ఫిబ్రవరి 2020 న భారతదేశంలో కొత్త A8 L ను ప్రారంభించనున్న ఆడి!
జర్మనీ ఆటోమొబైల్ సంస్థ అయిన ఆడి బ్రాండ్ నుంచి చాలా లగ్జరీ కార్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇప్పుడు 2020 ఫిబ్రవరి న మనదేశంలోకి కొత్త A8 L ని ప్రారంభించడానికి ఆడి సిద్ధమవుతోంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

ఆడి నుంచి కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న ఎ8 ఎల్ కారు సంస్థ యొక్క పోర్ట్‌ఫోలియో నుండి వచ్చిన ప్రధాన లగ్జరీ సెడాన్. ఇది కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో ఉంది. ఇప్పుడు 2020 ఫిబ్రవరి 3 న మన దేశంలో A8 L ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.

నాల్గవ తరం A8 L విడబ్ల్యు గ్రూప్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంది. ఈ కారు మునుపటి తరం కంటే తేలికైనదిగా ఉంటుంది. అదేవిధంగా కొత్త A8 L పాత మోడల్ కంటే పొడవుగా మరియు కొంచెం వెడల్పుగా ఉంటుంది. దీని పొడవు 5,302 మిమీ, వెడల్పు 1,945 మిమీ, 1,488 మిమీ ఎత్తు, మరియు 3,128 మిమీ వీల్ బేస్ కలిగి ఉంటుంది.

ఇందులో డిజైన్‌కు సంబంధించినంతవరకు మునుపటి మోడళ్లలో లాగా ఉంటుంది. మునుపటి A8 లో చిన్న హెడ్‌ల్యాంప్‌లు మరియు గ్రిల్ ఉన్నాయి. అవి ఇప్పుడు A8 L లో LED మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లు మరియు పెద్ద గ్రిల్‌గా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. కొత్త A8 L ముందు మరియు వెనుక భాగంలో కొత్తగా రూపొందించిన బంపర్లతో పాటు కొత్త టెయిల్ లైట్ క్లస్టర్‌లను కలిగి ఉంటుంది.

కొత్త A8 L లో ఫీచర్స్ గమనించినట్లయితే, ఇందులో వర్చువల్ కాక్‌పిట్ సిస్టమ్, హీటెడ్ సీట్లు, మసాజింగ్ సీట్లు, రెండు టచ్‌స్క్రీన్ డిస్ప్లేలు, బ్యాంగ్ & ఓలుఫ్సేన్ సరౌండ్ సౌండ్ మ్యూజిక్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ తో చుట్టబడిన సీట్లతో పాటు స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా A8 L అనేక ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. కానీ భారతదేశం కొత్త ఎ8 ఎల్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే లభిస్తుందని భావిస్తున్నారు. ఇందులో 3.0-లీటర్, వి6 టర్బో-పెట్రోల్ ఇంజన్ 336 బిహెచ్‌పి శక్తికి దగ్గరగా మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ని పంపింగ్ చేస్తుంది. ఈ ఇంజిన్ 48-వోల్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్‌తో బ్రాండ్ యొక్క మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కలిసి ఉంటుంది మరియు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భద్రతకు సంబంధించినంతవరకు ఆడి A8 L లో ఎయిర్‌బ్యాగులు, డ్రైవ్ మోడ్‌లు, ఆటో పార్క్ అసిస్ట్, ఎబిఎస్ విత్ ఇబిడి, ఇఎస్‌సి మొదలైనవి ఉంటాయి. డ్రైవర్ అసిస్టెన్స్ ప్యాకేజీలో భాగంగా ఆడి ట్రాఫిక్ జామ్ అసిస్ట్‌ను అందిస్తుంది. ఈ కారులో లభించే ఏకైక లెవల్ 3 అటానమస్ సిస్టమ్ వల్ల ఇది 60 కి.మీ / గం వరకు కారును నడపగలదు. ఒక్కసారి లాంచ్ అయిన తర్వాత కొత్త A8 L, జాగ్వార్ XJ L, మెర్సిడెస్ బెంజ్ ఎస్- క్లాస్ మరియు కొత్త బిఎండబ్ల్యు 7 సిరీస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:
ఆడి యొక్క నాల్గవ-తరం అయిన A8 L అనేది జర్మన్ వాహన తయారీ సంస్థ నుండి వచ్చిన ప్రధాన సెడాన్. ఇందులో డిజైన్ మరియు ఫీచర్స్ కొంత అప్డేట్ చేయబడి ఉంటాయి. ఇది ఫిబ్రవరి 2020 న ఇండియన్ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications








