Just In
- 38 min ago
మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్చల్ [వీడియో]
- 52 min ago
డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!
- 1 hr ago
ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!
- 2 hrs ago
టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?
Don't Miss
- Lifestyle
ఫేషియల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే ఇలా మారిపోతామా! మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి...
- News
బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసుంటే.. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు
- Movies
ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకులుండాలి…సల్మాన్ బ్రదర్స్ ను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ !
- Sports
RCB vs KKR: అతడు వంగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు.. ఇది కేకేఆర్‌కు పెద్ద తలనొప్పే: వాన్
- Finance
కరోనా-లాక్‌డౌన్‌పై మరోసారి తేల్చి చెప్పిన నిర్మలా సీతారామన్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త సంవత్సరంలో లాంచ్ కానున్న కొత్త టాటా గ్రావిటాస్ : వివరాలు
భారత మార్కెట్లో ప్రముఖ వాహన తయారీదారు టాటా మోటార్స్ కొత్త గ్రావిటాస్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఈ కొత్త టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీని ఇప్పటికే భారతదేశంలో చాలాసార్లు గుర్తించారు. దేశీయ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనున్న ఈ టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఫేస్‌లిఫ్టెడ్ టియాగో, టీగోర్ మరియు నెక్సాన్, నెక్సాన్ ఈవి మరియు ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌తో అప్‌డేట్ చేసిన హారియర్‌ను కంపెనీ ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. దేశీయ మార్కెట్లో ఫేస్ లిఫ్ట్ ఎస్‌యూవీలు మరియు కొత్త మోడల్స్ గత నాలుగు నెలల్లో గణనీయమైన అమ్మకాలను నమోదు చేయడానికి సహాయపడ్డాయి.

మారుతి సుజుకి మరియు హ్యుందాయ్ తరువాత టాటా మోటార్స్ భారత మార్కెట్లో మూడవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. కరోనా మహమ్మారి వాళ్ళ [ఆగిపోయిన అమ్మకాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. టాటా మోటార్స్ కూడా మంచి అమ్మకాలను నమోదు చేస్తోంది.
MOST READ:ఆడి క్యూ 2 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది..చూసారా !

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 7 సీట్ల గ్రావిటాస్‌ను భారత్‌లో విడుదల చేయాలని టాటా మోటార్స్ భావిస్తోంది. ఈ గ్రావిటాస్ ఎస్‌యూవీని ఈ ఏడాది మొదట్లో ఫిబ్రవరి నెలలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించారు,

ఎట్టకేలకు కొత్త టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ ఉత్పత్తి వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. కొత్త టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ విడుదలైన తర్వాత భారత మార్కెట్లో ఉన్న ఎంజి హెక్టర్ ప్లస్, జీప్ కంపాస్ 7 సీటర్, హ్యుందాయ్ క్రెటా 7 సీటర్ వంటి ఎస్‌యూవీలకు ప్రత్యర్థిగా ఉంటుంది.
MOST READ:అప్డేటెడ్ ఫీచర్లతో లాంచ్ అయిన కొత్త బజాజ్ ప్లాటినా 100 కిక్ స్టార్ట్ ; ధర & వివరాలు

గ్రావిటాస్ ఎస్‌యూవీలో అనేక కొత్త మార్పులు జరిగాయి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. 2020 ఆటో ఎక్స్‌పోలోనే ఈ టాటా గ్రావిటాస్ చాలామంది వాహన ప్రియులను ఆకట్టుకుంది. టాటా గ్రావిటాస్ 7 సీట్లు లేదా 6 సీట్లతో మూడు వరుసల లేఅవుట్లో లభిస్తుంది.

రెండవ వరుసలో రెండు కెప్టెన్ సీట్లు ఇవ్వబడతాయి. టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,661 మిమీ, 1,894 మిమీ వెడల్పు మరియు 1,786 మిమీ ఎత్తు ఉంటుంది.
MOST READ:కేవలం 10 నిమిషాల్లో మొత్తం అమ్ముడైన జిఎంసి హమ్మర్ ఈవి పికప్ ట్రక్

గ్రావిటాస్ మోడల్ టాటా హారియర్ ఎస్‌యూవీ కంటే 63 మి.మీ పొడవు, 72 మి.మీ వెడల్పు మరియు 80 మి.మీ ఎత్తు ఎక్కువగా ఉంటుంది. మూడవ వరుస ప్రయాణీకులకు కోసం హెడ్‌రూమ్ మరియు గ్రావిటాస్ రూఫ్ వంటివి చాలా మెరుగుపరచబడ్డాయి.

టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ లోపలి భాగంలో హారియర్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీలో ట్రై-యారో డిజైన్, డ్యూయల్ టోన్ బంపర్, ఎల్‌ఇడి హెడ్‌లైట్, వ్రాప్డ్ అరౌండ్ టెయిల్ లైట్ మరియు ఫ్రంట్ బంపర్‌ల కోసం స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి.
MOST READ:నగరంలో వేలం వేయనున్న వాహనాల జాబితా విడుదల చేసిన హైదరాబాద్ పోలీసులు

గ్రావిటాస్ ఎస్‌యూవీని హారియర్ మాదిరిగా ఎక్స్‌ఇ, ఎక్స్‌ఎమ్, ఎక్స్‌టి మరియు ఎక్స్‌జెడ్ అనే నాలుగు వేరియంట్లలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీలో 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, డిఫరెంట్ బూట్ లిడ్ మరియు టెయిల్ లాంప్ ఉన్నాయి.

కొత్త టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీలో ఫియట్ మాదిరిగానే 2.0 లీటర్ క్రిటెక్ టర్బో డీజిల్ ఇంజన్ ఉండవచ్చు. ఈ ఇంజన్ 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌కి జతచేయబడి ఉంటుంది.

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో గ్రావిటాస్ ఎస్‌యూవీ కాకుండా, మరో రెండు కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా త్వరలో టాటా అల్ట్రోజ్ టర్బో పెట్రోల్ వెర్షన్ మరియు హెచ్‌బిఎక్స్ మినీ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. ఏది ఏమైనా రాబోయే కొత్త సంవత్సరంలో కంపెనీ ఎక్కువ అమ్మకాలను సాధించడానికి ఈ కొత్త వాహనాలు చాలా ఉపయోగపడతాయి.