హోండా డబ్ల్యూఆర్-వి ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ స్టార్ట్: ప్రత్యేకతలేంటి?

హోండా కార్స్ ఇండియా సరికొత్త హోండా డబ్ల్యూఆర్-వి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. 2020 హోండా డబ్ల్యూఆర్-వి ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఎన్నో మార్పులు చేర్పులు, అత్యాధునిక అప్‌‌డేట్స్ మరియు బీఎస్6 వెర్షన్‌‌లో వస్తోంది.

హోండా డబ్ల్యూఆర్-వి ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ స్టార్ట్: ప్రత్యేకతలేంటి?

హోండా మోటార్స్ 2020 డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీ మీద అధికారికంగా బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఆసక్తికర కస్టమర్లు 2020 హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో లేదా ఏదేని హోండా డీలర్ ద్వారా రూ. 21,000 బుకింగ్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

హోండా డబ్ల్యూఆర్-వి ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ స్టార్ట్: ప్రత్యేకతలేంటి?

సరికొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి బీఎస్6 మోడల్‌లో సాంకేతికంగా అదే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందిస్తోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా డబ్ల్యూఆర్-వి ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ స్టార్ట్: ప్రత్యేకతలేంటి?

డీజల్ వేరియంట్ కావాలనుకునే వారి కోసం 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌ కూడా అందించారు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ ఇంజన్ గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని ఆప్షనల్ సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఛాయిస్‌లో కూడా ఎంచుకోవచ్చు.

హోండా డబ్ల్యూఆర్-వి ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ స్టార్ట్: ప్రత్యేకతలేంటి?

బీఎస్6 ఇంజన్ అప్‌గ్రేడ్‌తో పాటుు, 2020 హోండా డబ్ల్యూఆర్-వి ఫేస్‌లిఫ్ట్‌లో అత్యాధునిక ఎల్ఈడీ డీఆర్ఎల్స్ జోడింపు గల ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్లతో పాటు ఎక్ట్సీరియర్ పరంగా పలు మైనర్ అప్‌డేట్స్ కూడా జరిగాయి.

హోండా డబ్ల్యూఆర్-వి ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ స్టార్ట్: ప్రత్యేకతలేంటి?

ఫీచర్ల విషయానికి వస్తే, పాత డబ్ల్యూఆర్-విలో ఉన్నటువంటి ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే అతి పెద్ద టచ్‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, సన్‌రూఫ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇంకా ఎన్నో అధునాతన ఫీచర్లు వచ్చాయి.

హోండా డబ్ల్యూఆర్-వి ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ స్టార్ట్: ప్రత్యేకతలేంటి?

బుకింగ్స్ కూడా ప్రారంభం కావడంతో, మరికొన్ని వారాల్లోనే దీని విడుదల ఉండవచ్చు. మునుపటి మోడల్‌తో పోలిస్తే దీని ధర కాస్త అధికంగానే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా డబ్ల్యూఆర్-వి ప్రారంభ ధర రూ. 8.08 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. 2020 హోండా డబ్ల్యూఆర్-వి ధర సుమారుగా రూ. 10,000 నుండి రూ. 15,000 వరకూ పెరిగే అవకాశం ఉంది.

హోండా డబ్ల్యూఆర్-వి ఫేస్‌లిఫ్ట్ మీద బుకింగ్స్ స్టార్ట్: ప్రత్యేకతలేంటి?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మార్కెట్లో ఉన్న పోటీని ఎదుర్కొని, ఆశించిన సేల్స్ సాధించేందుకు కావాల్సిన అప్‌డేట్స్ ఇందులో వచ్చాయి. ఈ మోడల్‌ను తొలిసారిగా మూడేళ్ల క్రితం ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. 2020 వెర్షన్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, మారుతి సుజుకి వితారా బ్రిజా, మహీంద్రా ఎక్స్‌‌యూవీ300, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ మరియు అతి త్వరలో విడుదల కానున్న కియా సోనెట్ మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
2020 Honda WR-V BS6 Facelift Bookings Open Ahead Of India Launch: Here Are All The Details! Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X