered with a price tag starting at Rs 13.74 lakh, which is Rs 25,000 more than its price at the time of launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X