షాకింగ్ న్యూస్: పెరిగిన టాటా నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ కార్ ధరలు

టాటా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ఎలక్ట్రిక్ కార్ 'నెక్సాన్ ఈ.వి.' ధరలను కంపెనీ భారీగా పెంచింది. ఇప్పుడు ఈ మోడల్‌పై ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ధరలు రూ.26,000 వరకు పెరిగాయి. ధరల పెంపుకు గల కారణాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. పెరిగిన ఉత్పాదక వ్యయమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

షాకింగ్ న్యూస్: పెరిగిన టాటా నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ కార్ ధరలు

నెక్సాన్ ఈ.వి. ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్-ఎస్‌యూవీ. తాజాగా ఈ మోడల్ ధరలను కంపెనీ రూ.26,000 మేర పెంచినప్పటికీ, ఈ మోడల్ ఇంకా సరసమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగానే కొనసాగుతుంది. టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈ.వి. ఎక్స్‌జెడ్+ మరియు ఎక్స్‌జెడ్+ లక్స్ వేరియంట్ల ధరలను పెంచింది.

షాకింగ్ న్యూస్: పెరిగిన టాటా నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ కార్ ధరలు

కాగా, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని బేస్ వేరియంట్ ఎక్స్‌ఎమ్ ధరను మాత్రం కంపెనీ పెంచలేదు. మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ (ఇండియా) ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా కొనసాగుతుంది. టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో తమ నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలోని ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఈవీలలో ఇది ఒకటిగా కొనసాగుతోంది.

MOST READ:ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

షాకింగ్ న్యూస్: పెరిగిన టాటా నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ కార్ ధరలు

టాటా నెక్సాన్ ఈవి కారు 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది, ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ గరిష్టంగా 129 బిహెచ్‌పి శక్తిని మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది.

షాకింగ్ న్యూస్: పెరిగిన టాటా నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ కార్ ధరలు

కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఈ డ్రైవింగ్ రేంజ్ అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది, ఫలితంగా వాస్తవ వినియోగంలో ఈ రేంజ్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని రియల్-వరల్డ్ మైలేజ్ 250 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల మధ్యలో ఉండొచ్చని అంచనా.

MOST READ:ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

షాకింగ్ న్యూస్: పెరిగిన టాటా నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ కార్ ధరలు

హోమ్ ఛార్జర్ ద్వారా నెక్సాన్ ఈ.వి కారు పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో బ్రేక్ రీజనరేషన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. బ్రేకింగ్ వేసిన ప్రతిసారి ఇందులోని బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, ఫలితంగా డ్రైవింగ్ పరిధి పెరుగుతుంది.

షాకింగ్ న్యూస్: పెరిగిన టాటా నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ కార్ ధరలు

ఈ కారులోని కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, పూర్తి-ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:తండ్రి ఇచ్చిన కారును అంబులెన్స్‌గా మార్చిన వ్యక్తి.. ఎందుకో తెలుసా ?

షాకింగ్ న్యూస్: పెరిగిన టాటా నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ కార్ ధరలు

ఇంకా ఇందులో లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, రివర్స్ పార్క్ అసిస్ట్ కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా ఎస్‌యూవీని నియంత్రించడానికి బ్రాండ్ యొక్క కనెక్టెడ్ టెక్నాలజీ మరియు 35 రకాల కమాండ్స్ కూడా ఉన్నాయి.

షాకింగ్ న్యూస్: పెరిగిన టాటా నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ కార్ ధరలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగంలో లభిస్తున్న ఇతర వాహనాలతో పోలిస్తే, టాటా నెక్సాన్ ఈ.వి. స్థిరమైన అమ్మకాలతో బెస్ట్ సెల్లింగ్ ఈ.వి.గా కొనసాగుతోంది. ప్రైవేటు కొనుగోలుదారులతో పాటు, అనేక ప్రభుత్వ సంస్థలు కూడా పర్యావరణాన్ని కాపాడే దిశగా అడుగులు వేస్తూ గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తున్నారు.

MOST READ:అమేజింగ్.. ఒకే బస్సుని 10 లక్షల కి.మీ డ్రైవ్ చేసిన డ్రైవర్

షాకింగ్ న్యూస్: పెరిగిన టాటా నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ కార్ ధరలు

టాటా నెక్సాన్ ఈ.వి. ధరల పెరుగుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈ.వి మిడ్ వేరియంట్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ల ధరలను స్వల్ప తేడాతో పెంచింది. అయితే, ఇందులో ప్రారంభ వేరియంట్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ మోడల్ ధరలు పెరిగినప్పటికీ, ఇది దేశంలో ఇప్పటికీ అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్‌గానే కొనసాగుతుంది.

Most Read Articles

English summary
Tata Motors has increased the prices of its Nexon EV electric-SUV in the Indian market. The company has increased the prices of the Nexon EV by up to Rs 26,000 depending on the variant of the electric-SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X